భారత సమాఖ్య వ్యవస్థ-ప్రాంతీయ మండలాలు

TSStudies
0
ప్రాంతీయ మండలాలు (Zonal Councils)
జోనల్‌ కౌన్సిళ్ళు చట్టపర సంస్థలు. 1956లో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేశారు.
దేశాన్ని ఐదు జోన్లుగా విభజించారు. వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. కేవలం చట్ట ప్రతిపత్తి (Statutory Status) కలిగిఉంది. అవి
  • ఉత్తర మండలం - ఇందులో జమ్ము కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, చండీఘర్‌, రాజస్థాన్‌ మరియు ఢిల్లీ రాష్రాలున్నాయి. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
  • ధక్షిణ మండలం - ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
  • పశ్చిమ మండలం - గుజరాత్‌, మహారాష్ట్ర గోవా, దాద్రా మరియు నాగర్‌ హవేలి, డామన్‌ మరియు డయ్యు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
  • తూర్పు మండలం - బీహార్‌, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ మరియు ఒరిస్సా. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.
  • మద్య మండలం-ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, చత్తీస్‌ఘడ్‌ మరియు మధ్యప్రదేశ్‌. దీని ప్రధాన కార్యాలయం అలహాబాద్‌లో ఉంది.
  • ఈశాన్య మండలం - పైన పేర్కొన్న ఐదు జోన్లకు అదనంగా ఈశాన్య మండలాన్ని ప్రత్యేకంగా పార్లమెంటు చట్టం ద్వారా 1971లో ఏర్పాటు చేశారు. ఇందులో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలున్నాయి. సిక్కిం రాష్ట్రాన్ని ఎనిమిదవ రాష్ట్రంగా (ఈశాన్య రాష్ట్రాలలో) 1994లో ఈశాన్య మండలంలో చేర్చారు. దీని ప్రధాన కార్యాలయం షిల్లాంగ్‌ (మేఘాలయ)లో ఉంది.

నిర్మాణం
ప్రతి జోనల్‌ కౌన్సిల్‌లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు ఇతర మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులు, ప్రణాళికా సంఘం నామినేట్‌ చేసిన ఒక సభ్యుడు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల అభివృద్ధి కమీషనర్‌లు నభ్యులుగా ఉంటారు. కేంద్ర హోం శాఖా మంత్రి జోనల్‌ కౌన్సిళ్ళలకు ఉమ్మడి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే ఆ జోన్‌లోని రాష్ట్ర ముఖ్యమంత్రులు, రొటేషన్‌ పద్ధతిలో ఒక సంవత్సర కాలానికి వైస్‌ ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు.

విధులు
  • దేశంలో ప్రజల మధ్య భావ సమగ్రతను సాధించడం
  • మితిమీరిన ప్రాంతీయ వాదాన్ని, భాషా వాదాన్ని రాష్ట్ర వాదాన్ని నియంత్రించడం
  • రాష్ట్రాల విభజన తర్వాత ఏర్పడిన పరిణామాలను పరిష్కరించి, ఆర్థిక అభివృద్ధి మరియు సమగ్రతల మధ్య సమన్వయాన్ని సాధించడం
  • కేంద్రం యొక్క సహకారంతో సామాజిక, ఆర్థిక అంశాలలో ఏకరూపకతను సాధించడం
  • విభిన్న ప్రాంతాల మధ్య ఒకే రకమైన రాజకీయ సమానత్వాన్ని సాధించడం
  • జోనల్‌ కౌన్సిల్‌ విధులన్నీ సలహాపూర్వకమైనవే

Post a Comment

0Comments

Post a Comment (0)