Preamble-Philosophical Foundations జ్ఞానాత్మక , అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
1. ప్రవేశిక ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు
ఎ) అమెరికా
బి) ఇంగ్లాండ్
సి రష్యా
డి) ఐర్లాండ్
2. ప్రవేశికకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజంకాదు.
ఎ) దీనిని న్యాయస్థానాల ద్వారా అమలుపరచవచ్చు.
బి) రాజ్యాంగము ఏర్పరచిన, అమలు చేయాల్సిన లక్ష్యాలను తెలుపుతుంది.
సి) రాజ్యాంగాన్ని చట్టపరంగా అన్వయించడంలో భాషాపరంగా సంశయమేర్పడినప్పుడు ప్రవేశిక తోడ్పడుతుంది
డి) రాజ్యాంగం ప్రజాధికారంపై ఆధారపడుతుందని ప్రకటిస్తుంది.
ఎ) ఎ మాత్రమే
బి) ఎ, బి
సి) బి,సి
డి) బి, సి,డి
3. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం.
ఎ) సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం సమానహోదా మరియు అవకాశం
బి) ఆలోచన, భావప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వేచ్చ
సి) వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించు సౌభ్రాతృత్వాన్ని
డి) పైవన్నీ
4. స్వేచ్చ, సమానత్వము మరియు సౌభ్రాతృత్వము, గణతంత్ర స్వభావము ఏ దేశ రాజ్యాంగము నుండి గ్రహించారు.
ఎ) ఫ్రెంచి
బి) బ్రిటీష్
సి) ఐర్లాండు
డి) రష్యా
5. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది
ఎ) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు - గోలక్‌నాథ్ కేసు
బి) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే - కేశవానంద భారతీ కేసు
సి) లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక స్వరూషహమే - ఎస్.ఆర్. బొమ్మయ్ కేసు
డి) పై అన్నియు సరైనవే
6. 42వ రాజ్యంగ సవరణ చట్టము ద్వారా ప్రవేశికలో చేర్చినపదమేది.
1. సౌమ్యవాద
2. లౌకిక
3. సమగ్రత
4. సార్వభౌమ
ఎ) 1, 2
బి) 2, 3
సి) 1,2,3
డి) పైవన్నీ
7. మన దేశం పేరును రాజ్యాంగంలో ఎలా పొందుపర్చారు.
ఎ) ఇండియా - భారత్
బి) హిందుస్థాన్
సి) అఖండ్ భారత్
డి) సిందూస్థాన్
8. భారతదేశము ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది.
ఎ) ప్రజాస్వామిక వ్యవస్థ
బి) పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ
సి) అధ్యక్ష తరహా వ్యవస్థ
డి) సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
9. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే
ఎ) రాజ్యాంగ లక్షణాలు అతిముఖ్యమైనవి. వాటిని సవరించడానికి వీలులేదు.
బి ప్రాథమిక హక్కులను కుదించడంగాని, తొలగించడం కాని కుదరదు.
సి) 368 ప్రకరణ ప్రకారం తప్ప రాజ్యాంగాన్ని సవరించ వీలుకాదు.
డి) కొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఉండదు
10. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ హృదయం, ఒక ఆభరణంగా వర్ణించినది ఎవరు.
ఎ) మహాత్మా గాంధి
బి) అంబేద్మర్
సి) వల్లభ్‌భాయ్ పటేల్
డి) ఠాకూర్‌దాస్ భార్గవ
11. రాజ్యాంగ ప్రవేశిక
ఎ) సూచనాత్మకమైనది
బి) విషయసూచిక వంటిది
సి) పై రెండు సరైనవే
డి) పై రెండు సరికాదు
12. ప్రవేశిక నుంచి ఏవి తెలుసుకోవచ్చును
ఎ) రాజ్యాంగ ఆమోద తేది
బి) రాజ్యాంగ ఆధారాలు
సి) రాజ్యాంగ ఆశయాలు
డి) పై అన్నియు
13. “రాజ్యాంగంలో ప్రస్తావించబడిన “లౌకిక తత్వం”, “సామ్యవాదం” అనే ఆదర్శాలను ద్విగుణీకృతం చేయడానికి ఈ ప్రయత్నం” అని ఎక్కడ పేర్కొనబడింది.
ఎ) రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానం
బి) రాజ్యాంగ పరిషత్ చర్చలు
సి) 42వ రాజ్యాంగ సవరణ 1976
డి) సర్కారియా కమిషన్ నివేదిక 1987
14. ప్రవేశిక ముఖ్య ఆధారం రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానం. ఆశయాల తీర్మానంలో ఏ పేరాగ్రాఫ్‌లో నుండి ప్రవేశిక మౌలిక పద బంధాలను గ్రహించారు.
ఎ) పేరాగ్రాఫ్ 4
బి) పేరాగ్రాఫ్ 5
సి) పేరాగ్రాఫ్ 7
డి) పై అన్నియు
15. ప్రవేశిక ప్రారంభ, చివరి పదాలను గుర్తించుము
ఎ) భారత ప్రజలమన బడే మేము - మాకు మేము సమర్పించుకుంటున్నాము
బి) స్వతంత్ర ప్రజల మనబడే మేము - రాజ్యాంగ పరిషత్‌చే సమర్పించుకుంటున్నాము
సి) సార్వజనీయులమైన మేము - పార్లమెంట్ ద్వారా ఆమోదిస్తున్నాం
డి) పెవేవీ కాదు
16. “సమగ్రత” (Integrity) అనే పదాన్ని 1976, 42 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. దీని ఉద్దేశం.
ఎ) వేర్పాటువాద శక్తులను అరికట్టడం
చి) భౌగోళిక సామీప్యతను సాధించడం
సి) మతకలహాలను నియంత్రించడం
డి) పై అన్నియు సరైనవే
17. ప్రవేశికలో ప్రస్తావించబడిన పద జాలం
ఎ) హక్కులు
బి) సమాఖ్య
సి) న్యాయం
డి) ఎ మరియు బి
18. “స్వామ్యవాదం” అనే పదజాలంతో ఎవరి భావాలు ఉన్నాయి
ఎ) మార్క్స్ మరియు గాంధీ
బి) గాంధీ మరియు నెహ్రూ
సి) మార్క్స్ మరియు మావో
డి) మార్క్స్ మరియు వినోభా బావే
19. ప్రవేశికకు సంబంధించి సరైనది
ఎ) రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది
బి) ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు
సి) సవరణకు అతీతం కాదు
డి పై అన్నియు సరైనవే
20. ప్రవేశికలో చేయబడిన పవిత్ర తీర్మానం (Solemn Rosution) ఎవరిపేరుతో చేయబడింది
ఎ) భారత ప్రజలు
బి) రాజ్యాంగ పరిషత్ స్వేచ్భా భారత్
సి) భారత రాజ్యాంగం
డి) భారత స్వాతంత్ర్య చట్టం 1947
సమాధానాలు
1.ఎ 2.ఎ 3.డి 4.ఎ 5.డి 6.సి 7.ఎ 8.డి 9.డి 10.డి
11.ఎ 12.డి 13.సి 14.డి 15.ఎ 16.ఎ 17.డి 18 ఎ 19.డి 20.ఎ