పరిపాలనా సంబంధాలు - భాగము XI. ప్రకరణలు 256-263

TSStudies
0

ఇతర భాగాల్లోని ప్రకరణలు (18వ భాగం)

ప్రకరణ 352 ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా కేంద్రం రాష్ట్ర జాబితాలో చట్టాలు చేయవచ్చు.

ప్రకరణ 356 ప్రకారం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రజాబితాలోని. అంశాలపై రాష్ట్ర శాసనసభ తరపున, పార్లమెంటు చట్టాలను రూపొందించవచ్చు.

పరిపాలనా సంబంధాలు - భాగము XI. ప్రకరణలు 256-263
కేంద్ర, రాష్ట్రాల మధ్య సాధారణ పరిస్థితుల్లో గల పరిపాలనా సంబంధాల గురించి విసృతంగా ఈ భాగములో పొందుపరిచారు. ఈ సంబంధాలనే మునిసిపల్‌ సంబంధాలు అని కూడా అంటారు. దైనందిన పరిపాలన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది.
ప్రకరణ 256 ప్రకారం, ప్రతి రాష్ట్రప్రభుత్వం తన కార్యనిర్వహణాధికారాలను పార్లమెంటు చేసిన చట్టాలకు లోబడి వినియోగించాలి. ఇందుకోసం రాష్ట్రాలకు కొన్ని పరిపాలనా ఆదేశాలను కేంద్రం జారీ చేయవచ్చు.
ప్రకరణ 257 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహణాధికారాలను కేంద్రం నియంత్రించవచ్చు. రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునే సందర్భంలో అని కేంద్ర ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించే విధంగా ఉండరాదు.
కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు, మొదలగు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆస్థూలను రాష్ట్రాలు పరిరక్షించాలి, వాటి పరిరక్షణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తిరిగి చెల్లిస్తుంది.
ప్రకరణ 258 ప్రకారం, సంబంధిత రాష్ట గవర్నర్‌ యొక్క అంగీకారంతో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పాలనా విధులను, షరతులతో లేదా షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి బదలాయించవచ్చు.
ప్రకరణ 258A ప్రకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో, షరతులతో లేదా షరతులు లేకుండా, రాష్ట పభుత్వ పాలనా విధులను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్‌ బదలాయించవచ్చు.
ప్రకరణ 258A లో ఉన్న అంశాలను 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
ప్రకరణ 259ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
ప్రకరణ 260 ప్రకారం, భారత ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా, భారతదేశం బయట ఉన్న భూభాగాల పరిపాలనను చేపట్టవచ్చు.
ప్రకరణ 261 ప్రకారం, దేశంలో వివిధ రాష్ట్రప్రభుత్వాలు, సంస్థలు జారీ చేసిన ధృవపత్రాలను,. పబ్లిక్‌ రికార్డులను న్యాయతీర్పులపై నమ్మకముంచి గౌరవించాలి.

నదీ జలాల వివాదాలు 
ప్రకరణ 262(1) ప్రకారం, అంతర్‌రాష్ట్ర నదీజలాలు, నదీలోయలకు చెందిన జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంటు ప్రత్యేక టబ్రిబ్యునళ్లను ఏర్పాటు చేయవచ్చు.
ప్రకరణ 262(2) ప్రకారం నదీ జలాల వినియోగాలకు సంబంధించి ఫిర్యాదులను లేదా వివాదాలను విచారించే అధికారం సుప్రీంకోర్టు లేదా మరేదైనా న్యాయస్థానం పరిధి నుండి మినహాయిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

ప్రత్యేక వివరణ
1956లో పార్లమెంటు అంతర్‌రాష్ట్ర నదీజలాల చట్టాన్ని రూపొందించింది. అంతర్‌రాష్ట్ర నదీజలాల వివాదాలను పరిష్కరించడానికి  ప్రత్యేక ట్రిబ్యునళ్ళను ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ట్రిబ్యునళ్ళు ఏర్పాటయితే, అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ పరిధి నుండి మినహాయించబడతాయి.

అంతర్‌ రాష్ట్ర మండలి .
ప్రకరణ 263 ప్రకారం, భారత రాష్ట్రపత్తి ఒక అంతర్‌రాష్ట్ర మండలి ఏర్పాటు చేయవచ్చు. అంతర్‌రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి హోదారీత్యా అధ్యక్షుడిగా ఉంటాడు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు ఇందులో సభ్యులుగా ఉంటారు. . అంతర్‌రాష్ట్ర వివాదాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేసి సలహాలు ఇస్తారు. మొదటి సారిగా 1990లో అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)