Union Government - President, Vice President, Prime Minister & Other Council of Ministers
TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక్ష విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు
1. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కాని తొలగింపులో పాల్గొనివారు.
ఎ) రాష్ట్ర విధాన సభ సభ్యులు
బి) పార్లమెంట్‌లో నామినేటెడ్ సభ్యులు
సి) పార్లమెంటులో ఎన్నికైన సభ్యులు
డి) ఎ & బి
2. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సును జారీ చేసే అధికారంను ఏమంటారు?
ఎ) విచక్షణాధికారం
బి) విశిష్ట అధికారం
సి) శాసనాధికారం
డి పైవన్నియు
3. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది
ఎ) సంపూర్ణ మెజారిటి సాధిస్తేనే అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.
బి) రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య మొత్తం ఓట్లు విలువ విషయంలో సమతూకం ఉంది
సి) నియోజక గణంలో కొన్ని ఖాళీలు ఉన్నప్పటికి ఎన్నిక జరుగుతుంది.
డి) పైవన్నియు సరైనవి.
4. రాష్ట్రపతికి ఈ క్రిందివానిలో ఏ రకమైన వీటో అధికారం లేదు
ఎ) నిరపేక్ష వీటో
బి) సస్పెన్సివ్ వీటో
సి) క్వాలిఫైడ్ వీటో
డి) పాకెట్ వీటో
5. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి సంబంధించి సరైనది
ఎ) దీనిని ఒక పర్యాయం సవరించారు
బి) పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో సవరిస్తుంది
సి) పార్లమెంటు సాధారణ మెజారిటీతో సవరిస్తుంది
డి) ఎ & బి
6. ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది
ఎ) రాజ్యసభలో అంతర్భాగం
బి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా తొలగిస్తుంది
సి) పార్లమెంటు ఉభయ సభలు సంయుక్త సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
డి) పైవన్నియు సరికావు
7. ఢీ ఫాక్టో, డీజ్యూర్ అధిపతులు అనే భావన ఎక్కడ ఉంటుంది?
ఎ) పార్లమెంటరీ వ్యవస్థ
బి) అధ్యక్ష వ్యవస్థ
సి) సమాఖ్య వ్యవస్థ
డి) పై అన్నిటిలో
8. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎలా ఉంటుంది?
ఎ) పార్లమెంటుకు సమాంతరంగా ఉంటుంది
బి) పార్లమెంటుకు సహసంబంధంగా ఉంటుంది
సి) పార్లమెంంటుతో సంయుక్తంగా ఉంటుంది
డి) పైవి ఏవీకాదు
9. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మధ్య ఏ విషయంలో పోలిక ఉంటుంది
ఎ) ఎన్నిక పద్ధతిలో
బి) ఎన్నుకునే నియోజక గణంలో
సి) తొలగించే పద్ధతిలో
డి) పై అన్నిటిలో
10. ఈ క్రింది ఏ అధికారం ఉపరాషష్టపతికి ఉండదు
ఎ) నిర్జాయక ఓటు
బి) విచక్షణ అధికారం
సి) వీటో అధికారం
డి) బి & సి
11. రాజ్యాంగపరంగా ఎవరికి స్పష్టమైన విచక్షాధికారాలు లేవు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) గవర్నర్
డి) కేంద్ర మంత్రి మందలి
12. కేంద్ర ప్రభుత్వం - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మంత్రిమండలి పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కానిది?
ఎ) నామమాత్ర, వాస్తవ అధిపతులు
బి) సంయుక్త బాధ్యత
సి) అధికార సంలీనం
డి) అధికార విభజన
13. రాజ్యాంగంలో ప్రస్తావించబడిన ప్రభుత్వం
ఎ) అపద్ధర్మ ప్రభుత్వం
బి) జాతీయ ప్రభుత్వం
సి) సంకీర్ణ ప్రభుత్వం
డి) పై అన్నియు
14. రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయిన మంత్రిని?
ఎ) ప్రధానమంత్రి తొలగిస్తాడు
బి) ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు
సి) రాష్ట్రపతి సలహా మేరకు ప్రధాని తొలగిస్తాడు
డి) పైవి ఏవీ సరైనవి కావు
15. పదవిలో ఉండగా మరణించిన ప్రధానమంత్రులు?
ఎ) ఇద్దరు
బి) ముగ్గురు
సి) నలుగురు
డి) ఐదుగురు
16. అత్యధిక పార్టీల కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించినది?
ఎ) మన్మోహన్ సింగ్
బి) వాజ్‌పాయ్
సి) వి.పి.సింగ్
డి) దేవెగౌడ
17. కేంద్ర మంత్రి మండలికి సంబంధించి సరైనది?
ఎ) గరిష్ట మంత్రులపై రాజ్యాంగ పరిమితి
బి) రాజ్యాంగ పరంగా మంత్రుల హోదాలు సమానం
సి) మంత్రులు రాష్ట్రపతి విశ్వాసం మేరకు అధికారంలో ఉంటుంది.
డి) పై అన్నియు సరైనవే
18. ప్రధానమంత్రి మరణిస్తే
ఎ) మంత్రి మండలి రద్దు అవుతుంది
బి) లోక్‌సభ రద్దు అవుతుంది
సి) కొత్త నాయకత్వంలో మంత్రిమండలి మళ్ళీ ప్రమాణం చేయాలి
డి) పైవి ఏవీకాదు
19. కేంద్రంలో ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండా ప్రధానమంత్రి అయినది?
ఎ) శ్రీమతి ఇందిరా గాంధీ
బి) వి.పి.సింగ్
సి) ఐ.కె. గుజ్రాల్
డి) రాజీవ్ గాంధీ
20. ఈ క్రింది వారిలో ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆ తర్వాత ప్రధానమంత్రి అయినవారు.
ఎ) మురార్జీ దేశాయి
బి) చరణ్ సింగ్
సి) వి.పి.సింగ్
డి) పై అందరూ
21. ఈ క్రింది వారిలో రాజ్యాంగంలో ప్రత్యక్షంగా పేర్కొనబడని అంశం
ఎ) ప్రధానమంత్రి తప్పనిసరిగా లోక్‌సభకు చెంది ఉండాలి
బి) ప్రధానమంత్రి మెజారిటీ కోల్పోతే రాజీనామా చేయాలి
సి) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లో ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
రాష్ట్రపతిగా వ్యవహరించడం
డి) పైవన్నియు
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.సి 5.డి 6.డి 7.ఎ 8.బి 9.ఎ 10.డి 11.ఎ 12.డి 13.డి 14.బి 15.బి 16. బి 17.డి 18.సి 19.డి 20.డి 21 డి