భారత రాజ్యాంగం రచన-Nature and Salient Features of Indian Constitution Previous Exam Papers Bits in Telugu
గతప్రశ్నలు: 1990 నుండి వివిధ పోటీ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు (సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, జె.ఎల్, డి.ఎల్,, నెట్స్ సెట్ మొ)
1. భారత రాజ్యాంగానికి ఈ క్రింది ఏ లక్షణాన్ని ఆపాదించలేము
ఎ) శాసన శాఖ ఆధిక్యత
బి న్యాయ శాఖ ఆధిక్యత
సి) కార్యనిర్వాహక శాఖ ఆధిక్యత
డి) పైవన్నియు
2. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం
ఎ) అమెరికా
బి) కెనడా
సి) జపాన్
డి) ఆస్ట్రేలియా
3. ఈ క్రిందివాటిలో ఏదిసరిగా జతపరచబడినది
ఎ) 8వ షెడ్యూల్ - అధికార భాషలు
బి) 2వ షెద్యూల్ - జీతభత్యాలు
సి) 4వ షెడ్యూల్ - రాజ్యసభలో రాష్ట్రాల స్థానాలు
డి) పైవన్నియు సరైనవి
4. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేర్చబడిన అంశాలు
ఎ) ప్రాథమిక విధులు
బి) ట్రిబ్యునల్
సి) సహకార సంస్థలు
డి) పైవన్నియు
5. భారత సమాఖ్య స్వభావం
ఎ) సిద్ధాంత సమాఖ్య
బి) అర్ధ సమాఖ్య
సి) విశిష్ట సమాఖ్య
డి) బేరసారాల సమాఖ్య
6. పార్లమెంటరీ వ్యవస్థకు మరొక పేరు
ఎ) క్యాబినెట్ ప్రభుత్వం
బి) ప్రధానమంత్రి ప్రభుత్వం
సి) పై రెండూ
డి) పై రెండూ కాదు
7. భారత రాజ్యాంగ సవరణ స్వభావం
ఎ) అధృఢ
బి) ధృఢ
సి) మౌలికంగా అధృఢమైనది
డి) మౌలికంగా ధృఢమైనది
8. భారత న్యాయ వ్యవస్థ లక్షణం కానిది
ఎ) ఏకీకృత
బి) స్వతంత్ర
సి) ఆశ్రిత పక్షపాత
డి) పైవేవీ కాదు
9. భారత శాసన సభ లక్షణం కానిది
ఎ) కేంద్రంలో ద్విసభా విధానం
బి రాష్ట్రాలలో ద్విసభా విధానం ఐచ్చికం
సి) అన్ని సభలకు ప్రత్యక్ష ఎన్నికలు
డి) పైవేవి కాదు
10. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన రాజ్యాంగ సంస్థ
ఎ) జాతీయ ఎస్.సి., ఎస్.టి. కమీషన్
బి) జాతీయ మైనారిటీ కమీషన్
సి) జాతీయ మానవ హక్కుల కమీషన్
డి) పైవన్నియు
11. భారత రాజ్యాంగం సుదీర్ధమైనది కారణాలు గుర్తించండి
ఎ) ఇతర రాజ్యాంగాల ప్రభావం
బి) భారత దేశ వైవిధ్యం
సి) రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకపోవడం
డి) పైవన్నియు
12. రెండవ షెడ్యూల్‌లో ఎవరి జీతభత్యాలు పేర్కొనలేదు
ఎ) పార్లమెంటు సభ్యులు
బి) స్పీకర్, డిప్యూటీ స్పీకర్
సి) కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
డి) గవర్నర్
13. భారత రాజ్యానికి అమెరికా రాజ్యాంగానికి పోలిక
ఎ) సమాఖ్య వ్యవస్థ
బి) న్యాయసమీక్ష
సి) ప్రాథమిక హక్కులు
డి) పైవన్నియు
14. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ క్రింది వానిలో తప్పుగా జతపర్చబడినది ఏది.
ఎ) రూల్స్ కమిటీ - రాజేంద్రప్రసాద్
బి) అడ్వయిజరీ కమిటీ - వల్లభాయ్ పటేల్
సి) స్టీరింగ్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
డి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం - జె.బి. కృపలాని
15. రాజ్యాంగ మౌలిక లక్షణము కానిది
ఎ) సమాఖ్య
బి) లౌకికవాదము
సి) న్యాయసమీక్షాధికారము
డి) న్యాయస్థానక్రియాశీలత
16. భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారు అయ్యింది.
ఎ) అక్టోబర్ 1946
బి) అక్టోబర్ 1947
సి) అక్టోబర్ 1948
డి) పైవేవియు కాదు
17. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం
ఎ) పార్లమెంటు
బి) రాష్ట్రపతి
సి) ప్రజలు
డి) న్యాయ శాఖ
18. మౌలిక రాజ్యాంగంలో ఉండిన ప్రకరణల సంఖ్య
ఎ) 395
బి) 315
సి) 420
డి) 465
19. ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది
ఎ) ప్రజలు
బి) పత్రికలు
సి) రాజ్యాంగం
డి) పార్లమెంటు
20. పీఠికలోని అంశాలు
ఎ) రాజ్యాంగంపై ఆధారపడి ఉంటాయి.
బి) రాజ్యాంగంపై ఆధారపడి ఉండవు
సి) కొంత మేరకు ఆధారపడి ఉంటాయి.
డి) పైవేవి కావు
21. మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు.
ఎ) లౌకిక వాదం
బి) స్వామ్య వాదం
సి) నాస్తిక వాదం
డి) మతరహిత వాదం
22. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఉండేది ఎవరు
ఎ) పాలకులు
బి) కేంద్ర శాసనసభ
సి) న్యాయ శాఖ
డి) ప్రజలు
23. ప్రవేశికలో లేని పదం
ఎ) సమాఖ్య
బి) ఐక్యత
సి) న్యాయం
డి) సమగ్రత
24. లౌకికవాదం అనే పదం ప్రవేశికలో చేర్చడానికి కారణం
ఎ) లౌకిక వాదాన్ని స్పష్టీకరించడం
బి) లౌకిక వాదాన్ని ద్విగుణీకృతం చేయడం
సి) పై రెండూ సరైనవి
డి) పై రెండూ సరికావు
25. ప్రవేశిక ఉపయోగం
ఎ) రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది
బి) రాజ్యాంగ ఆధారాలను తెలియజేస్తుంది
సి) పై రెండు సరైనవి
డి) పై రెండు సరికావు
26. ప్రవేశిక పేర్కొనబడిన మొత్తం ఆదర్శాలు ఎన్ని
ఎ) 8
బి) 9
సి) 10
డి) 11
సమాధానాలు
1.డి 2.ఎ 3.డి 4.డి 5.సి 6.సి 7.డి 8.సి 9.సి 10.ఎ 11 డి 12.ఎ 13.డి 14.సి
15.డి 16.సి 17.సి 18.ఎ 19.సి 20.బి 21ఎ 22.డి 23.ఎ 24 సి 25సి 26.డి