భారత రాజ్యాంగం - పరిణామ క్రమం (Evolution of Indian Constitution Previous Govt Exams Bits)
గతప్రశ్నలు: 1990 నుండి వివిధ పోటీ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు
1. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్య నిర్వహణ అధికారం ఎవరికి ఉండేది
ఎ) బ్రిటీషు.రాణి/రాజు
బి) ఇంగ్లాండు పార్లమెంటు
సి) సమాఖ్య శాసనసభ
డి) కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్
2. చాలా. సం.లకు మునుపే మనము విధి/అదృష్టముతో నిర్ణీత సమాగమం చేసితిమి అని చెప్పినది.
ఎ) వల్లభ్‌భాయ్‌పటేల్
బి) జవహార్‌లాల్ నెహ్రూ
సి) రాజ్‌గోపాల్
డి) బి.ఆర్. అంబేద్కర్
3. సెప్టెంబరు, 2 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది.
ఎ) సైమన్ కమీషన్.
బి) క్రిప్స్ మిషన్
సి) వేవెల్ ష్లాన్
డి) క్యాబినెట్ మిషన్ ప్లాన్
4. స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఎందులో సభ్యుడు
ఎ) కన్సర్వేటివ్ పార్టీ
బి) లిబరల్ పార్టీ
సి) లేబర్ పార్టీ
డి) అధికార ్రేణి
5. బ్రిటీష్‌వారు బెంగాల్‌లో సుప్రీంకోర్టును ఏ సం.లో ఏర్పాటు చేశారు.
ఎ) 1776
బి) 1775
సి) 1777
డి) 1774
6. బ్రిటీషు ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయోపరిమితిని 1878లో 19 సం.లకుతగ్గించింది. మళ్ళీ ఏ సం. నుండి దాన్ని 24 సం. వరకు పెంచారు.
ఎ) 1892
బి) 1905
సి) 1906
డి) 1924
7. 1779 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని వ్యవహరిస్తారు.
ఎ) ఛార్జర్ చట్టాలు
బి కౌన్సిల్ చట్టాలు
సి) క్రౌన్ చట్టాలు
డి) పైవి ఏవీకాదు
8. 1833 ఛార్జర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ క్రింది వాటిలో సరికానిది
ఎ) ఈస్టు ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేసింది.
బి) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది
సి) కౌన్సిల్ న్యాయచట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇవ్వబడింది.
డి) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు.
9. క్రింది వాటిలో సరైనది
ఎ) బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్
జనరల్ వారెన్ హేస్టింగ్స్
బి) రెగ్యులేటింగు చట్టం - 1778 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటుకు ప్రతిపాదన
సి) పై రెండు
డి) పై రెండూ కాదు
10. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి
ఎ) రెండు బి) మూడు సి) ఐదు డి) ఆరు
11. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
ఎ) వాట్సన్ బి) రాబర్ట్ క్లైవ్ సి) డూప్లెక్స్ డి) వారెన్ హేస్టింగ్స్
12. ఏ రోజున ఇండియా పాలనను బ్రిటీష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది?
ఎ) 1-11-1858
బి) 1-11-1857
సి) 1-12-1859
డి) 1-12-1857
13. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన అంశం/ అంశాలు
ఎ) రాష్ట్రాల కార్య నిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
బి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వచించింది.
సి) కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం
డి) పైవన్నియు
14. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి కల్పించడానికి ఉద్ధేశించబడింది?
ఎ) ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం, 1861
బి) ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం, 1862
సి) ఇండియన్ కాన్సిళ్ళ చట్టం, 1909
డి) గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ చట్టం, 1919
15. “గట్టి 'బ్రేకులు ' వుండి ఇంజన్ లేని యంత్రం” అని నెహ్రూ దేనిని అన్నాడు?
ఎ) కాబినెట్ ష్లాన్
బి) మౌంట్ బాటన్ ష్లాన్
సి) వేవెల్ ష్లాన్
డి) 1935- భారత ప్రభుత్వ చట్టం
16. మతతత్వ నియోజక వర్గాల పితామహుడిగా ఎవరి పిలుస్తారు?
ఎ) లార్డ్ మింటో
బి) లార్డ్ బెంటింక్
సి) వారెన్ హేస్టింగ్స్
డి) రాబర్ట్ క్లైవ్
17. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ద్వారా ఏర్పడినది?
ఎ) ఛార్జర్ చట్టం, 1833
బి) ఛార్జర్ చట్టం, 1853
సి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861
డి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1892
18. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం
ఎ) సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం
బి) రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడం
సి) బ్రిటీష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి
డి) ఆ కాలంలో చెలరేగిన మతకల్లోలాలను నివారించుటకై ప్రణాళిక .
19. ఈ క్రింది వానిలో ఏది ఉడ్స్ డిస్పాచ్ (తాకీదు) 1854 సిఫారసు కానిది?
ఎ) సాంకేతిక విద్య, మహిళా విద్య కొరకు స్కూల్స్ ఏర్పాటు చేయడం
బి) ప్రైవేటు భాగస్వామ్యం కొరకు గ్రాంట్లు ఇవ్వడం
సి) విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు
డి) బొంబాయి, బెంగాల్ మర్తియు మద్రాస్‌లలో ఒక్కో యూనివర్సిటీ ఏర్పాటు
20. ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు.
ఎ) ఇండియన్ కౌన్సిల్స్ చట్టము, 1892
బి) భారత ప్రభుత్వ చట్టము, 1909
సి) భారత ప్రభుత్వ చట్టము, 1919
డి) గాంధి-ఇర్విన్ ఒడంబడిక
21. 1947 స్వతంత్ర భారతదేశంలో మొదటి మంత్రి మండలిలో న్యాయ శాఖ మంత్రి
ఎ) వి.ఎన్స్ గాడ్గిల్
బి) రాజేంద్ర ప్రసాద్
సి) జాన్ మథాయ్
డి) బి.ఆర్. అంబేద్కర్
22. క్రింది వానిలోని ఒక అంశమును భారత రాజ్యాంగం గవర్నమెంటు ఆఫ్ ఇండియా ఆక్ట్ 1935 నుండి స్వీకరించలేదు?
ఎ) గవర్నర్ ఆఫీసు
బి) అత్యవసర పరిస్థితుల్లో వాడవలసిన అధికారాలు
సి) సమాఖ్య విధానం
డి) చట్టబద్ధమైన పరిపాలన
సమాధానాలు
1. డి 2 బి 3. డి 4. సి 5. డి 6.ఎ 7.ఎ 8.డి 9సి 10. బి 11 బి 12 ఎ 13-డి 14 ఎ 15. డి 16 ఎ 17 బి 18.సి 19.సి 20.సి 21 డి 22.డి