Indian Constitution Practice Bits-23

TSStudies
0
Union Government of Indian Constitution Previous Exams Bits in Telugu

Union Government - President, Vice President, Prime Minister & Other Council of Ministers

జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌

1. షెడ్యూల్డ్‌ కులాలను నిర్ణయించే అధికారం ఎవరికుంది.

ఎ) రాష్ట్రపతి

బి) యస్‌.సి., యస్‌.టి. జాతీయ సంఘం

సి) గవర్నర్‌

డి) ప్రధానమంత్రి .


2. పార్లమెంట్‌ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికుంది

ఎ) సభాధ్యక్షుడు

బి) రాష్ట్రపతి

సి కేంద్ర ఎన్నికల సంఘం

డి) సుప్రీం కోర్టు


3. పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని పదవిని చేపట్టినది

ఎ) శ్రీమతి ఇందిరా గాంధీ

బి) పి.వి.నరసింహ రావు

సి) ఐ.కె.గుజ్రాల్‌

డి) రాజీవ్‌ గాంధి


4. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది.

ఎ) పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు

బి) పార్లమెంటు సభ్యులు

సి) విధాన సభ సభ్యులు

డి) పైవేవీ కావు


5. ఈ క్రింది వాటిలో ఏది సరైన అంశం కాదు.

ఎ) రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి శాసనసభలోసభ్యత్వం కలిగి ఉండరాదు.

బి) రాష్ట్రపతి జీతభత్యాలను ఆర్థిక అత్యవసరపరిస్థితులలో తగ్గించవచ్చు.

సి) రాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తికి కనీస విద్యార్హత ఉందాలి.

డి) పైవన్నియూ


6. రాష్ట్రపతి జారీచేసిన ఆర్డినెన్స్‌కు గరిష్ట కాలపరిమితి.

ఎ) 7 1/2 నెలలు

బి) 6 వారాలు

సి) 14 రోజులు

డి) పైవేవీ కావు


7. ఆర్డినెన్స్‌ ఎప్పుడు జారీ చేయవచ్చు.

ఎ) పార్లమెంట్‌ సమావేశంలో లేనప్పుడు

బి) దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు

సి) సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు

డి) పై అన్ని సరైనవే


8. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి విశ్వాసము ఉన్నంత వరకు అధికారంలో ఉంటారు.

ఎ) కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

బి) అటార్నీ జనరల్‌

సి) గవర్నర్‌

డి) బి మరియు సి


9. రాష్ట్రపతి పదవికి పోటీ చేయు వ్యక్తి కనీస వయస్సు ఎంత నిండి ఉండాలి.

ఎ) 18 సం. 

బి) 21 సం.

సి) 36 సం. 

డి) 35 సం.


10. కేంద్ర ప్రభుత్వం అన్ని కార్య నిర్వాహక సంబంధ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి.

ఎ) క్యాబినెట్‌ 

బి) పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యూరో

సి) ప్రధానమంత్రి 

డి) రాష్ట్రపతి


11. ఉపరాష్ట్రపతి పదవిరీత్యా

ఎ) లోక్‌సభ స్పీకర్‌ 

బి) రాజ్యసభ ఛైర్మన్‌

సి) ప్రణాళిక సంఘం ఛైర్మన్‌ 

డి) పైవేవీకావు


12. భారత రాష్ట్రపతి యొక్క కార్య నిర్వాహక అధికారాలలో సరైనది కానిది

ఎ) ప్రధానమంత్రి తీసుకున్న అన్ని నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియ చేస్తుండాలి.

బి) రాష్ట్రపతి, మంత్రిమండలి సమావేశాలను కావాలనుకున్నప్పుడు సమావేశపరుస్తాడు.

సి) ఏదేని ఒక మంత్రి యొక్క నిర్ణయాన్ని మంత్రి మండలి చేత ఆమోదింపమని కోరవచ్చు.

డి) భారతదేశ పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారాన్ని అతడు అడిగినప్పుడు తెలియపరుస్తుండాలి.


13. భారత రాష్ట్రపతి యొక్కకార్య నిర్వాహక అధికారాలలో సరైనది కానిది.

ఎ) ప్రధానమంత్రి సలహామేరకు, అన్ని ముఖ్య నియామకాలు రాష్ట్రపతి చేస్తాడు.

బి) రాష్ట్రపతి మంత్రి మండలిని, ప్రధానమంత్రిని నియమిస్తాడు.

సి) రాజ్యసభ ఛైర్మన్‌లు, సభ్యులను నియమించడానికి, తొలగించడానికి రాష్ట్రపతికి పూర్తి అధికారం ఉంది.

డి) రాష్ట్రపతి రక్షణ దళాల సుప్రీం కమాండర్‌


14. భారత రాష్ట్రపతి

ఎ) పార్లమెంటులో భాగం

బి) సాంప్రదాయం ప్రకారం రెండు పర్యాయాల కంటే ఎన్నిక కావడానికి అనర్హుడు

సి) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.

డి) పై అన్నీ


15. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి

ఎ) ఫక్రూద్దీన్‌ అలీ అహ్మద్‌ 

బి) హిదయతుల్లా

సి) హెచ్‌.జె. కానియా 

డి) జాకీర్‌ హుస్సేన్‌



సమాధానాలు

1.ఎ 2.బి 3.బి 4.బి 5.డి 6.ఎ 7.ఎ 8.డి 9.డి 10.డి 11.బి 12.బి 13.సి 14.డి 15.బి 


Post a Comment

0Comments

Post a Comment (0)