Fundamental Rights Practice Questions జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
1. భారతదేశంలో సిక్కులు తమ కృపాణాన్ని ధరించే హక్కును ఏ ప్రాధమిక హక్కు కల్పిస్తుంది.
ఎ) స్వాతంత్ర్యపు హక్కు
బి) జీవించే హక్కు
సి) మత స్వాతంత్ర్యపు హక్కు
డి) సాంసృతిక విద్య హక్కు
2. భారత రాజ్యాంగం పరిధిలో కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది?
ఎ) సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేయటం
బి) శాప్రీయ. స్ఫూర్తిని పెంపొందించడం
సి) ప్రజల ఆస్తిని కాపాడటం
డి) రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను
గౌరవించడం
3.కింది వాటిని పరిశీలించండి
ఎ) విద్యా హక్కు
బి) ప్రభుత్వ సేవ అందుకోవడానికి సమానమైన హక్కు
సి) ఆహార హక్కు - “సార్వత్రిక మానవ హక్కులు ప్రకటన కింది వాటిలో
మానవ హక్కు / మానవ హక్కులు ఏది / ఏవి?
ఎ) ఎ మాత్రమే
బి) ఎ, బి మాత్రమే
సి) సి మాత్రమే
డి) ఎ, బి, సి మాత్రమే
4. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ దేనిని గురించి తెలుపును
ఎ) ఆస్తి హక్కు
బి) జీవించే హక్కు
సి) విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం
డి) ఆర్టినెన్స్ జారీ చేయడంలో రాష్ట్రపతి అధికారం
5. ఈ క్రింది వానిలో ఏ విషయంలో భారత్ మరియు అమెరికా రాజ్యాంగాలు పోలిక ఏది?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ఆదేశిక సూత్రాలు
సి) సమన్యాయ పాలన
డి) రాజ్యాంగ ధృఢత్వం
6. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భావనా స్వాతంత్ర్య హక్కును తెలుపును
ఎ) 10
బి) 19
సి) 14
డి) ఏదీ కాదు
7. క్రింది పేర్కొన్న వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు
ఎ) వాక్ స్వాతంత్ర్యము మరియు భావనా స్వాతంత్ర్యము
బి) భారత్‌లో ఏ ప్రదేశంలో అయినా భావనా స్వాతంత్ర్యము "
సి అల్పసంఖ్యాక వర్గము వారి యొక్క విద్యా పురోగతి కొరకు ఒక సంస్థను న్థాపించుట
డి) అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లోనికి ప్రవేశించుట
8. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి
ఎ. ప్రాథమిక హక్కులు
బి. ప్రాథమిక 'విధులు
సి. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు
భారత రాజ్యంలోని పైన పేర్కొన్న నిబంధనలలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వేటిని సంతృప్తిపరుస్తుంది
ఎ) ఎ మాత్రమే
బి) సి మాత్రమే
సి) ఎ, సి మాత్రమే
డి) ఎ,బి, సి
9. వయోజనులందరూ ఓటు వేసి, వారి ప్రభుత్వమును ఎన్నుకొను ఓటు హక్కును ఏమంటారు?
ఎ) సార్వత్రిక వయోజన ఓటు హక్కు
బి) సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన
సి) సార్వత్రిక తపాలా సంఘం
డి) పైవి ఏవీ కావు
10. ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఏది?
ఎ) వాక్ స్వాతంత్ర్యపు హక్కు
బి మత స్వేచ్చ హక్కు
సి) ఆస్తి హక్కు
డి) న్యాయ స్థానాలకు పోగల హక్కు
11. పట్టిక Aని పట్టిక Bతో జతపరిచి కింద పేర్కొన్న పట్టికలో ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరియైన జవాబును ఎంపిక చేయుము?
పట్టికA పట్టిక B
భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు యొక్క ఆర్టికల్స్
ప్రకరణ
ఎ. 14 1. సమానత్వపు హక్కు
బి. 22 2. మత స్వేచ్చ హక్కు
సి. 25 3. రాజ్యాంగ పరిహారపు హక్కు
డి. 32 4. ఖైదీ యొక్క హక్కు
కోడ్‌లు
ఎ) 1-ఎ, 4-బి 3-సి 2-డి
బి) 4-ఎ, 1-బి 2-సి 3-డి
సి) 1-ఎ, 4-బి 2-సి 3-డి
డి) 4-ఎ, 1-బి 3-సి 2-డి
12 భారత దేశములో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) పార్లమెంటు
డి) సుప్రీం కోర్టు మరియు హైకోర్టులు
13. ప్రాథమిక హక్కులను అమలు పరచడానికి రిట్స్‌ను జారీ చేయు అధికారము కలిగినది?
ఎ) భారత దేశములో అన్ని కోర్టులు
బి) పార్లమెంటు
సి) సుప్రీం కోర్టు
డి) రాష్ట్రపతి
14. పౌరులకు ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి.
ఎ) భాగం - III
బి) భాగం - IV
సి) భాగం - II
డి) భాగం - VI
15. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనతో తాత్కాలిక రద్దుకు గురి అయ్యేది
ఎ) ప్రాథమిక హక్కులన్ని
బి) స్వేచ్చా హక్కు
సి) రాజ్యాంగ పరిహారపు హక్కు
డి) ప్రాథమిక విధులు
16. భారత రాజ్యాంగం ఏ భాగంలో “చింతన, భావ ప్రకటన, విశ్వాసము, నమ్మకం “ప్రార్ధనా స్వేచ్చ” అనే పదాలు ఎక్కడ ఉటంకించబడ్డాయి
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ఆదేశ సూత్రాలు
సి) పీఠిక
డి) కేంద్ర న్యాయ స్థానం
17. 42వ రాజ్యాంగ సవరణ ప్రథమంలో ప్రతిపాదించింది?
ఎ) 10 ప్రాథమిక హక్కులు
బి) 11 ప్రాథమిక హక్కులు
సి) 9 ప్రాథమిక హక్కులు
డి) 7 ప్రాథమిక హక్కులు
18. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియచేసిన పత్రం?
ఎ) మాగ్నా కార్టా
బి) యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్
సి) అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్
డి) సివిల్ రైట్స్ చట్టం
19. రాజ్యాంగములో పీడన నిరోధంకి సంబంధించిన ప్రకరణలు
ఎ) అధికరణ 29 మరియు 30
బి) అధికరణ 19 నుంచి 22
సి) అధికరణలు 28 మరియు 24
డి) అధికరణలు 14 నుంచి 18
20. ప్రాథమిక హక్కును అమలు జరుపుట కొరకు రాజ్యాంగంలో కనబరచిన పరిష్కారం
ఎ) ఆర్టికల్ 14
బి) ఆర్టికల్ 34
సి) ఆర్టికల్ 35
డి) ఆర్టికల్ 32
సమాధానాలు
1.సి 2.ఎ 3.డి 4.బి 5.ఎ 6.బి 7.డి 8.బి 9.ఎ 10.సి
11.సి 12.డి 13.సి 14.ఎ 15.ఎ 16.సి 17.ఎ 18.ఎ 19.సి 20.డి