Indian Constitution Practice Bits-9

TSStudies
0
Preamble-Philosophical Foundations of Indian Constitution Previous Exams Bits in Telugu

Preamble-Philosophical Foundations జ్ఞానాత్మక , అవగాహన సంబంధిత ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌

21. ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్ష్మరూపం అని సుప్రీంకోర్ట్‌ 1967లో గోలక్‌నాథ్‌ కేసులో తీర్పు చెప్పింది. వ్యాఖ్యానం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు

ఎ) జస్టీస్‌ కృష్ణ అయ్యర్‌

బి) జస్టిస్‌ మాధ్యు

సి జస్టీస్‌ కె. సుబ్బారావ్‌

డి) జస్టీస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా


22. “సౌభ్రాతృత్వం అనగా సోదర భావం అనే అర్ధం వస్తుంది. ఈ భావం సమాజంలో ఐక్యతను, సంఖీభావాన్ని (Unity & Solidarity) పెంపొందిస్తుంది” అని వ్యాఖ్యానించింది.

ఎ) డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ 

బి) డా॥ రాజేంద్ర ప్రసాద్‌

సి) జవహర్‌లాల్‌ నెహ్రూ

డి) M K గాంధీ


23. “ప్రవేశికకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. రాజ్యాంగం ప్రవేశిక ఆధారంగానే వ్యాఖ్యానించాలి” అని అనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ సిక్రి పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కేసు

ఎ) బెరుబారి యూనీయన్‌ 

బి) ఎ.కె. గోపాలన్‌

సి) కేశవానంద భారతి 

డి) మినర్వమిల్స్‌ 


24. ప్రవేశికలో ప్రస్తావించబడిన, న్యాయం, స్వేచ్చ, సమానత్వం... ఎవరికి వర్తిస్తాయి.

ఎ) పౌరులకు మాత్రమే

బి) దేశంలో నివశించే అందరికి

సి) జన్మత: పౌరులకు మాత్రమే.

డి) పైవేవీ సరికావు 


25. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదన్న తీర్పు

ఎ) కేశవానంద భారతి తీర్చు 

బి) గోలక్‌నాథ్‌ తీర్పు

సి) శంకర ప్రసాద్‌ తీర్పు 

డి) సజ్జన్‌ సింగ్‌ తీర్పు


26. రిపబ్లిక్‌ అనే పదానికి అర్ధం

ఎ) రాష్ట్రపతి సంతృప్తి పొందుతున్నంత వరకు తమ పదవులో ఉంటారు. 

బి) మంత్రులు పార్లమెంట్‌కు జవాబుదారులు

సి) భారత ప్రజలు సార్వభౌమాధికారం కలవారు

డి) ఎన్నుకోబడిన రాష్ట్రపతి


27. ఈ క్రింది వానిని పరిశీలించండి

1. లౌకిక రాజ్యంలో మత ప్రమేయం ఉండదు

2, లౌకిక రాజ్యంలో మత స్వేచ్చ ఉంటుంది.

3. లౌకిక రాజ్యంలో మత వివక్షత ఉండదు

4 లౌకిక రాజ్యంలో మత రహిత సమాజంఉంటుంది

ఎ) 1,2,3 మాత్రమే సరియైనది

బి) 3, 4 మాత్రమే సరైనది

సి) 2, 4 మాత్రమే సరైనది

డి) 1 2, 3, 4 సరైనవి


28. ఈ క్రింది ఏ అంశాలను వ్యాఖ్యానించడానికి ప్రవేశికను ఆధారంగా తీసుకోవచ్చు.

ఎ) ప్రాధమిక హక్కులు

బి) ఆదేశిక సూత్రాలు

సి) ప్రభుత్వ అధికారాలు

డి) పైవన్నీ


29. సామాజిక న్యాయం అనగా

ఎ) ఆర్థిక అసమానతలను ఉపేక్షించడం

బి) జీవన ప్రమాణాలను పెంచడం

సి) బలహీన వర్ణాల ప్రయోజనాలను కాపాడడం

డి) పైవన్నియు


30. ప్రవేశికలో ప్రస్తావించిన “సౌభ్రాతృత్వం” అనే ఆదర్శాన్ని పెంపొందించే అంశాలు

1) ఏక పౌరసత్వం

2) కేంద్రకృత సమాఖ్య

3) ప్రాథమిక హక్కులు

4) ప్రాథమిక విధులు

ఎ) 1, 2 

బి) 1, 3, 4

సి) 2, 3, 4 

డి) 1, 2, 3, 4


31. ప్రవేశికలో పేర్కొన్న “సమానత్వం” అనేది దేనికి హామి ఇస్తుంది.

ఎ) హోదా

బి) అవకాశాల్లో

సి) ఉపాధి

డి) ఎ & బి


32. ఈ క్రింది వాటిలో సరైనది

ఎ) ప్రవేశిక అధికారానికి ఆధారం కాదు మరియు పరిమితి కాదు

బి) ప్రవేశిక సవరణకు అతీతం కాదు

సి) ప్రవేశికను రాజ్యాంగ రచన తరువాత చేర్చారు, ఆఖరున ఆమోదించారు

డి) పై అన్నియు సరైనవే.


33. ప్రవేశికకు ఈ క్రింది వాటిలో వేటిని ఆపాదించవచ్చు

ఎ) రాజ్యాంగానికి అనివార్యమైన భాగం

బి) రాజ్యాంగ ప్రకరణలను ప్రభావితం చేయదు

సి) రాజ్యాంగంలోని అంశాలకు సూచనాత్మకమైనది

డి) పై అన్నియు ఆపాదించలేము


34. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం అని, అలాగే కాదనీ పరస్పర వివాదాస్పదమైన తీర్పులు ఏ కేసులో సుప్రీంకోర్టు వ్యక్తీకరించింది

ఎ) ఎ.కె. గోపాలన్‌, గోలక్‌నాథ్‌

బి) కేశవానంద భారతి, గోలక్‌నాథ్‌

సి) మేనకాగాంధీ, మినర్వ మిల్స్‌

డి) పైవి ఏవీ కాదు 


35. ప్రవేశిక నుంచి ఏమి రాబట్టవచ్చును

ఎ) రాజ్యాంగానికి ఆధారం

బి) ప్రభుత్వం స్వరూపం

సి) రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు

డి) పై అన్నియు


36. “సమగ్రత” అనే పదజాలాన్ని ప్రవేశికలోకి చేర్చడానికి కారణం

ఎ) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం

బి) వేర్పాటువాద ఉద్యమాలు

సి) సుప్రీంకోర్టు తీర్పులు

డి) ఎ & సి


37. ప్రవేశికలో సమకాలీన ప్రాముఖ్యతను, వివాదాన్ని సంతరించుకొన్న పదాలు

ఎ) లౌకికతత్వం, సామ్యవాదం

బి) ఐక్యత, సమగ్రత

సి) గణతంత్రం, సార్వభౌమాధికారం

డి) పై అన్నియు

 


సమాధానాలు

21.సి 22.ఎ 23.సి 24.ఎ 25.ఎ 26.డి 27.ఎ 28.డి 29సి 30.బి 

31.డి  32.డి  33.డి  34.బి 35.డి 36.బి 37.ఎ

 

Post a Comment

0Comments

Post a Comment (0)