గత ప్రశ్నలు: 1990 నుంచి 2015 వరకు వివిధ పరీక్షల్లో ముఖ్యంగా (సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, జె.ఎల్, డి.ఎల్., నెట్,సెట్ మొ.. ) వచ్చిన ప్రశ్నలు
Directive Principles of State Policy Previous Questions
1. ప్రాథమిక హక్కులకు, ఆదేశ నూత్రాలకు విరోధమునకు కారణము
ఎ) రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయాలని న్యాయశాఖ ఆరాటం
బి) లిఖిత రాజ్యాంగం
సి) సాంఘిక, ఆర్ధిక అసమానత
డి) ముందు చూపున్న నాయకులు లేకపోవడం
2. ఆదేశ సూత్రాలకు సంబంధించి ఆర్దికల్ 41లో లేనిది.
ఎ) పనిహక్కు
బి)ఆశ్రయపు హక్కు
సి) విద్యాహక్కు
డి) ప్రభుత్వ సహాయపు హక్కు
3. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే, వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారియై తప్పనిసరిగా నిలువవలసి ఉంటుంది అని వ్యాఖ్యానించినది ఎవరు.
ఎ) జవహర్‌లాల్ నెహ్రూ
బి) డా. బి.ఆర్. అంబేద్కర్
సి) ఐవర్ జన్సింగ్స్
డి) వల్లభ్‌భాయ్ పటేల్
4. M K గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే అదేశిక నియమాలు
ఎ) సమాన పనికి సమాన వేతనం
బి) ఉచిత న్యాయ సలహా
సి) గోవధ నిషేధం
డి) చారిత్రక కట్టడాల పరిరక్షణ
5. ఆదేశిక నియమాలు దేనిని నెలకొల్పుతాయి
ఎ) ఆర్థిక ప్రజాస్వామ్యం
బి) సామాజిక ప్రజాస్వామ్యం
సి) సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం
డి) M K గాంధీ గ్రామ స్వరాజ్యం
6. అదేశిక నియమాలకు సంబంధించి సరైనవి
ఎ) వీటికి న్యాయ సంరక్షణ లేదు
చి) ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు
సి) వీటికి మరోపేరు న్యాయ సంరక్షణ లేని హక్కులు
డి) పైవన్నియు
7. ఆదేశిక సూత్రాల అమలులో ప్రస్తుతం ఉన్న ప్రతిబంధకాలు
ఎ) ప్రపంచీకరణ
బి) ఆర్థిక సరళీకరణ
సి) ప్రైవేటీకరణ
డి) పైవన్నియు
8. కొత్తగా చేర్చబడిన ఆదేశికాలు
ఎ) ఉచిత న్యాయ సలహా
వీ) పర్యావరణ పరిరక్షణ
సి) పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం
డి) పైవన్నియు సరైనవి
9. ప్రకరణ 39(b & c) నిర్దేశిక నియమాల అమలుకు చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చెల్లుబాటు అవుతాయి అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేశారు.
ఎ) 24వ రాజ్యాంగ సవరణ
బి) 23వ రాజ్యాంగ సవరణ
సి) 42వ రాజ్యాంగ సవరణ
డి) 44వ రాజ్యాంగ సవరణ
10. విద్యా సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు దీనిని ప్రాతిపదికగా తీసుకుంటారు.
ఎ) కులం
బి) పేదరికం
సి) గ్రామీణ వాతావరణం
డి) మతం
11. ప్రకరణ 19(1) ప్రకారం నిర్వహించే హిక్‌లిన్ టెస్ట్ (Hicklin Test) దేనికి సంబంధించినది
ఎ) సభ్యత, నైతికత
బి) ప్రాణ నష్టం
సి) భారత సమైక్యత
డి) పైవేవీ కాదు
సమాధానాలు
1.ఎ 2.బి 3.బి 4.సి 5.ఎ 6.డి 7.డి 8.డి 9.ఎ 10.ఎ 11.ఎ