స్థానిక సంస్థలు - Rural, Urban Governments - 73 74 Amendments
జ్ఞానాత్మక , అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
1. ఈ క్రింది వాటిలో పంచాయితీల విధి కానిది
ఎ) పారిశుధ్యం
బి) విద్యుచ్చక్తి
సి) స్మశానాల నిర్వహణ
డి) పర్యావరణ పరిరక్షణ
2. పంచాయితీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని రాష్ట్రం ఏది.
ఎ) కేరళ
బి) అస్సాం
సి) నాగాలాండ్
డి) ఏవీకావు
3. పంచాయితీ రాజ్‌కు ప్రత్యేక సర్వీస్ ఉన్న రాష్ట్రం ఏది.
ఎ) కేరళ
బి) పశ్చిమబెంగాల్
సి) రాజస్థాన్
డి) కర్నాటక
4. రాజకీయ పార్టీలు గ్రామ పంచాయితీ ఎన్నికలలో పాల్గొనవచ్చని చెప్పింది ఎవరు,
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) వెంగళరావు కమిటీ
సి) చొక్కారావు కమిటీ
డి) పై ఎవరూ కాదు
5. పంచాయితీ రాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫారసు చేసిన కమిటీ ఏది.
ఎ) బల్వంత రాయ్ మెహతా కమిటీ
బి) అశోక్ మెహతా కమిటీ
సి) నరసింహం కమిటీ
డి) వెంగళరావు కమిటీ
6. గ్రామపంచాయితీ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు.
ఎ) జిల్లా కలెక్టరు
బి) జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు
డి) ఆ ప్రాంతం జిల్లా మున్సిఫ్ కోర్టు
7. మన రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ
ఎ) గ్రామ పంచాయితీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు
బి) గ్రామ పంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లా ప్రజా పరిషత్తు
సి) గ్రామ పంచాయితీ, మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజాపరిషత్తు
డి) పైవేవీకావు
8. మండల పరిషత్తు సమావేశాలలో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు లేని వారెవరు.
ఎ) ఎన్నుకోబడిన సభ్యులు
బి) కోోోోోోఆప్ట్ చేయబడిన సభ్యులు
సి) మండలానికి చెందిన రాజ్యసభ సభ్యులు
డి) ఆ మండలానికి చెందిన గ్రామ పంచాయితీ సర్పంచులు
9. మండల పరిషత్తు అధ్యక్షుడు క్రింది విధంగా ఎన్నుకోబడతాడు.
ఎ) ఓటర్లచే ప్రత్యక్షంగా
బి) మండల పరిషత్తు సభ్యులచే
సి) మండల పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులచే
డి) మండలంలోని సర్పంచులచే
10. మున్సిపల్ కార్బోరేషన్ స్థాయి సంఘాల సభ్యులు
ఎ) ఓటర్లచే ఎన్నుకోబడతారు.
బి) కార్బోరేటర్లచే ఎన్నుకోబడతారు.
సి) మేయర్‌చే నామినేట్ చేయబడతారు
డి) కమీషనర్‌చే నామినేటు చేయబడతారు
11. భారత రాజ్యాంగమునందలి ఏ ప్రకరణము ప్రకారం గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టును.
ఎ) ప్రకరణ 39
బి) ప్రకరణ 41
సి) ప్రకరణ 40
డి ప్రకరణ 42
12. 11వ షెడ్యూల్‌లో పంచాయితీరాజ్ సంస్థలకు కేటాయించబడిన విధులు
ఎ) 9
బి) 19
సి) 29
డి) 39
13. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు.
ఎ) రాష్ట్రపతి
బి) గవర్నర్
సి) ప్రధానమంత్రి
డి) ఎవరూ కాదు
14. గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం
ఎ) చోళులు
బి) బ్రిటీష్
సి) పాల
డి) మొగలు
15. స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది.
ఎ) మానవ వనరుల శాఖ
బి) గణాంక శాఖ
సి) పట్టణాభివృద్ధి శాఖ
డి) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
సమాధానాలు
1.బి 2.సి 3.సి 4.ఎ 5.డి 6.డి 7.ఎ 8.డి 9.సి 10.బి 11.సి 12.సి 13.బి 14.ఎ 15.డి