Indian Constitution Practice Bits-5

TSStudies
0
Nature and Salient Features of Indian Constitution Previous Exams Bits in Telugu

భారత రాజ్యాంగం రచన-Nature and Salient Features of Indian Constitution Practice Exam Bits in Telugu

నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు


1. కేబినెట్‌ మిషన్‌ ప్రణాళిక క్రింద భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ రోజున ఏర్పడింది?

ఎ) 16-05-1946 

బి) 16-05-1947

సి) 14-06-1946 

డి) 14-06-1947

2. భారత రాజ్యాంగ పరిషత్‌ ఆఖరిసారిగా ఎప్పుడు సమావేశమైంది

ఎ) 24-1-1950 

బి) 26-1-1950

సి) 15-8-1947 

డి) 26-11-1949

3. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన రోజు

ఎ) ఆగస్టు 15, 1947 

బి) జనవరి 30, 1948

సి) జనవరి 26, 1950 

డి) నవంబర్‌ 26, 1950

4. భారత రాజ్యాంగము ఎన్ని రోజుల్లో తయారు చేయబడినది

ఎ) 2సం. 11 నెలలు 10 రోజులు 

బి) 2సం. 11 నెలు 18 రోజులు

సి) ౩సం. 10 నెలలు 10 రోజులు

డి) 3సం.  11 నెలలు 18 రోజులు

5. హిందీని కేంద్రప్రభుత్వ భాషగా రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది.

ఎ) సెప్టెంబర్‌ 14, 1949

బి) ఆగస్ట్‌ 15, 1947

సి) నవంబర్‌ 26, 1949 

డి) జనవరి 26, 1950

6. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారు

ఎ) బి.ఎన్‌. రావు 

బి) పి.సి. రావు

సి) ఎం.సి. షతల్‌ 

డి) బి.ఆర్‌. అంబేద్కర్ 

7. ఇండియాలో రాజ్యాంగ అధికారం యొక్క ముఖ్యమైన మూలాధారం?

ఎ) ప్రజలు 

బి) రాజ్యాంగము

సి) పార్లమెంటు 

డి) అసెంబ్లీ

8. భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు

ఎ) కె.ఎమ్‌. మున్షీ 

బి) ఎ. కృష్ణస్వామి అయ్యర్‌

సి) ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌

డి) పై వారందరూ

9. రాజ్యాంగ రచనా కమిటి సభ్యుల సంఖ్య

ఎ) 6 

బి) 7 

సి) 8 

డి) 5 

10. రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుదెవరు

ఎ) బి.ఆర్‌. అంబేద్కర్‌

బి) డా. రాజేంద్రప్రసాద్‌

సి) డా. రాధాకృష్ణన్‌

డి) అనంత అయ్యంగార్‌

11. కిందివారిలో రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన యూనియన్‌ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు?

ఎ) బి.ఆర్‌. అంబేద్కర్‌

బి) జె.బి. కృపలాని

సి) జవహర్‌లాల్‌ నెహ్రూ

డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

12. భారత రాజ్యాంగంపై మొట్ట మొదటి గ్రంథ రచయిత

ఎ) బి.ఆర్‌. అంబేద్కర్‌

బి) దుర్గాదాస్‌ బసు

సి) హెచ్‌.ఎమ్‌. శీర్వామ్‌ 

డి) జవహర్‌ లాల్‌ నెహ్రు

13. రాజ్యాంగ పరిషత్తులో ఎలాంటి చర్చ, ఓటింగ్‌ లేకుందా ఆమోదింపబడిన ఏకైక అంశం

ఎ) ప్రవేశిక 

బి) ప్రాథమిక హక్కులు

సి) ఆదేశిక నియమాలు 

డి) సార్వజనీన ఓటు హక్కు

14. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు వాటిఅధ్యక్షులకు సంబంధించిన ఈ క్రింది వానిలో తప్పుగాజతపర్చబడినది ఏది?

ఎ) రూల్స్‌ కమిటీ - డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌

బి) అడ్వయిజరీ కమిటీ - వల్లభ్‌భాయ్‌ పటేల్‌

సి) స్టీరింగ్‌ కమిటీ - జవహర్‌లాల్‌ నెహ్రూ

డి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం - జె.బి. కృపలాని

15. క్రిందివానిలో ఏది భారత రాజ్యాంగ విధానం కాదు

ఎ) అధ్యక్ష తరహా ప్రభుత్వం

బి న్యాయ వ్యవస్థకు సంబంధించిన స్వాతంత్ర్యం

సి) సమాఖ్యాత్మక ప్రభుత్వం

డి) సర్వతంత్ర ప్రజారాజ్యానికి చెందిన ప్రభుత్వం

16. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచినవి.

ఎ) ప్రాథమిక హక్కులు - అమెరికా

బి) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం - ఇంగ్లాండ్‌

సి) అత్యవసర పరిస్థితి ఏర్పాటు - జర్మనీ

డి) ఆదేశిక సూత్రాలు - ఆస్టేలియా

17. తప్పుగా జతపర్చబడినది ఏది.

ఎ) అబ్దుల్ కలాం ఆజాద్‌ - ముస్లింలు

బి) హెచ్‌.సి. ముఖర్జీ - బెంగాలీలు

సి) హెచ్‌.పి. మోడి - పార్సీలు

డి) ఫ్రాంక్‌ ఆంథోని - ఆంగ్లో ఇండియన్స్‌

18. ఈ క్రిందివాటిలో ఏది సరిగా జతపరచబడినది

ఎ) రాజ్యాంగ రచనలలో స్నేహితుడు, తత్త్వవేత్త, మార్గదర్శి       1. లార్డ్‌ సైమన్‌ 

బి భారతరాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం                                  2. ఐవర్‌ జెన్నింగ్స్‌ 

సి) భారత రాజ్యాంగం సామాజిక విప్లవ దీపిక                3. బి.యన్‌. రావ్‌ 

డి) రాజ్యాంగ పరిషత్తు హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది.     4. గ్రాన్‌ విల్లె ఆస్టిన్‌ 

ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4

బి ఎ-2, బి-3, సి-1, డి-4

సి) ఎ-4, బి-1, సి-3, డి-2 

డి) ఎ-3, బి-2, సి-4 డి-1

19. భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక (ఒరిజినల్‌) అంశాలు

1) అఖిల భారత సర్వీసులు

2) పంచాయతీరాజ్‌ వ్యవస్థ

3) రక్షిత వివక్షత

4) రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం

ఎ) 1, 2 మాత్రమే 

బి) 3, 4 మాత్రమే

సి) 1, 3 మాత్రమే 

డి) 1, 2, 3, 4 

20. ఈ క్రిందివాటిలో ఏది సరైనది

1. ముసాయిదా రాజ్యాంగంలో ప్రకరణల సంఖ్య - 315

2. మౌలిక రాజ్యాంగంలో ప్రకరణల సంఖ్య - 395

3. ప్రస్తుత రాజ్యాంగంలో ప్రకరణల సంఖ్య - 465

4. కొత్తగా చేర్చబడిన ప్రకరణలు  - 89

ఎ) 1, 2 మాత్రమే 

బి) 3, & మాత్రమే

సి) 1, 3 మాత్రమే 

డి) 1, 2, 3, 4 

21. క్రిందివాటిలో ఏది సరైనది

1. అమెరికా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం - 4 నెలలు

2. ఆస్ట్రేలియా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం - 9సం॥

3. కెనడ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం - 2 1/2 సం॥

4. ఫ్రాన్స్‌ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం - 1 సం॥

ఎ) 1, 2 మాత్రమే 

బి) 3, 4 మాత్రమే

సి) 1, 3 మాత్రమే 

డి) 1, 2, 3, 4 

22. క్రింది వాటిలో ఏది సరైనది

ఎ) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం     1) 1935 చట్టం

బి) డాక్ట్రిన్‌ ఆఫ్‌ ప్లెషర్‌         2) అమెరికా

సి) అవశిష్ట అధికారాలు     3) కెనడా

డి) రాష్ట్రపతి పాలన     4) ఇంగ్లాండ్‌

ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4

బి) ఎ-2, బి-3, సి-1, డి-4

సి) ఎ-2, బి-4, సి-3, డి-1 

డి) ఎ-3, బి-2 సి-4, డి-1 

23. స్టేట్‌మెంట్‌

1) భారత రాజ్యాంగ పరిషత్తు మెజారిటి ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించలేదు

2) రాజ్యాంగ పరిషత్తు సభ్యులు పరోక్షంగా, నామినేషన్‌ పద్దతిలో ఎంపిక అయ్యారు.

ఎ) 1 మాత్రమే సరియైనది 

బి) 2 మాత్రమే సరియైనది

సి) 1, 2 సరియైనవి 

డి)     రెండూ సరికావు

24. స్టేట్‌మెంట్‌

భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద రాజ్యాంగం

రీజన్‌

భారత వైవిధ్యం, పరిపాలనా అంశాలు, చారిత్రక నేపథ్యం దీనికి కారణాలుగా చెప్పవచ్చు.

ఎ) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి, రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్థిస్తుంది

బి స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి, రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్థించదు

సి) స్టేట్‌మెంట్‌ మాత్రమే సరియైనది

డి) రీజన్‌ మాత్రమే సరియైనది

25. స్టేట్‌మెంట్‌

భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం

రీజన్‌

చట్టపర సంక్లిష్టత, సాంకేతిక వ్యాఖ్యానాలకు అవకాశం ఉంది.

ఎ) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి,  రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్ధిస్తుంది

బి) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియెనవి, రీజన్‌ స్టేట్‌మెంట్‌ సమర్ధించదు

సి) స్టేట్‌మెంట్‌ మాత్రమే సరియైనది

డి) రీజన్‌ మాత్రమే సరియైనది

26. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా వర్ణిస్తారు.

కారణం

ఎ) ప్రతి లాయరు రాజ్యాంగాన్ని తప్పక చదవాలి

బి) ప్రతి న్యాయ విద్యార్థి రాజ్యాంగాన్ని తప్పక చదవాలి

సి) రాజ్యాంగంలో వివిధ అంశాలను, ప్రకరణలను, షెడ్యూల్‌లను పేరుతో విసృతంగా, సంక్లిష్టంగా

పొందు పరచడం

డి) పైవన్నియు సరైనవి

27. “రాజ్యాంగ పరిషత్‌ నిర్మాణంలో నా విధి కోతలు వేయడమే. నా అభీష్టానికి వ్యతిరేకంగా చాలా అంశాలను తొలగించివేసే పరిస్థితి కల్పించారు” అని వ్యాఖ్యానించినది

ఎ) డా॥ బి.ఆర్‌. అంబేద్మర్‌

బి) డా॥ ఆర్‌. రాజేంద్రప్రసాద్‌

సి) డా॥ బి.ఎన్‌. రావు

డి) కె. మున్షీ 



సమాధానాలు

1.సి 2.ఎ 3.సి 4.బి 5.ఎ 6.ఎ 7.ఎ 8.డి 9.ఎ 10.బి 11.సి 12.సి 13.డి 14.సి 15.ఎ 16.డి 17.బి 18.డి 19.డి 20.డి 21.డి 22.సి, 23.సి 24.ఎ 25.ఎ 26.సి 27.ఎ

Post a Comment

0Comments

Post a Comment (0)