Indian Constitution Practice Bits-17

TSStudies
0
Directive Principles of State Policy of Indian Constitution Previous Exams Bits in Telugu

నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు

Directive Principles of State Policy Practice Questions

1. ఆదేశిక నియమాలకు ఈ క్రింది ఏ లక్షణాన్ని ఆపాదించలేము

ఎ) న్యాయ సంరక్షణ

బి) వ్యక్తి శ్రేయస్సు

సి) స్వామ్యవాద తరహా లక్షణం

డి) పై అన్నియు


2. ఆదేశిక నియమాలకు న్యాయ నంరక్షణ కల్పించబడలేదు. కారణం / కారణాలు గుర్తించండి

ఎ) అమలు చేయడం సాధ్యం కాకపోవడం

బి) అంత ప్రాముఖ్యమైనవి కాకపోవడం

సి) ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉండటం

డి) పై అన్నియు సరైనవే


3.ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చబడలేదు.

ఎ) 24వ సవరణ 

బి) 42వ సవరణ

సి) 97వ సవరణ 

డి) పైవి ఏవీ కాదు


4. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని మరొక విధంగా ఇలా అంటారు

ఎ) శాసనశాఖ - న్యాయశాఖ మధ్యవివాదం

బి) కార్యనిర్వాహక శాఖ - న్యాయ శాఖ మధ్య వివాదం

సి) న్యాయ శాఖ - ప్రజలు మధ్య వివాదం

డి) శాసన శాఖ - న్యాయ శాఖ మధ్య వివాదం


5. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు

ఎ) ప్రాథమిక హక్కులు - ప్రభుత్వంపై పరిమితులు

బి) ఆదేశిక నియమాలు - ప్రభుత్వ బాధ్యతలు

సి) ప్రాథమిక విధులు - పౌరుల బాధ్యతలు

డి) పైవి ఏవీ కాదు


6.ఈ క్రింది వాటిని పరిశీలించండి

1) ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయ స్థానాల జోక్యాన్ని కోరలేము

2) వీటికి న్యాయ సంరక్షణ లేదు

3) ఇవి సవరణకు అతీతం

4) ఇంతవరకు ఏ ఒక్క ఆదేశిక నియమం రాజ్యాంగం నుంచి తొలగించబడలేదు

పై వాటిలో సరైనవి

ఎ) 1, 2, 3, 4 

బి) 2, 3

సి) 2, 4 

డి) 2, 3, 4


7. ఈ క్రింది ఏ ఆదేశిక సూత్రాలు సామ్యవాదేతర అంశాలుగా పరిగణించవచ్చు.

ఎ) స్త్రీ, పురుషులకు సమాన జీవన అవసరాలు

బి) మానవీయ పని ప్రదేశాలు

సి) ఉచిత న్యాయ సలహా

డి) యువతను దోడిపి నుంచి రక్షించటం


8. ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది

ఎ) ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలా ఏ ఆదేశిక నియమం అమలుచేసిన అవి చెల్లుబాటు కావు

బి) సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఆదేశిక నియమాలను అమలు చేయరాదు

సి) ఆదేశిక నియమాల్లో ప్రకరణ 39(a & b) అమలు చేస్తు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చెల్లుబాటు అవుతాయి.

డి) అన్ని విషయాల్లో ప్రాథమిక హక్కులదే పై చేయి అవుతుంది.


9. ఇంత వరకు అమలు కాని ఏకైక ఆదేశిక నియమం

ఎ) ప్రకరణ 44 

బిప్రకరకణ 49

సి) ప్రకరణ 48 

డి) పైవి ఏవీ కాదు 


10. వికలాంగుల సంరక్షణ, సంక్షేమానికి సంబంధించిన ప్రకరణ

ఎ) 40 

బి) 43 

సి) 45 

డి) 41


11. నిర్దేశిక నియమాల అమలు దేనిపై ఆధారపడి ఉంటుంది.

ఎ) న్యాయస్థానాల తీర్పులు 

బి) ప్రజా చైతన్యం

సి) ప్రభుత్వ ఆర్థిక స్ధితి 

డి) నాయకుల చిత్తశుద్ధి


12. రాజ్యాంగంలోని సామ్యవాదం అనేది జాతీయకరణలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది.

ఎ) ఎక్సెల్‌ వేర్‌ కేసు 

బి) ఎల్‌ఐ.సీ ఆఫ్‌ ఇండియా

సి) మోహినీ జైన్‌ కేసు 

డి) డి.ఎస్‌ నకారా కేసు


13. ఇంత వరకు అమలుకాని ఏకైక నిర్దేశిక నియమం

ఎ) ఉమ్మడి పౌర నియమావళి

బి) నిరుద్యోగ భృతి

సి) సామ్యవాద తరహా సమాజం

డి) ఉచిత న్యాయ సలహా


14. ప్రాథమిక హక్కులపై నిర్దేశిక నియమాల ఆధిపత్యానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు

ఎ) 24వ సవరణ 

బి) 42వ సవరణ

సి) 44వ సవరణ 

డి) ఎ & బి




సమాధానాలు 

1.ఎ 2.ఎ 3.డి 4.ఎ 5.డి 6.సి 7.సి 8.సి 9.ఎ 10.డి 11.సి 12.ఎ 13.ఎ 14.డి 


Post a Comment

0Comments

Post a Comment (0)