స్థానిక సంస్థలు - Rural, Urban Governments - 73 74 Amendments of Indian Constitution Bit Bank
TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు
1. పంచాయితీ వ్యవస్థ ఉద్దేశం కానిది
ఎ) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
బి) భాగస్వామ్య ప్రజాస్వామ్యం
సి) స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం
డి) సామాజిక న్యాయాన్ని అందించటం
2. గ్రామ సభకు సంబంధించి సరైనవి
ఎ) ఇందులోని సభ్యులను గ్రామం లోని ఓటర్లు ఎన్నుకొంటారు
బి) సంవత్సరానికి రెండు పర్యాయాలు సమావేశం కావాలి
సి) గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్‌అధ్యక్షత వహిస్తారు
డి) పై అన్నియు సరైనవి
౩. గ్రామ పంచాయితీ నిర్మాణానికి సంబంధించి కానివి?
ఎ) MPTC సభ్యులు శాశ్వత ఆహ్వానితునిగా వుంటాడు. కాని ఓటు హక్కు ఉండదు
బి) స్వయం సహాయ గ్రూపు నుండి ఒక సభ్యున్ని కో-ఆప్ట్ చేస్తారు
సి) స్థానిక శాసన సభ్యుడు హోదా రీత్యా సభ్యుడు
డి) పైవి ఏవీ కాదు
4. సీనరేజ్ రుసుం అనగా?
ఎ) ఖనిజేతర పదార్థాలపై వేసే పన్ను
బి) ఖనిజాలపై వేసే పన్ను
సి) కంటోన్మెంట్ బోర్డు విధించే పన్ను
డి) పైవి ఏవీ కావు
5. స్థానిక సంస్థలు “విఫలమైన భగవంతుడు” కాదనిచెప్పిన కమిటీ?
ఎ) అశోక్ మెహతా
సి) ఎల్.ఎం. సింఘ్వి
బీ) జి.వి.కె. రావ్
డి) పైవి ఏవి-.కాదు
6. PESA చట్టం ద్వారా అధిక ప్రాధాన్యత దేనికి ఉంటుంది
ఎ) గ్రామ సభ
బి) గ్రామ పంచాయితీ
సి) సర్పంచ్
డి) మండల పరిషత్
7. IMPERIA, IMPERIVM అనగా
ఎ) రాజ్యంలో రాజ్యం
బి) సర్వోన్నత అధికారం
సి) సామ్రాజ్యవాదం
డి) స్వయం ప్రతిపత్తి
8. పంచాయితీ వ్యవస్థ నిర్మాణం?
ఎ) భౌతికపరమైనది
బి) పాలనాపరమైనది
సి) ఆర్థిక పరమైనది
డి) పైవన్నీ
9. ఏ రాష్ట్రంలో మొదటిసారిగా పంచాయితీ నిర్వహణ ఇంటర్‌నెట్ వెబ్ ద్వారా నియంత్రించడం జరిగింది
ఎ) కేరళ
బి) కర్నాటక
సి) ఆంధ్రప్రదేశ్
డి) మహారాష్ట్ర
10. పంచాయితీలు "F3 Syndrome" తో సతమత మౌతున్నాయని విమర్శ ఉంది. ఇందులోని అంశాలు
ఎ) Functions
బి) Functionaries
సి) Funds
ది) పైవన్నియు
11. పంచాయితీలో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించే పద్ధతి
ఎ) సిబ్బంది నియామకం
బి) అకౌంట్ల తనిఖీ
సి) నిధుల మంజూరు
డి) పైవన్నియు
12. నూతన పంచాయితీ చట్టంలో కొన్ని అధికారాలను రాష్ట్రాల విచక్షణకు వదిలివేశారు. వాటిని గుర్తించండి
ఎ) సర్బంచ్ ఎన్నిక పద్ధతి
బి) అధికారుల బదలాయింపు
సి) స్థానిక శాసన సభలకు ప్రాతినిధ్యం
డి) పైవన్నియు
13. జిల్లా ప్రణాళికా మండలి గురించి ఏ రాజ్యాంగ ప్రకరణ తెలియ చేస్తుంది.
ఎ) 243 ZA
బి) 243 ZB
సి) 243 ZC
డి) 243 ZD
14. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించుము.
1. హబ్ హౌస్ కమిటీ - 1909
2. బల్వంత రాయ్ మెహతా - 1957
3. అశోక్ మెహతా - 1977
4. జి.వి.కె.రావు కమిటీ - 1993
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 4 మాత్రమే
15. కంటోన్మెంటు చట్టం ఏ సం.లో చేయబడింది.
ఎ) 1914
బి) 1924
సి) 1934
డి) 1944
సమాధానాలు
1.డి 2.డి 3.సి 4.బి 5.ఎ 6.ఎ 7.ఎ 8.ఎ 9.ఎ 10.డి 11.డి 12.డి 13.డి 14.డి 15.బి