Indian Constitution Practice Bits-16

TSStudies
0
Directive Principles of State Policy of Indian Constitution Previous Exams Bits in Telugu

జ్ఞానాత్మక , అవగాహన సంబంధిత ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌

Directive Principles of State Policy Practice Questions

1. ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు

ఎ) ప్రాథమిక హక్కులు

బి) మానవ హక్కులు

సి) శాసన సూత్రాలు

డి) ఆదేశిక సూత్రాలు


2. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం

ఎ) నిరుద్యోగ నిర్మూలన 

బి) సంక్షేమ రాజ్యస్థాపన

సి) పారిశ్రామికీకరణ 

డి) ఆర్థిక పురోభివృద్ధి


3. గ్రామ పంచాయితీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్‌ ఏది.

ఎ) 40 

బి) 41 

సి) 42 

డి) 43


4. ఆదేశిక సూత్రాల అమలు కోసం, ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు.

ఎ) గోలక్‌నాథ్‌కేసు 

బి) కేశవానంద భారతి కేసు

సి) మినర్వా మిల్స్‌ 

డి) ఏదీ కాదు


5. ఉమ్మడి పౌరస్యృతిని తెలుయచేసే నిబంధన ఏది.

ఎ) 44 

బి) 45 

సి) 46 

డి) 47


6. జతపరచండి.

1. ఆర్టికల్‌ 40    ఎ) కార్మికులకు కనీస వేతనాలు

2. ఆర్టికల్‌ 41    బి) పని హక్కు

3. ఆర్జికల్‌ 42    సి) గ్రామ పంచాయితీల నిర్వహణ

4. ఆర్టికల్‌ 43    డి) పని చేయడానికి తగిన పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు

ఎ) 1-సి, 2-బి, ౩-డి, 4-ఎ

బి) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి

సి) 1-బి, 2-ఎ, ౩-డి, 4-సి

డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ


7. ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి.

ఎ) ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు

బి) రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసే ఆదేశాలు

సి) కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వహించే సూత్రాలు

డి) న్యాయ సాధనలను నిర్వహించే సూత్రాలు


8. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు తేదా ఏమిటి.

ఎ) ప్రాథమిక హక్కులు న్యాయ సాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు.

బి) ఆదేశిక సూత్రాలు న్యాయసాధ్యమైనవి, ప్రాథమిక హక్కులు కావు.

సి) పై రెండూ

డి) ఏవీకావు


9. ఆదేశ సూత్రాలను ఈ క్రింది వారిలో ఎవరు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండీ అని అన్నారు.

ఎ) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

బి) టి.టి. కృష్ణమాచారి

సి) కె.ఎం. మున్షీ

డి) ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌


10. శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం వంటివని అన్నదెవరు.

ఎ) ఎం.సి. చాగ్గా 

బి) ఎం.సి. సెతల్వాడ్‌

సి) కెటిషా 

డి) అంబేద్కర్ 


11. భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి

ఎ) ప్రాథమిక హక్కులు 

బి) నిర్దేశిక నియమాలు

సి) ప్రాథమిక విధులు 

డి) పైవేవీ కావు


12. క్రింది వాటిలో సరైనది

1) పురుషులకు, మహిళలకు సమానమైన పని, సమాన వేతనాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదు.

2) వెనుకబడిన తరగతులను రాజ్యాంగం నిర్వచించలేదు.

ఎ) 1 మాత్రమే

బి) 2 మాత్రమే

సి) పై రెండు సరైనవే

డి) ఏదీ కాదు


13. భారత రాజ్యాంగము ననుసరించి సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్చను ఏ విషయంలో నియంత్రించవచ్చును.

ఎ) ప్రజా భద్రత

బి) విదేశాలలో స్నేహ సంబంధాల నిర్వహణ దృష్టా

సి) కోర్టు ధిక్కరణ విషయంలో

డి) పైవన్నీ


14. ఆర్థిక ప్రజాస్వామ్యం దీని ద్వారా సాధింపబడుతుంది.

ఎ) ప్రాథమిక హక్కులు

బి) ప్రవేశిక

సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశికసూత్రాలు

డి) కేంద్ర జాబితా


15. ఆదేశిక సూత్రాలకు ప్రాధమిక హక్కులపై ఆధిక్యతను కల్పించడానికి ఉద్దేశింపబడిన రాజ్యాంగ సవరణలు

ఎ) 25 

బి) 42 

సి) 44 

డి) ఎ & బి


16. ప్రవంచీకరణ ఆర్థిక నరళీకరణ నేవథ్యంలో ప్రభావితమౌతున్న ఆదేశిక సూత్రాల స్వభావం 

ఎ) సంక్షేమ స్వభావం 

బి) గాంధేయ స్వభావం

సి) ఉదార స్వభావం 

డి) పై అన్నియు


17. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది

ఎ) ఆదేశికాలు నూతన పోకడలు - అంబేద్కర్

బి) శుష్క వాగ్ధానాలు - ఐవర్‌ జెన్నింగ్స్‌

సి) రాజ్యాంగ లక్ష్యాల మానిఫెస్టో - కె.సి.వేర్‌

డి) పైవన్నియు సరైనవి


18. ఆదేశిక నియమాలనేవి

ఎ) పౌరుల బాధ్యతలను తెలియజేస్తాయి.

బి) పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి

సి) న్యాయ పాలనలో ప్రాతిపదికలు

డి) పరిపాలనలో మార్గదర్శకాలు


19. సంక్షేమ రాజ్య స్వభావమనే భావన ఏ భాగములో స్పష్టీకరించబడింది.

ఎ) ప్రవేశిక 

బి) ప్రాధమిక హక్కులు

సి) ఆదేశిక నియమాలు 

డి) ప్రాథమిక విధులు


20. ఈ క్రిందివాటిలో ఏది సరైనది

ఎ) ఆదేశిక సూత్రాలకు ప్రాధమిక హక్కులకు సంబంధం లేదు

బి) ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కుల కంటే గొప్పవి

సి) ప్రాధమిక హక్కులు ఆదేశిక సూత్రాల కంటే గొప్పవి

డి) పరస్పర పోషకాలు




సమాధానాలు

1.డి 2.బి 3.ఎ 4.ఎ 5.ఎ 6.ఎ 7.ఎ 8.ఎ 9.బి 10.బి

11.బి 12.డి 13.డి 14.సి 16.బి 16.ఎ 17.సి 18.డి 19.సి 20.డి


Post a Comment

0Comments

Post a Comment (0)