Fundamental Rights Practice Questions జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
21. ప్రాథమిక హక్కులు అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు
ఎ) ఆర్టికల్ 32
బి) ఆర్టికల్ 33
సి) ఆర్టికల్ 34
డి) ఆర్టికల్ 35
22. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు.
ఎ) ఆర్మీలో పనిచేసే వారికి
బి) పోలీసు శాఖకు
సి) ఎ.సి.బి
డి) సి.బి.ఐ
23. భారత్ రాజ్యాంగంలోని అధికరణ 14 క్రింద దీనినినిషేధించలేదు
ఎ) క్లాస్ చట్టం
బి) న్యాయమైన వర్గీకరణ
సి) తారతమ్యం
డి) విడదీయడం
24. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని క్రింది అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి.
ఎ) అధికరణలు 14 నుండి 18
బి) అధికరణలు 19 నుండి 22
సి) అధికరణలు 28 నుండి 24
డి) అధికరణలు 25 నుంచి 28
25. రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు
ఎ) పది విధులు
బి) పదకొండు విధులు
సి) తొమ్మిది విధులు ) పన్నెండు విధులు
26. ప్రాథమిక హక్కుల నుంచి అస్తి హక్కును ఎవరి పదవీ కాలంలో తొలగించారు?
ఎ) మొరార్డీ దేశాయ్
బి) రాజీవ్ గాంధీ
సి) చరణ్ సింగ్
డి) ఇందిరా గాంధీ
27. జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు కాని హక్కు
ఎ) సమానత్వపు హక్కు
బి) జీవనము వ్యక్తి స్వాతంత్ర్యము హక్కు
సి) మతపరమైన స్వేచ్చ
డి) భావ ప్రకటన స్వేచ్చ
28. 2002 తరువాత విద్యా వాక్కు ఏ రూవం సంతరించుకుంది
ఎ) న్యాయ పరమైన హక్కు
బి) మానవ హక్కు
సి) ప్రాథమిక హక్కు
డి) సివిల్ హక్కు
29. ఓటు హక్కు దీని క్రిందికి వస్తుంది
ఎ) న్యాయపరమైన హక్కు
బి) ప్రాథమిక హక్కు
సి) రాజ్యాంగ పరమైన హక్కు
డి) పైవన్నీ సరియైనవి కావు
30. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ “రాజ్యం” అనే పదాన్ని నిర్వచిస్తుంది
ఎ) 12
బి) 18
సి) 14
డి) 15
31. భారత రాజ్యాంగంలోని 15వ అధికరణ ఈ క్రింది వాటికి వర్తిస్తుంది
ఎ) పౌరులకు మాత్రమే
బి) పౌరులు కాని వారికి మాత్రమే
సి) పౌరులు మరియు పౌరులు కానివారికి
డి) కార్పోరేషన్లకు మరియు సంఘాలకు
32. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాలు ప్రకటించింది.
ఎ) గోలక్‌నాథ్ - పంజాబ్ రాష్ట్రం
బి) కేశవానంద భారతి - కేరళ రాష్ట్రం
సి) శంకర ప్రసాద్ - భారత యూనియన్
డి) వీటిలో ఏదీకాదు
33. భారత రాజ్యాంగపు మౌలిక లక్షణం కానిది.
ఎ) పార్లమెంటరీ వ్యవస్థ
బి) న్యాయస్థాన ఆధిక్యం
సి) సమాఖ్య వాదం
డి) ప్రాధమిక హక్కులు
34. రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికకు మూలాధారమైన ఆశయాల తీర్మానాన్ని నెహూ ఎప్పుడు ప్రవేశపెట్టారు.
ఎ) 1946 డిసెంబర్ 18
బి) 1946 డిసెంబర్ 11
సి) 1948 డిసెంబర్ 13
డి) 1948 డిసెంబర్ 11
35. ప్రవేశికలో ఈ విధంగా ఉంది.
ఎ) భారత ప్రజలమైన మేము
బి) హిందూ దేశ ప్రజల మైన మేము
సి) యూనియన్ ప్రజల మైన మేము
డి) ఫెడరల్ ప్రజల మైన మేము
36. ప్రవేశికలో లేని పదాలు
ఎ) సమగ్రత
బి) సార్వభౌమత్వం
సి) న్యాయం
డి) సమాఖ్య
37. బెరుబారి అనేది.
ఎ) వ్యక్తి పేరు
బి) ప్రాంతం పేరు
సి) కమీషన్ పేరు
డి) పైవేవీ కావు
38. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు అని చెప్పిన కేసు
ఎ) బెరుబారి
బి) కేశవానంద భారతి
సి) ఎల్.ఐ.సి.
డి) గోపాలన్
39. జతపరుచుము.
1. 1960 ఎ) బెరూబారి
2. 1973 బి) కేశవానంద భారతి
3. 1975 సి) ఇందిరాగాంధీ - రాజ్‌నారాయణ్
4. 1980 డి) మినర్వామిల్స్
ఎ) 1-ఎ, 2-బి, ౩-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, ౩-డి, 4సి
సి) 1-సి, 2-ఎ, ౩-బి, 4-డి
డి) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి
40. రాజ్యాంగ మౌలిక లక్షణాల సారం
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ఆదేశిక సూత్రాలు
సి ప్రాథమిక విధులు
డి) ప్రవేశిక
సమాధానాలు
21.డి 22.ఎ 23.బి 24.డి 25.బి 26.ఎ 27.బి. 28.సి 29.సి 30.ఎ
31.సి 32.బి 33.బి 34.ఎ 35.ఎ 36.డి 37.బి ౩8.ఎ 39.ఎ 40.డి