Indian Constitution Practice Bits-10

TSStudies
0
Fundamental Rights of Indian Constitution Previous Exams Bits in Telugu

ప్రాథమిక హక్కులు (Fundamental Rights)

గత ప్రశ్నలు: 1990 నుంచి వివిధ పరీక్షల్లో ముఖ్యంగా (సివిల్స్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, జె.ఎల్‌., డి.ఎల్‌,, నెట్‌, స్లైట్‌ మొ) వచ్చిన ప్రశ్నలు


1. ప్రాథమిక హక్కులు

ఎ) నిరపేక్షమైనవి

బి) ప్రభుత్వ అధికారులపై పరిమితులు

సి) సవరణకు అతీతం

డి) న్యాయ సమీక్షకు గురికావు


2. ప్రాథమిక హక్కులకు మరోపేరు

ఎ) న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు

బి) న్యాయ సంరక్షణ లేని హక్కులు

సి) నైతిక హక్కులు

డి) పౌర హక్కులు


3. ఈ క్రింది వాటిలో ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు.

ఎ) గోలక్‌నాథ్‌ 

బి) కేశవానంద భారతి

సి) మేనకా గాంధీ 

డి) మినర్వా మిల్స్‌


4. సహజీవన హక్కును సువ్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది

ఎ) ఖుష్బూ

బి) అరుణా రాయ్‌

సి) అరుంధతి రాయ్‌

డి) విశాఖ


5. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా లేదా అని విచారించుటకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారము

ఎ) హెబియస్‌ కార్చస్‌ 

బి)సెర్షియోరరి

సి) మాండమస్‌ 

డి) కోవారెంటో


6. ప్రాథమిక హక్కులను రద్దు చేయుటకు అధికారం ఎవరికి ఉంది.

ఎ) సుప్రీంకోర్టు 

బి) రాష్ట్రపతి

సి) ప్రధాన మంత్రి 

డి) పార్లమెంటు


7. రాజ్యాంగపు ఏ నిబంధన క్రింద ఒక వ్యక్తి ప్రాథమికహక్కుల పై ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చును.

ఎ) ఆర్టికల్‌-13 

బి) ఆర్జికల్‌-32 

సి) ఆర్టికల్‌-14 

డి) ఆర్టికల్‌-34 


8. డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని

వర్ణించాడు.

ఎ) సమానత్వపు హక్కు

బి) స్వాతంత్ర్యపు హక్కు

సి) పీడనాన్ని నిరోధించే హక్కు

డి) రాజ్యాంగ పరిహార హక్కు


9. అధికారులు తవు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్‌

ఎ) హెబియస్‌ కార్చస్‌ 

బి) మాండమస్‌

సి) సెర్షియోరరి 

డి) కోవారెంటో


10. ప్రాథమిక హక్కులలో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల ఉద్దేశం

ఎ) నిరక్షరాస్యతను రూపుమాపుట

బి) ఒకే ఒక్క సంస్కృతిని రూపొందించుట

సి) అల్బసంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించుటకు సహాయపడుట

డి) భారతదేశ సంస్కృతిని సంరక్షించుటకు సహాయపడదు.


11. ఆర్థిక సమానత్వాన్ని కలుగచేసేది.

ఎ) ప్రాథమిక హక్కులు 

బి) అవతారిక

సి) ఆదేశిక సూత్రాలు

డి) ప్రాథమిక విధులు

 

12. రాజ్యాంగంలోని ఏ అధికరణం వార్తా ప్రచురణ హక్కును కల్పిస్తుంది.

ఎ) 14

బి) 21 

సి) 32 

డి) 19


13. ఏ రాజ్యాంగం నుండి చట్టాల సమాన రక్షణను గ్రహించారు.

ఎ) బ్రిటన్‌

బి) అమెరికా

సి) ఐర్లాండు

డి) ఆస్ట్రేలియా 


14. రాజ్యాంగంలో ఏ ప్రకరణప్రకారం జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టం చేయబడింది

ఎ) ప్రకరణ 21 జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు

బి) ప్రకరణ 48 ఆదేశిక నియమం

సి) ప్రకరణ 275 షెడ్యూల్డు ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి

డి) పైవేవి కావు


15. విద్య హక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది.

ఎ) అన్ని స్థాయి విద్యార్థులకు

బి) కళాశాల విద్యార్థులకు .

సి) సీనియర్‌ సెకండరీ స్థాయి విద్యార్థులకు

డి) 14 సం॥లోపు ఉండే విద్యార్థులకు


16. చట్టం మూలంగా సమాన రక్షణ అనగా

ఎ) ప్రత్యేక రక్షణ

బి) సమాన అవకాశాలు

సి) అసమానతను తగ్గించడం

డి) పై అన్నియు


17. ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు

ఎ) ప్రభుత్వ చర్యలకు

బి) న్యాయస్థాన చర్యలకు

సి) ప్రైవేటు వ్యక్తుల చర్యలకు

డి) పై అన్నిటికి


18. నేరారోపణగావించబడిన వ్యక్తిని బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని ఏమంటారు.

ఎ) సెల్ఫ్‌ ఇన్‌క్రిమినేషన్‌ 

బి) డబల్‌ జపార్టీ

సి) ఎక్స్‌ పోస్ట్‌ లా 

డి) పైవేవి కాదు


19. ప్రాథమిక హక్కులు అమలు పరచడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు. ఆ వర్గాలు ఎవరు

ఎ) రక్షణ దళాలు 

బి) నేరస్థులు

సి) విదేశీయులు 

డి) నిందితులు


20. ఈ క్రింది వాటిలో వ్యక్తిగత స్వేచ్చలపై పరిమితులు

ఎ) శాంతి భద్రతలు 

బి) దేశ రక్షణ

సి) నైతిక ప్రవర్తన

డి) పై అన్నియు


21. ఈ క్రింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కులో ప్రస్థావన లేదు

ఎ) వికలాంగులకు

బి) ఆర్థికంగా వెనుకబడినవారికి

సి) మహిళలకు

డి) ఎ మరియు బి



సమాధానాలు

1.బి 2.ఎ 3.బి 4.ఎ 5.ఎ 6.బి 7.బి 8.డి  9.బి 10.సి 11.సి 12.డి 13.బి 14.ఎ 15.డి 16.డి 17.సి 18.ఎ 19ఎ  20.డి 21.డి


Post a Comment

0Comments

Post a Comment (0)