భారత రాజ్యాంగం రచన-Nature and Salient Features of Indian Constitution Practice Exam Bits in Telugu
నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు
1. భారత రాజ్యాంగం
ఎ) పరిణామాత్మకం
బి) చట్టీకృత క్రోడీకరణ
సి) రాజ్యాంగ సంప్రదాయాలు సంకలనం
డి) పై వేవీ కాదు
2. అలిఖిత రాజ్యాంగానికి మరో పేరు
ఎ) పరిణామాత్మక రాజ్యాంగం
బి) సంచిత రాజ్యాంగం
సి) పై రెండు సరైనవే
డి) పైవి ఏవీ కాదు
3. ఈ క్రింది వాటిలో సరైనది
ఎ) రాజ్యాంగ పరిషత్ నిజమైన ప్రజా ప్రాతినిధ్య సంస్థ కాదు
బి) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంట్‌గా పనిచేసింది.
సి) రాజ్యాంగ పరిషత్‌లో అన్ని తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
డి) పై అన్నియు సరైనవే
4. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి చేసిన డిమాండ్లలో సరికాని అంశం.
ఎ) భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం 1918
బి) మోతీలాల్ నెహ్రూ నివేదిక 1928
సి) యం.యన్.రాయ్ ప్రస్తావన 1934
డి) సైమన్ కమీషన్ నివేదిక 1928
5. రాజ్యాంగ పరిషత్ దాదాపు అన్ని అంశాలను అందరికీఆమోదించింది. ఈ సూత్రాన్ని ఏమని పిలుస్తారు.
ఎ) పటేల్ - ప్రసాద్ సూత్రం
బి) మున్షీ - అయ్యంగార్ సూత్రం
సి) అంబేద్కర్ - నెహ్రూ సూత్రం
డి) పైవి ఏవీ కాదు
6. రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలను రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులు గట్టిగా సమర్థించి, వాటిని పొందువరిచేలా చేశారు. దానికి సంబంధించి సరికానిది
ఎ) ప్రాథమిక హక్కులు, మైనారిటీల రక్షణలు, సామాజిక సంస్కరణలు - జవహర్ లాల్ నెహ్రూ
బి) స్వదేశీ సంస్థాాలు, పబ్లిక్ సర్వీసులు - సర్దార్ పటేల్
సి) అత్యవసర అధికారాలు - డా॥ అంబేద్కర్
డి) బలమైన కేంద్ర ప్రభుత్వం - డా॥ రాజేంద్ర ప్రసాద్
7. రాజ్యాంగ పరిషత్‌లో కాంగ్రెసేతర సభ్యులు
ఎ) డా॥ బి.ఆర్. అంబేద్కర్
బి) గోపాలస్వామి అయ్యంగార్
సి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
డి) పై అందరూ
8. ఈ క్రింది ఏ అంశాలను రాజ్యాంగ వరిషత్ ఏకాభిప్రాయ సాధన ద్వారా ఆమోదించింది
ఎ) సమాఖ్య అంశాలు
బి) భాషా అంశాలు
సి) పై రెండూ
డి) పైవి ఏవీ కాదు
9. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా వర్ణిస్తారు.
కారణం
ఎ) ప్రతి లాయరు రాజ్యాంగాన్ని తప్పక చదవాలి
బి) ప్రతి న్యాయ విద్యార్థి రాజ్యాంగాన్ని తప్పక చదవాలి
సి) రాజ్యాంగంలో వివిధ అంశాలను, ప్రకరణలను, షెడ్యూల్‌లను పేరుతో విసృతంగా, సంక్లిష్టంగా, పొందు పరచడం
డి) పైవన్నియు సరైనవి
10. “రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో నా విధి కోతలు వేయడమే. నా అభీష్టానికి వ్యతిరేకంగా చాలా అంశాలను తొలగించివేసే పరిస్థితి కల్పించారు” అని వ్యాఖ్యానించినది
ఎ) డా॥ బి.ఆర్. అంబేద్మర్
బి) డా॥ ఆర్. రాజేంద్రప్రసాద్
సి) డా॥ బి.ఎన్. రావు
డి) కె. మున్షీ
సమాధానాలు
1.బి 2.సి 3.డి. 4.డి 5.బి 6.డి, 7.సి 8.సి 9.సి 10.ఎ