కేంద్ర రాష్ట్ర సంబంధాలు - ప్రముఖుల వ్యాఖ్యానాలు
భారత సమాఖ్య వ్యవస్థ స్వభాపంపై కొందరు ప్రముఖులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
- భారత రాజ్యాంగంలో అత్యధికంగా ఏక కేంద్ర లక్షణాలు, అతి తక్కువగా సమాఖ్య లక్షణాలున్నాయి. కనుక భారత రాజ్యాంగము సమాఖ్య లక్షణాలున్న ఏక కేంద్రమేకాని ఏక కేంద్ర లక్షణాలున్న సమాఖ్య కాదు. కనుక ఇది అర్ధ సమాఖ్య (Quasi-Federal) - కె.సి.వేర్
- భారతదేశం వాస్తవికంగా ఏక కేంద్రంగా పనిచేసింది. కానీ, కేంద్ర రాష్ట్రాల మధ్య చట్టపరంగా, సిద్ధాంతపరంగా సమాఖ్య సంబంధాలున్నాయి. - ప్రొ.కె.సంతానం
- భారత వ్యవస్థ తీవ్రమైన సమాఖ్య వ్యవస్థ (Extremely Federal) - పాల్ ఆపెల్‌బి
- ఈ భారత వ్యవస్థ బేరసారాల సమాఖ్య వ్యవస్థ (Bargaining Federation) - మారిస్ జోన్స్
- భారత సమాఖ్య కేంద్రీకృతమైన మరియు బలమైన సమాఖ్య. జాతి ఐక్యతను, ప్రగతిని నిలువరించే సమాఖ్య - ఐవర్ జన్నింగ్స్
- భారత వ్యవస్థ స్వయం ప్రేరిత మరియు విశిష్ట సమాఖ్య వ్యవస్థ - అలెగ్జాండర్
- భారత సమాఖ్య సహకార సమాఖ్య. ఇది ఒక నూతన తరహా సమాఖ్య - గ్రాన్‌విల్లే ఆస్టిన్
- భారత సమాఖ్య ఒక విశిష్ట సమాఖ్య. పరిస్థితులకనుగుణంగా ఏక కేంద్రంగాను, సమాఖ్యగాను మార్చుకోగల స్థితిస్థాపకత ఉన్న సమాఖ్య - డా. బి.ఆర్. అంబేద్కర్
కేంద్ర, రాష్ట ఉమ్మడి జాబితాలు - అంశాలు
కేంద్ర జాబితా (Union List)
- మౌలిక రాజ్యాంగంలో 97 అంశాలు ఉండేవి. ఐతే తదుపరి రాజ్యాంగ సవరణ ద్వారా మరికొన్ని అంశాలు చేర్చడం వలన ప్రస్తుతం ఈ జాబితాలో 100 అంశాలు ఉన్నాయి.
- 1956లో 6వ రాజ్యాంగ సవరణ ద్వారా '924' ఎంట్రీలోకి అంతర్ రాష్ట్ర రవాణాలు వార్తాపత్రికలు మినహా ఇతర వస్తువులపై పన్నులు విధించడం అనే అంశాన్ని చేర్చారు.
- 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా '2A' ఎంట్రీలోకి కేంద్ర బలగాలను రాష్ట్రాలకు పంపడం అనే అంశాన్ని చేర్చారు.
- 1982లో 46వ రాజ్యాంగ సవరణ ద్వారా '92B' ఎంట్రీలోకి అంతర్ రాష్ట్ర వాణిజ్యం అనే అంశాన్ని చేర్చారు.
- 2003లో 85వ రాజ్యాంగ సవరణ ద్వారా '92C' ఎంట్రీలోకి సేవాపన్ను చేర్చారు.
ముఖ్యాంశాలు
రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాలు, బ్యాంకులు, కరెన్సీ, రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు, విమానయానం, లాటరీలు మొ॥ అంశాలు.
రాష్ట్ర జాబితా (State List)
రాష్రాధికారంలో మౌలికంగా 66 అంశాలు ఉండేవి, కాని ప్రస్తుతం ఈ జాబితాలో 61 అంశాలు ఉన్నాయి. ఇందులోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలోకి బదలాయించారు.
రాష్ట్ర జాబితాలో ముఖ్యంగా శాంతి భద్రతలు, స్థానిక పరిపాలన, జైళ్లు, ప్రజారోగ్యం, వ్యవసాయం, పశుసంపద, చేపలు, గనుల నియంత్రణ అభివృద్ధి, మార్కెటింగ్, వడ్డీ వ్యాపారం, క్రీడలు, జూదం మొదలగు అంశాలు.
ఉమ్మడి జాబితా (Concurrent List)
ఉమ్మడి జాబితాలో మౌలికంగా 47 అంశాలు ఉందేవి. కాని రాష్ట్ర జాబితాలోని ఐదు అంశాలను ఇందులోకి బదలాయించారు.
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్రింది అంశాలను ఉమ్మడి జాబితాలోకి బదలాయించారు.
- ఎంట్రి 11A న్యాయ పరిపాలన, కోర్టుల నిర్వహణ
- ఎంట్రి 17B అడవులు, ఎంట్రి 17B పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ
- ఎంట్రి 20A జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ
- ఎంట్రి 25 విద్య క్
- ఎంట్రి 33A తూనికలు, కొలతలు
జాబితాలోని ముఖ్యాంశాలు
సివిల్, క్రిమినల్ చట్టాలు, అంతర్గత భద్రత, భూసేకరణ, ధార్మిక సంస్థలు, జంతువుల క్రూరత్వం, ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ, ఆర్థిక సామాజిక ప్రణాళికలు, ధరల నియంత్రణ, సామాజిక భద్రత, భీమా, ఆర్థిక సంక్షేమం, జనన మరణాలు, ఫ్యాక్టరీలు, విద్యుత్తు మొదలగు అంశాలు.