భారత రాజ్యాంగం - పరిణామ క్రమం (Evolution of Indian Constitution Practice Bits in Telugu)
1) రాజ్యాంగ వాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త.
ఎ) అరిస్టాటిల్
బి) రూసో
సి) చార్లెస్ డార్విన్
డి) ప్లేటో
2) ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యంగా వర్ణిస్తారు.
ఎ) పిట్ ఇండియా చట్టం - 1784
బి) రెగ్యులేటింగ్ చట్టం - 1773
సి) చార్టర్ చట్టం 1813
డి) చార్టర్ చట్టం - 1853
3) దేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వపాలనకు నాంది ప్రస్తావన జరిగింది.
ఎ) రెగ్యులేటింగ్ చట్టం - 1773
బి) ఛార్జర్ చట్టం - 1853
సి) కౌన్సిల్ చట్టం - 1858
డి) పిట్ ఇండియా చట్టం - 1784
4) భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని తొలగించిన చట్టం
ఎ) 1813
బి) 1861
సి) 1909
డి) 1919
5) గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్ జారిచేసే అవకాశాన్ని కల్పించిన చట్టం
ఎ) 1909
బి) 1919
సి) 1935
డి) 1861
6) మత ప్రాతిపదికన మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం.
ఎ) 1909
బి) 1919
సి) 1985
డి) పైవేవీ కాదు
7) దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభాపద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు.
ఎ) 1958
బి) 1909
సి) 1919
డి) 1935
8) రాష్ట్రాలలో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం
ఎ) 1935
బి) 1919
సి) 1909
డి) పైవేవీ కావు
9) భారత ప్రభుత్వ చట్టం - 1935లోని సరికాని అంశం.
ఎ) ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు
బి) సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన
సి) ఆర్.బి.ఐ. ఏర్పాటు
డి) సార్వజనీన ఓటుహక్కు
10) ఈ క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చు చేశారు.
ఎ) 1833
బి) 1813
సి) 1861
డి) 1858
11) రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం
ఎ) 1909
బి) 1919
సి) 1985
డి) 1955
12) భారతదేశంలో మత ప్రాతివదిక, ప్రాతినిధ్య పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు.
ఎ) లార్డ్ కర్జన్
బి) లార్డ్ విలియం బెంటింక్
సి) లార్డ్ మింటో
డి) ఛెమ్స్‌ఫర్డ్
13) సైమన్ కమీషన్ ముఖ్య ఉద్దేశము
ఎ) 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం
బి) రాజ్యాంగపరిషత్తు ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించడం
సి) డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం
డి) పైవన్నీ
14) కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం
ఎ) హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదిర్చే ప్రతిపాదన
బి) మైనారిటీల ప్రాతినిధ్య పథకం
సి) బలహీనుల వర్గాల ప్రత్యేక ప్రాతినిధ్య పరిపాలన
డి) పైవన్ని
15) ఈ క్రింది ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్భా స్వాతంత్ర్యాలను మాగ్నా కార్టాగా పేర్కొంటారు.
ఎ) వేవెల్ ప్రతిపాదన
చి) క్రిప్సు ప్రతిపాదన
సి) క్యాబినెట్ రాయబార ప్రతిపాదన
డి) విక్టోరియా రాణి ప్రకటన
16) మహాత్మాగాంధి హాజరయిన రౌండ్ టేబుల్ సమావేశము
ఎ) ఒకటవ రౌండ్ టేబుల్ సమావేశం
బి) రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
సి) మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
డి) పైవేవీ కావు.
17) భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతనపత్రంగా వర్ణించినది
ఎ)కె.టి.షా'
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) మహాత్మా గాంధీ
డి) సరూర్ పటేల్
18) ఈ క్రింది ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటయింది.
ఎ) క్యాబినెట్ ప్రతిపాదనలు
బి) మౌంట్ బాటన్ ప్రతిపాదనలు
సి) క్రిప్స్ ప్రతిపాదనలు
డి) పైవేవీ కావు
19) తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరము
ఎ) 1946 సెప్టెంబర్ 2
బి) 1946 అక్టోబర్ 2
సి 1946 నవంబర్ 1
డి) 1947 నవంబర్ 1
20) బ్రిటీషు పార్లమెంటు భారత స్వతంత్ర్య చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది.
ఎ) 1947 ఆగస్టు 15
బి). 1947 జూన్ 18
సి) 1947 జులై 18
డి 1947 ఏప్రిల్ 18
సమాధానాలు
1.ఎ 2.బి 3.డి 4ఎ 5.డి 6.ఎ 7.సి 8.ఎ 9.డి 10.ఎ 11.బి 12.సి 13.ఎ 14.డి 15.డి 16.బి 17.బి 18.ఎ 19.ఎ 20.సి