Indian Constitution Practice Bits-18

TSStudies
0
Indian Federal System of Indian Constitution Previous Exams Bits in Telugu

Indian Federal System - Distinctive Features Previous Questions

గత ప్రశ్నలు: 1990 నుంచి వివిధ పరీక్షల్లో ముఖ్యంగా (సివిల్స్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, జె.ఎల్‌.,, డిఎల్‌, నెట్, స్లేట్ మొ॥) వచ్చిన ప్రశ్నలు


1. కింది వాటిలో ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం

ఎ) గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్ధీకరించడం

బి) వ్యవసాయం

సి) మత్స్య పరిశ్రమ

డి) ప్రజా ఆరోగ్యం


2. కింది వివరాలను పరిశీలించండి.

1. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం చేసే అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంది.

2. అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన తీర్మానాలను లోక్‌సభ మాత్రమే ఆమోదిస్తుంది.

ఎ) 1 మాత్రమే సరైనది 

బి) 2 మాత్రమే సరైనది

సి) రెండూ సరైనవి 

డి) రెండూ సరికావు


3. భారత రాజ్యాంగం ప్రకారం క్రింద పేర్కొన్న జతల్లో ఏది సరైనది కాదు.

ఎ) అడవులు - ఉమ్మడి జాబితా

బి) స్టాక్‌ ఎక్స్ఛేంజి - ఉమ్మడి జాబితా

సి) పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ - కేంద్ర జాబితా

డి) ప్రజా ఆరోగ్యం - రాష్ట్ర జాబితా


4. క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.

1. భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ భారత ప్రణాళికా సంఘం

2. ప్రణాళిక సంఘం కార్యదర్శి జాతీయాభివృద్ది మందలి కార్యదర్శిగా కూడా ఉంటారు.

౩. ఏడో షెడ్యూల్‌లోని ఉమ్మడి జాబితాలో క్రీడలు చేర్చారు.

పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో సరైనవి.

ఎ) 1, 2 

బి) 2, 3

సి) 2 మాత్రమే 

డి) 3 మాత్రమే


5. రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్య నిర్వహణాధికారాన్ని కేంద్ర కార్య నిర్వహణాధికారికి ఎటువంటి అవరోధం, ప్రమాదం ఏర్పడని విధంగా మాత్రవే వినియోగించుకోవాలని తెలియజేసే అధికరణం

ఎ) 257 

బి) 258 

సి) 355 

డి) 356


6. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి, వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను ఈ క్రింది వానిలో ఏది.

ఎ) ఎగుమతి, దిగుమతి సుంకాలు

బి) స్టాంపు డ్యూటీ

సి) ఆదాయపు పన్ను

డి) రైలు ఛార్జీలపై విధించే పన్ను


7. శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి

ఎ) రాష్ట్ర జాబితా 

బి) కేంద్ర జాబితా

సి) ఉమ్మడి జాబితా 

డి) ఏదీ కాదు


8. అవశిష్ట అధికారం కలిగినది.

ఎ) కేంద్రం 

బి) రాష్ట్రం

సి) రాష్ట్రపతి 

డి) ప్రధానమంత్రి


9. భారత సమాఖ్యకూ, అమెరికా సమాఖ్యకూ గల సాధారణ లక్షణం ఏది

ఎ) ఏక పౌరసత్వం

బి) రాజ్యాంగంలో మూడు జాబితాలు

సి) ద్వంద్వ న్యాయ వ్యవస్థ

డి) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు ఒక సమాఖ్య న్యాయ వ్యవస్థ


10. భారత రాజ్యాంగం సమాఖ్యపూరితమని తెలియజేయునది

ఎ) లిఖిత, ధృఢ రాజ్యాంగము

బి) స్వతంత్ర న్యాయవ్యవస్థ

సి) కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన

డి) పై అన్నియు


11. భారత దేశంలోని ర్యాషాల మధ్య సహకారం సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర, చట్టపరంకాని సాధనాలు ఏవి

1) జాతీయాభివృద్ధి మండలి

2) గవర్నర్ల సమావేశం

3) మండల కౌన్సిళ్ళు

4) అంత రాష్ట్ర మండలి

ఎ) 1, 2 

బి) 1, 2, 3 

సి) 3, 4  

డి) 4


12. ఆదాయపు పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది.

ఎ) కేంద్రం విధించి, వసూలు చేసి, ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది

బి) అన్ని పన్నులు కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాన్ని తానే పొందుతుంది

సి) అన్ని పన్నులు కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది

డి)  ఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్‌ఛార్జీని మాత్రం కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది


13. ఈ క్రింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్‌ సర్వీస్‌ ముఖ్య అధికారిగా భావించవచ్చు.

ఎ) హోం శాఖ కార్యదర్శి

బి) క్యాబినెట్‌ కార్యదర్శి

సి) సిబ్బంది శాఖా కార్యదర్శి

డి) ప్రధానమంత్రి కార్యదర్శి


14. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమీషన్‌ మొదటి అధ్యక్షుదెవరు.

ఎ) గుల్జారీలాల్‌ నందా 

బి) టి.టి.కృష్ణమాచారి

సి) మొరార్జీ దేశాయ్‌

డి) ఇందిరా గాంధీ


15. ఈ క్రింది వానిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 కింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు.

ఎ) సస్పెండ్‌ చేయునప్పుడు

బి) హోదా తగ్గించినప్పుడు

సి) తీసివేసినప్పుడు

డి) బర్తరఫ్‌ చేసినప్పుడు


16. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కొరకు కేంద్రప్రభుత్వం నియమించిన కమీషన్‌ అధ్యక్షుడెవరు

ఎ) జస్టిస్‌ ఎం.ఎం.పూంచి 

బి) వి.కె.దుగ్గల్ 

సి) ధీరేంద్ర సింగ్‌ 

డి) మాధవీ మీనన్‌


17. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది.

ఎ) యూనియన్‌ జాబితా 

బి) రాష్ట్ర జాబితా

సి) ఉమ్మడి జాబితా 

డి) అవశేషాధికారాలు


18. భారత సమాఖ్య విధానంను ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చవచ్చు.

ఎ) ఆ విధంగా చేయాలని పార్లమెంటు నిశ్చయించినపుడు

బి) ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం రూపొందించు కున్నప్పుడు

సి) సాధారణ ఎన్నికల సమయంలో

డి) జాతీయ అత్యవసర పరిస్థితియందు


19. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐ.ఏ.ఎస్‌., ఐ,పి.ఎస్‌.లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది.

ఎ) కాకా కలేల్కర్ కమీషన్‌ 

బి) ఖేర్‌ కమీషన్‌

సి) రాజమన్నార్‌ కమీషన్‌ 

డి) సర్కారియా కమీషన్‌


 

సమాధానాలు

1.ఎ 2.ఎ 3.బి 4.ఎ 5.ఎ 6.డి 7.ఎ 8.ఎ 9.డి 10.డి

11.డి 12.ఎ 13.బి 14.సి 15.ఎ 16.ఎ 17.బి 18.డి 19.సి


Post a Comment

0Comments

Post a Comment (0)