అర్ధిక సంబంధాలు
రాజ్యాంగంలో 12వ భాగంలో గల ప్రకరణలు 264 - 300 కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక, ఆస్థి ఒప్పందాలు మొదలగు అంశాల గురించి ప్రస్తావించాయి.
పన్నుల విభజన
కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విధింపుకు సంబంధించి ఖచ్చితమైన విభజన చేశారు. కేంద్ర పరిధిలోకి వచ్చే పన్నులు
- వ్యవసాయేతర ఆదాయంపై పన్ను
- ఎగుమతి, దిగుమతి సుంకాలు
- పొగాకుపై ఎక్సైజ్ సుంకం
- కార్పొరేషన్ పన్ను
- మూలధన విలువపై పన్ను
- వ్యవసాయేతర ఎస్టేట్‌లపై పన్ను
- వారసత్వ పన్ను
- అంతర్‌రాష్ట్ర రవాణా పన్ను
- స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్సేంజ్ పన్ను
- చెక్స్, ప్రామీసరి నోట్లు, బిల్స్ ఆఫ్ ఎక్సేంజ్, ఇన్సూరెన్స్ పాలసీల బదిలీలపై పన్ను
- వార్తా పత్రికలపై అమ్మకప పన్ను ప్రకటనలపై పన్ను
- అంతర్ రాష్ట్ర వ్యాపారంలో విధించే అమ్మకపు పన్ను
- అంతర్‌రాష్ట్ర వాణిజ్యంలో సరుకులపై విధించే పన్ను
- సర్వీసులపైన పన్ను
- వ్యవసాయేతర భూముల వారసత్వ బదలాయింపు పన్ను
రాష్ట్రజాబితాలో 45 నుండి 63 వరకు గల ఎంట్రీలు మరియు 66వ అంశము కలిపి మొత్తము 20 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించవచ్చు. అవి
- భూమిశిస్తు
- వ్యవసాయ ఆదాయంపై పన్ను
- వ్యవసాయ భూములపై వారసత్వ పన్ను
- వ్యవసాయ భూములపై ఎస్టేట్ పన్ను
- స్థిరాస్థులపై పన్ను (భూములు, భవనాలు)
- ఖనిజాలపై పన్ను
- మద్యపానంపై పన్ను
- స్థానిక ప్రాంతాలలోకి రవాణ అయ్యే వస్తువులపై పన్ను (ఆక్ట్రాయి)
- విద్యుత్ వినియోగం మరియు అమ్మకంపై పన్ను
- వాణిజ్య పన్ను
- ప్రకటనలపై పన్ను
- రోడ్డు మరియు జల రవాణాలపై పన్ను
- మోటారు వాహనాలపై పన్ను
- పశువులపై పన్ను
- టోల్ టాక్స్
- వృత్తి పన్ను
- కస్టడి పన్నులు
- వినోదపు పన్నులు
- కేంద్ర జాబితాలోగల డాక్యుమెంట్లు మినహా మిగతా వాటిపై స్టాంపు డ్యూటీ
- రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన ఫీజులు
ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ నంబర్లు 35, 44 మరియు 47లలో గల అంశాలపై పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనశాఖలు పన్నులు విధించవచ్చు. అవి
- యాంత్రికశక్రిపై పనిచేసే వాహనాలపై పన్ను
- స్టాంప్ డ్యూటీస్
- మూడవ జాబితాలో పేర్కొనబడిన వాటిపై వసూలు చేసే ఫీజులు
అవశిష్ట పన్నులు
కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలో పేర్కొనబడని అంశాలపైన కేంద్రం పన్నులు విధించవచ్చు.
1. బహుమతి పన్ను
2 సంపద పన్ను
3. వ్యయ పన్ను
ప్రకరణ 265 ప్రకారం, చట్టబద్ధత లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించరాదు. అయితే ఫీజులు వసూలు చేయవచ్చు.
ప్రకరణ 266 ప్రకారం, కేంద్ర సంఘటిత నిధి, రాష్ట్ర సంఘటిత నిధి, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వ పద్దులు ఉంటాయి.
కేంద్ర సంఘటిత నిధిలోకి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని ఆదాయాలను, ఋణాలను జమ చేస్తారు. అలాగే రాష్ట్ర సంఘటిత నిధిలోకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని ఆదాయాలు జమ చేయబడతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పద్దుల్లోకి ప్రజల పొదుపు మొత్తాలను జమ చేస్తారు. ఉదా. ప్రావిడెంటు ఫండ్, పోస్టల్ సేవింగ్సు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పొదుపు పత్రాల ద్వారా వచ్చిన మొత్తాలను ప్రభుత్వ ఖాతాల్లోకి జమ చేస్తారు.
ప్రకరణ 267(1) ప్రకారం, కేంద్ర ఆగంతక నిధి మరియు రాష్ట్ర ఆగంతక నిధులు ఉంటాయి. ఊహించని ఖర్చులను, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన నష్టాలను, ఖర్చులను భరించటానికి రాష్ట్రపతి, గవర్నర్‌ల పేరుతో ఆగంతక నిధి నిర్వహించబడుతుంది. పార్లమెంటు లేదా రాష్ట శాసనసభల ఆమోదానికి లోబడి, కేంద్ర, రాష్ట, ప్రభుత్వాలు ఈ నిధులను నిర్వహిస్తాయి. కేంద్ర అగంతక నిధిని 1957లో భారత అగంతక నిధి చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
ప్రకరణ 268: కేంద్ర రాష్హ్రాల మధ్య వనరుల విభజన
కేంద్ర రాష్హ్రాల మధ్య వనరుల విభజనకు సంబంధించి మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించిన అంశాలకు భారీ మార్పులు చేశారు.
2000లో 80వ రాజ్యాంగ సవరణ, 2003లో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
10వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 80వ రాజ్యాంగ సవరణను చేశారు. దీని ప్రకారం, కేంద్రానికి వచ్చిన పన్నుల వాటాలో 29 శాతం ఇవ్వాలని రాష్హ్రాలకు సవరణ చేయడం జరిగింది. ఈ పద్ధతినే “ప్రత్యామ్నాయ నిధుల బదిలీ" అంటారు. ఇది 1996 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ పద్ధతి ద్వారా, కేంద్ర పన్నులైన కార్పోరేషన్ టాక్స్, ఎక్సైజ్ సుంకాలలో రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది.
88 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 266A లోకి సర్వీసు టాక్స్‌ను చేర్చారు. సర్వీస్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కానీ వసూలైన నికర మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయి.
ప్రకరణ 268 ప్రకారం, కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయి. ఉదా.
- బిల్స్ ఆఫ్ ఎక్చేంజ్
- చెక్కులు
- ప్రామిసరీ నోటు
- భీమా పాలసీల బదలాయింపు
- కంపెనీ షేర్ల బదలాయింపు
- ఆల్కహాల్ ఆధారంగా తయారు చేసిన జెషధాలు
- టాయ్‌లెట్ సంబంధ పదార్థాలపై ఎక్సైజ్ డ్యూటీలు, స్టాంపు డ్యూటీలు
ప్రకరణ 268 ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించే సర్వీసు టాక్స్
సర్వీసు టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది. వసూలైన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి.
గమనిక: సర్వీస్ ట్యాక్స్ అనే అంశాన్ని 2004లో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
ప్రకరణ 269 ప్రకారం కేంద్రం విధించి, కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు బదలాయించే పన్నులు
అంతర్ రాష్ట్ర రవాణాలో జరిగే వస్తువుల అమ్మకం, కొనుగోలుపై విధించే పన్నులను కేంద్రం విధించి, కేంద్రం వసూలు చేసి, రాష్ట్రాలకు బదలాయిస్తుంది.
ప్రకరణ 270 ప్రకారం, కొన్ని పన్నులను కేంద్రమే విధించి , కేంద్రమే వసూలు చేస్తుంది. వసూలు చేసిన మొత్తము కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజింపబడుతుంది. ఉదాహరణకు, వ్యవసాయేతర ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సైజ్ అలాగే రాష్ట్రా జాబితాలో ప్రస్తావించబడని ఇతర పన్నులు.
ప్రకరణ 271 ప్రకారం కొన్ని పన్నులపైన సర్ ఛార్జీలు
పార్లమెంటు ఒక చట్టం ద్వారా ప్రకరణ 269 మరియు 270 లలో ప్రస్తావించబడిన పన్నుల పైన సర్ ఛార్జీలు విధించవచ్చు.
ప్రకరణ 272లో ఉన్న అంశాలను 2000 సం.లో 80వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
ప్రకరణ 273 ప్రకారం, అస్సాం, బీహార్, ఒరిస్సా మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు జనుము, జనుము ఆధారిత ఎగుమతి సుంకాలకు సంబంధించి, ప్రత్యామ్నాయ గ్రాంటులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
ప్రకరణ 274 ప్రకారం, రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల విషయంలో పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి కావాలి.
ప్రకరణ 275(1) ప్రకారం సహాయ నిధులు (Grant in Aid)
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక అవసరాల అభివృద్ధికోసం సహాయక నిధులను ఇస్తుంది. ఇవి రెండు రకాలు
- చట్టబద్ధ గ్రాంటులు
- విచక్షణ గ్రాంటులు
చట్టబద్ధమైన గ్రాంటులు అనగా ఆర్థిక సహాయం. అవసరమైన రాష్ట్రాలకు మాత్రమే పార్లమెంటు ఒక చట్టం ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు సాధారణ అవసరాలు మరియు ప్రత్యేక అవసరాల నిమిత్తం (ఎస్.సి. ఎస్.టి.ల సంక్షేమము) నిధులు ఇస్తుంది.
ప్రకరణ 275(1)(2) ప్రకారం, ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కలిగిన గిరిజన ప్రాంతాల్లో సహాయక గ్రాంట్లు మొత్తం ఆ రాష్ట్రానికే చెల్లిస్తారు.
ప్రకరణ 275(2) ప్రకారం, రాష్ట్రపతి ఆర్థిక సంఘం సలహా మేరకు సహాయక గ్రాంట్లను సంబంధిత అధికార్లకు మంజూరు చేస్తారు. దీనికి సంబంధించి పార్లమెంటుకు శాసనం చేసే అధికారం కూడా ఉంది.
ప్రకరణ 276 ప్రకారం, వ్యక్తి, వ్యాపారం, ఉపాధి అంశాల అధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు వ్యక్తులపై రూ. 2500 లకు మించకుండా వృత్తి పన్ను విధించవచ్చు.
ప్రకరణ 279 ప్రకారం, పన్నుల ద్వారా వసూలైన ఆదాయంను నికర ఆదాయం నిర్ణయించడం జరుగుతుంది. కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ దీనికి సంబంధించి నికర ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఇస్తారు.
ప్రకరణ 280 ప్రకారం దీనిలో ఆర్థిక్ష సంఘం ఉంటుంది. భారత రాష్ట్రపతి ప్రతి 5 సం॥కు ఆర్థిక సంఘాన్ని ఏర్పరుస్తారు. దీనిలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులుంటారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల విభజనపై సిఫారసులు చేస్తారు.
ప్రకరణ 281 ప్రకారం, ఆర్థిక సంఘం తన సిఫారసులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ నివేదికను పార్లమెంటు ముందు ఉంచుతారు.
విచక్షణ గ్రాంటులు ప్రకరణ 282 ప్రకారం, ప్రజా సౌకర్యార్థము ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రణాళికా సంఘం సిఫారసు మేరకు పార్లమెంటు నిధులను ఇస్తుంది.
ప్రకరణ 283 ప్రకారం, ప్రకరణ 285 ప్రకారం, కేంద్ర ఆస్తులపైన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించరాదు.
ప్రకరణ 286 ప్రకారం, సరుకుల క్రయ విక్రయాలపై పన్ను విధింపుపై పరిమితులు. రాష్ట్రం వెలుపల జరిగే వస్తువుల క్రయ విక్రయాలపై భారతదేశంలో దిగుమతి, ఎగుమతి చేసుకునే వస్తువులపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధించరాదు.
ప్రకరణ 287 ప్రకారం, విద్యుత్తుపైన పన్ను మినహాయింపు
ప్రకరణ 292 ప్రకారం, దేశంలోగాని లేదా విదేశాలలోగాని కేంద్రం బుణాలు తీసుకోవచ్చు.
ప్రకరణ 293 ప్రకారం, రాష్ట్రాలకు దేశంలోపల మాత్రమే బుణాలను తీసుకునే అధికారం ఉంది.