స్థానిక సంస్థలు - Rural, Urban Governments - 73 74 Amendments
గత ప్రశ్నలు: 1990 నుంచి వివిధ పరీక్షల్లో ముఖ్యంగా (సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, JL, DL, NET, SLET etc.) వచ్చిన ప్రశ్నలు
1. న్యాయ పంచాయితీల ఉద్దేశం
ఎ) గ్రామ పంచాయితీలను నిర్వహించడం
బి) పంచాయితీ ప్రెసిడెంట్ ఇచ్చిన తీర్చులు కొట్టివేయడం
సి) హైకోర్టు అప్పీలుకు అనుమతి ఇవ్వడం
డి) గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం
2. కింది వివరములను పరిశీలించండి.
1) రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయితీలకు సంబంధించిన అంశాలున్నాయి. దీన్ని 73 వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు.
2) రాజ్యాంగంలోని 9ఎ భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రకరణ 243Q ప్రకారం ప్రతి రాష్టంలో మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పోరేషన్ అనే రెండు రకాల మున్సిపాలిటీలుండాలి.
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) రెండూ సరైనవి
డి) రెండూ సరికాదు
3. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు, వాటికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించబడని రాష్ట్రాలు
ఎ) గోవా, జమ్మూ మరియు కాశ్మీర్, పాండిచ్చేరి
బీ) ఢిల్లీ గోవా, మిజోరాం, మేఘాలయ
సి) మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం
డి) మణిపూర్, నాగాలాండ్
4. ప్రస్తుత పంచాయితీ రాజ్ వ్యవస్థకు మూలము
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) బల్వంతరాయ్ మెహతా కమిటీ
సి) వసంత రావు కమిటీ
డి) రాజమన్నార్ కమిటీ
5. 1993 కొత్త పంచాయితీ రాజ్ బిల్లులో గతంలో వలె కాకుండా అనేక కొత్త అంశాలు చోటుచేసుకున్నాయి, కింది వాటిలో ఏది వాటికి సంబంధించిన అంశం కాదు.
ఎ) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్య సామాజిక అడవులు లాంటి అనేక కొత్త విధులను చేర్చారు
బి) నిర్దేశించి సమయంలో అన్నీ స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు జరపవలేననన్న నిభందన
సి) పంచాయిత్ లోని స్థానాల్లోని మూడింట ఒక వంతు మహిళలకు కేటాయింపు
డి) క్రమశిక్షణ, జవాబుదారీని పంచాయితీ సభ్యుల్లో తీసుకొచ్చేందుకు వారికి జీతం ఇవ్వటం
6. రాష్ట్ర అర్థిక (ఫైనాన్స్) సంఘాన్ని నియమించేది ఎవరు.
ఎ) కాంప్రటోలర్ మరియు ఆడిటర్ జనరల్
బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్ర ప్రభుత్వం
డి) భారత ఆర్థిక (ఫైనాన్స్) సంఘం
7. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అసత్యం
ఎ) భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక పభుత్వ సమాఖ్య వ్యవస్థలో ఒక స్వతంత్రస్థాయి. కలిగి ఉండదు
బి) స్థానిక ప్రభుత్వ సంస్థల్లో 38.33 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు.
సి) స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను ఒక కమీషను కేటాయిస్తుంది.
డి) స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
8. మొదటిసారిగా భారతదేశంలో పంచాయితీ రాజ్ ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) విఠల్ కమిటీ
సి) జి.వి.కె.రావు కమిటీ
డి) బల్వంతరాయ్ మెహతా కమిటీ
9. పంచాయితీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రథమ రాష్ట్రం ఈ క్రింది వానిలో ఏది.
ఎ) గుజరాత్
బి) రాజస్థాన్
సి) బీహారు
డి) ఆంధ్రప్రదేశ్
10. బల్వంత రాయ్ మెహతా కమిటీ దేనికి సంబంధించినది.
ఎ) పంచాయితీ రాజ్
బి) సమాజ వికాసం
సి ప్రణాళికా సంఘం
డి) మండల పరిషత్
11. అశోక్ మెహతా కమిటీ (1979) సమీక్షించినది.
ఎ) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
బి) పంచాయితీ రాజ్ సంస్థలు
సి) గవర్నర్ల పాత్ర
డి) ప్రభుత్వరంగ సంస్థల పనితీరు
12. పంచాయితీ రాజ్‌కు సంబంధించి ఈ క్రింది వాటిలో దేనిని 73 వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు.
ఎ) పంచాయితీరాజ్ సంస్థల్లో 33.33 శాతం సీట్లు మహిళాఅభ్యర్థులకు కేటాయించాలి.
బి) పంచాయితీ రాజ్ సంస్థల్లో వనరుల కోసం రాష్ట్రాలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాయి.
సి) పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నిక కాబడినవారు ఇద్దరికన్నా ఎక్కువమంది పిల్లలను కలిగివుంటే వారి పదవులను కోల్పోతారు.
డి) రాష్ట్ర ప్రభుత్వంచే పంచాయితీ రాజ్ సంస్థ రద్దయితే ఆరు నెలలలోపు ఎన్నికలు జరపాలి.
13. పంచాయితీ రాజ్‌లోని పాలనా వ్యవస్థ ఏది.
ఎ) గ్రామ స్థాయి ఒక అంచె గల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ
బి) గ్రామ, బ్లాకు స్థాయిలతో రెండంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ
సి) గ్రామ, బ్లాకు, జిల్లా స్థాయిలతో మూడంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ
డి) గ్రామ, బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలతో నాలుగంచెల స్వపరిపాలనా వ్యవస్థ
14. భారత దేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగపు సవరణ
ఎ) 64వ సవరణ
బి) 72వ సవరణ
సి) 73వ సవరణ
డి) 74వ సవరణ
15. ఈ క్రింది వానిలో మండల పంచాయితీ వ్యవస్థను సిఫారసు చేసినది ఏది.
ఎ) అశోక్ మెహతా కమిటి
బి) బల్వంత రాయ్ మెహతాకమిటీ
సి) నరసింహన్ కమిటీ
డి) వెంగళరావు కమిటీ
16. మూడంచెలు గల వంచాయితీ రాజ్ వ్యవన్థ రాజ్యాంగంలో ఏ భాగంలోని పేర్కొనబడింది.
ఎ) 3 వ భాగం
బి) 21 భాగం
సి) 9వ భాగం
డి) 8 వ భాగం
సమాధానాలు
1.డి 2.సి 3.డి 4.బి 5.డి 6.సి 7.డి 8.డి 9.బి 10.బి 11.బి 12.సి 13.సి 14.డి 15.ఎ 16.సి