TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు-Fundamental Rights Practice Questions
1. ఈ క్రింది వాటిని పరిశీలించండి
ఎ) దేశ ప్రజల అవసరాలకు, ఆ శక్తులకు అనుగుణంగా మారక పోవడమే విప్లవాలకు అని
లార్ట్‌మోకాలీ వ్యాఖ్యానించాడు.
బి) పై వ్యాఖ్యానం రాజ్యాంగ సవరణ, ప్రాముఖ్యతను, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది
సి) పై రెండు సరైనవే
డి) పై రెండు సరికావు
2. ఈ క్రింది వాటిలో ఏ ప్రాతిపదికపైన సకారాత్మక వివక్షతను (Positive Discrimination) రాజ్యాంగం అనుమతించలేదు.
ఎ) విద్యాపరమైన వెనుకబాటుతనం
బి) ఆర్థిక వెనుకబాటుతనం
సి) సామాజిక వెనుకబాటుతనం
డి) పైవి ఏవీ కాదు
3. న్యాయ సమీక్ష అనేది ఏ ప్రభుత్వ లక్షణం
ఎ) ఏక కేంద్ర .
బి) సమాఖ్య
సి) పార్లమెంటరీ
డి) పై అన్నియు
4. ఈ క్రింది ఏ ప్రకరణను సుప్రీంకోర్టు ఉదారంగా, వ్యాఖ్యానించి, పరిధిని బాగా విస్తరించింది.
ఎ) ప్రకరణ 32
బి) ప్రకరణ 18
సి) ప్రకరణ 20
డి) ప్రకరణ 21
5. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జత పరచబడలేదు
ఎ) Resjudicata : decided matter
బి) Audi Alterim Partem : hear the other side
సి) Expost facto : Now and after
డి) Henry Clause : unammendable
6. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రాజ్యం “చట్టాలు” చేస్తే అవి చెల్లుబాటు కాకుంటే న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే “చట్టం” అనే పదం లోనికి రాని అంశం
ఎ) ఆర్జినెన్సులు
బి) ఉపచట్టాలు
సి) నోటిఫికేషన్లు
డి) రాజ్యాంగ సవరణ
7. ఈ క్రింది వాటిలో సరికానిది
ఎ) రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీం కోర్టుకు ప్రధాన పరిధి ఉంటుంది
బి) హైకోర్టులు రిట్లను ఉదారంగా జారీ చేస్తాయి.
సి) ప్రకరణ 226 ప్రకారం రిట్లు జారీ చేసే అధికారంప్రాథమిక హక్కు క్రిందికి రాదు
డి) రిట్టు జారీ చేసే అధికారం ఇతర హక్కుల కమిషన్లకు కూడా ఉంటుంది.
8. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య వివాదం ఏర్పడటానికి కారణం
ఎ) ప్రభుత్వం క్రీయాశీల సంక్షేమ చర్యలు
బి) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
సి) రెండిటి మధ్య మౌలిక రాజ్యాంగంలో ఉన్న సమతా స్థితిని సవరణ ద్వారా ప్రబావితం చేయడం
డి) పై అన్నియు
9. ఈ క్రింది స్టేట్‌మెంట్లను పరిశీలించండి
ఎ) హక్కులను డిమాండ్ చేసే వ్యక్తులు కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది
బి) ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులపై పరోక్ష పరిమితులుగా పని చేస్తాయి
సి) పై రెండు స్టేట్‌మెంట్లు సరైనవే
డి) పై రెండు సరికావు
10. సాధారణంగా ప్రాథమిక హక్కులు ప్రభుత్వాల నిరపేక్ష అధికారులపై పరిమితులు, వాటికి వ్యతిరేకంగా పౌరులకు కల్పిస్తారు. అయితే కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా గుర్తించారు. అవి
ఎ) పీడన నిరోధపు హక్కు
బి) అంటరానితనం నిషేధం
సి) బాల కార్మికుల వ్యవస్థ నిషేధం
డి) పై అన్నియు
11. ఈ క్రింది వాటిని “క్రాలవరుస” క్రమంలో గుర్తించండి
1) ఎ.కె.గోపాలన్ కేసు -
2) 24వ రాజ్యాంగ సవరణ
3) మేనగా గాంధీ కేసు
4) 42వ రాజ్యాంగ సవరణ
ఎ) 1,4,2,3
బి) 1,2,4,3
సి) 4,3,2,1
డి) 2,1,4,3
12. ప్రాథమిక హక్కులపై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక కేసుల్లో ఆనాటి సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తులను గుర్తించండి
1) కోకా సుబ్బారావ్
2) సిక్రీ
3) వై.వి. చంద్రచూడ్
4)వి.ఆర్. కృష్ణ అయ్యర్
ఎ) 1,2, 3, 4
బి) 1, 2 మాత్రమే
సి) 1, 2, 3 మాత్రమే
డి) 1 మాత్రమే
13. ఈ క్రింది ఏ రకమైన అత్యవసర పరిస్థిత్తి ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి
బి)రాజ్యాంగ అత్యవసర పరిస్థితి
సి) పై రెండూ
డి) పై రెండూ కాదు
14. జైనుల సాంప్రదాయమైన “'సంతారి మరియు “సల్లెఖన్ల' (ఉపవాస దీక్ష ద్వారా మరణాన్ని పొందడం) ఆర్టికల్స్21కు వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు 2015 ఆగస్టు లో ఏ కేసులో తీర్పు చెప్పింది
ఎ) రాజస్థాన్ Vs స్థనక్‌వాసీ జైన్ స్రావక్ సంఘ్
బి) గుజరాత్ Vs స్థనక్‌వాస్ జైన్ స్రావక్ సంఘ్
సి) మహారాష్ట్ర Vs స్థనక్‌వాసీ జైన్ స్రావక్ సంఘ్
డి) హర్యానా Vs స్థనక్‌వాసీ జైన్ స్రావక్ సంఘ్
సమాధానాలు
1.సి 2.బి 3.బి 4.డి 5.డి 6.డి 7.డి 8.డి 9.డి 10.డి 11.బి 12.సి 13.బి 14.ఎ