Fundamental Rights Practice Questions జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
41. భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియ చేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు అని వ్యాఖ్యానించింది.
ఎ) అంబేద్కర్
బి) నెహ్రూ
సి) గాంధీ
డి) హిదయతుల్లా
42. ప్రాథమిక హక్కుల అమలుకు జారీ చేసే కోర్టు ఆదేశాలను ఏమంటారు.
ఎ) రిట్లు
బి) డిక్రీ
సి) ఆర్డినెన్సు
డి) పైవన్ని
43. రాజ్యాంగంలో పరోక్షంగా గుర్తింపబడిన ప్రాథమిక హక్కు ఏది
ఎ) రహస్యాలను కాపాడుకునే హక్కు
బి) సంఘాలను ఏర్పర్పుకునే హక్కు
సి) సంచార హక్కు
డి) స్థిర నివాస హక్కు
44. వ్యక్తిగత స్వేచ్చల పరిరక్షణ శక్తి ఏది
ఎ) హెబియస్ కార్చస్
బీ) మాండమస్
సి) ప్రొహిబిషన్
డి) పైవేవి కాదు
45. ప్రాథమిక హక్కులకు మరొక పేరు సహజ హక్కులు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు పేర్కొంది
ఎ) కేశవానంద భారతి కేసు
బి) గోలక్‌నాథ్ కేసు
సి) ఏ.కె. గోపాలన్ కేసు
డి) ఎస్.ఆర్. బొమ్మయ్
46. ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇది ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది?
ఎ) అరిస్టాటిల్
బి) హెచ్.జె. లాస్కి
సి) జెయస్. మిల్
డి) ఐవర్ జెన్నింగ్స్
47. ప్రకరణ 12 ప్రకారం రాజ్య నిర్వచనంలోకి రాని అంశం?
ఎ) గ్రామ పంచాయతి
బి) సహకార సంఘాలు
సి) యూనివర్శిటీలు
డి) పైవేవీ కావు
48. ప్రకరణ 13లో ప్రస్థావించిన అంశం/అంశాలు
ఎ) రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు
బీ ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు చెల్లవు
సి) చట్ట నిర్వచనం .
డి) పై అన్నియూ సరైనవే
49. ప్రకరణ 13 ప్రకారం చట్ట నిర్వచనంలోకి రానిది?
ఎ) దత్త శాసనాలు
బి) ఉప చట్టాలు (Bye-laws)
సి) రూల్స్
డి) రాజ్యాంగ సవరణ
50. హెన్రీ-(VIII) క్లాస్ అనగా?
ఎ) అనుచిత చట్టాలు
బి) సరళ చట్టాలు
సి చట్టాలలోని దోషాలను తొలగించడం
డి) సవరణకు అతీతమైన చట్టాలు
51. హంస, పాలు నుండి నీరును వేరు చేస్తుందనే అంశం ఈ క్రింది సూత్రానికి అన్వయించవచ్చు?
ఎ) డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటి
బి) డాక్ట్రిన్ ఆఫ్ వేయివర్
సి) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్షిప్స్
డి) డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్‌స్టాన్స్
52. న్యాయ సమీక్ష అధికారం
ఎ) పరోక్షంగా ఉంది
బి) ప్రత్యక్షంగా ఉంది
సి) ఆపాదించబడింది
డి) పైవి ఏవీ కొదు
53. ప్రకరణ 114 దేనిని అనుమతిస్తుంది?
ఎ) వర్గ చట్టాలను
బి) హేతుబద్ద వర్గీకరణను
సి) పై రెండింటిని
డి) పైవి ఏవీ కొదు
54. విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 వివాదంలో ముఖ్యాంశం?
ఎ) పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు
బి) బాల కార్మిక. వ్యవస్థ
సి) అశ్లీల సాహిత్యం
డి) పైవి ఏవీ కాదు
55. కొన్ని ఉద్యోగాలను స్త్రీలకు మాత్రమే రిజర్వ్ చేయడంచెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
ఎ) యూనియన్ ఆఫ్ ఇండియా Vs ప్రభాకరన్ 1997
బి) సాగర్ vs ఎ.పి. గవర్నమెంట్ - 1968
సి) పై రెండూ
డి) పై రెండూ కాదు
సమాధానాలు
41.డి 42.ఎ 43.ఎ 44.ఎ 45.బి 46.బి 47.బి 48.డి 49.డి 50.సి 51.ఎ 52. బి 53.బి 54.ఎ 55.సి