Indian Constitution Practice Bits-7

TSStudies
0
Preamble-Philosophical Foundations of Indian Constitution Previous Exams Bits in Telugu

రాజ్యాంగ ప్రవేశిక/పీఠిక -తాత్విక పునాదులు (Preamble-Philosophical Foundations of Indian Constitution Previous Govt Exams Bits)

గతప్రశ్నలు: 1990 నుండి వివిధ పోటీ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు


1. భారతదేశములోని రాజ్యాధికారమునకు మూలం

ఎ) రాజ్యాంగము 

బి) పార్లమెంటు

సి) ప్రజలు 

డి) రాష్ట్రపతి


2. భారత రాజ్యాంగ పీఠికలో గల పదాలు

ఎ) సార్వభౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాద, గణతంత్రరాజ్యం

బి) సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం

సి) సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక

డి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక,ప్రజాస్వామిక,గణతంత్ర రాజ్యం


3. భారత రిపబ్లిక్‌ రాజ్యాంగము

ఎ) రాజ్యాంగ సభద్వారా నిర్మాణం కావింపబడి గవర్నర్‌ జనరల్‌ ద్వారా ఆమోదింపబడినది.

బి) బ్రిటీషు పార్లమెంటు ద్వారా ప్రతిపాదించబడి రాజ్యాంగ సభ ద్వారా ఆమోదింపబడింది.

సి) భారత జాతీయ కాంగ్రెసు ద్వారా ప్రస్తావించబడి రాజ్యాంగ సభ ద్వారా ఆమోదింపబడింది.

డి) రాజ్యాంగపరిషత్తు ద్వారా రాయబడి మరియు స్వీకరించబడింది.


4. రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను మరియు అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది?

ఎ) ప్రవేశిక

బి) ప్రాథమిక హక్కులు

సి) ఆదేశ సూత్రాలు

డి అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రకరణలు


 5. ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగకర్తలు ఏ దేశ రాజ్యాంగము నుండి తీసుకున్నారు?

ఎ) యు.ఎస్‌.ఎ

బి) యు.కె

సి) యు.ఎస్‌. ఎస్‌.ఆర్‌ 

డి) జర్మనీ


6. భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్‌ అనే పదాన్ని ఏ రాజ్యాంగము నుంచి స్వీకరించారు?

ఎ) ఫ్రెంచి రాజ్యాంగము

బి) జర్మనీ రాజ్యాంగము

సి) యు.ఎస్‌. రాజ్యాంగము

డి) యు.కె. రాజ్యాంగము /


7. రాజ్యాన్ని మతం నుండి వేరుచేయదాన్ని ఏమంటారు? ,

ఎ) లౌకిక వాదం 

బి) సామ్య వాదం

సి) నాస్తిక వాదం 

డి) సాంఘికన్యాయం


8. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది

ఎ) రాజ్యాంగం 

బి) ప్రజలు

సి) పార్లమెంటు 

డి) పత్రికలు






సమాధానాలు

1.సి 2.డి 3.డి 4.ఎ 5.ఎ 6.ఎ 7.ఎ  8.ఎ

Post a Comment

0Comments

Post a Comment (0)