Union Government - President, Vice President, Prime Minister & Other Council of Ministers
జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
31. జతపరచండి.
ఎ) ఆర్టికల్ 54 1. భారత రాష్ట్రపతి ఎన్నిక
బి) ఆర్టికల్ 75 2. ప్రధానమంత్రి, మంత్రిమండలి నియామకం
సి) ఆర్టికల్ 155 ౩. రాష్ట్ర గవర్నర్ నియామకం
డి) ఆర్టికల్ 164 4 ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి నియామకం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-4, బి-2, సి-3, డి-1
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
32. ఎటువంటి సవరణలు చేయకుండా కేంద్ర క్యాబినెట్ తిప్పి పంపిన ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్సుకు ఏ ఆర్టికల్ ప్రకారం 2002లో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఎ) ఆర్టికల్ 121
బి) ఆర్జికల్ 122
సి) ఆర్టికల్ 123
డి) ఆర్టికల్ 124
33. ఎన్నో రాజ్యాంగ సవరణ రాష్ట్రపతికి మంత్రిమండలి పంపిన విషయాన్ని పునపరిశీలన కొరకు తిరిగి వెనకకు పంపే అధికారాన్ని కల్పించింది.
ఎ) 39
బి) 40
సి) 42
డి) 44
34. భారత రాష్ట్రపతి హోదా
ఎ) దేశాధినేత
బి) ప్రభుత్వాధినేత
సి) దేశ, ప్రభుత్వాధినేత
డి) ఏదీ కాదు
35. రాష్ట్రపతి ఈ క్రింది వాటిలో దేనిని ప్రకటించవచ్చు.
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి
బి) రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి
సి) ఆర్ధిక అత్యవసర పరిస్థితి
డి) అన్ని రకాల అత్యవసర పరిస్థితులను
36. రాష్ట్రపతి ఎన్నికల గణంలో
ఎ) అన్ని రాష్ట్రాల ఎన్నికయిన విధానసభల సభ్యులు
బి) పార్లమెంట్ రెండు సభలలో ఎన్నికైన సభ్యులు
సి) ఢిల్లీ పాండిచ్చేరి శాసనసభ్యులు
డి) పైవన్ని సరైనవే
37. ఏ ప్రకరణ భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మధ్యగల సంబంధాలను తెలియచేస్తుంది.
ఎ) 149
బి) 249
సి) 74
డి) 78
38. రాష్ట్రపతి ఆర్దినెన్సును ఎప్పుడు జారీ చేస్తారు.
ఎ) పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఏదైనా అత్యవసర విషయం మీద
బి) పార్లమెంటు ఆమోదించని పరిస్థితిలో
సి) లోక్‌సభ, రాష్ట్రపతితో అంగీకరించకపోతే
డి) సరిహద్దు దేశాలు, కవ్వింపు చర్యలకు పాల్పడినపుడు
39. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కొత్త రాష్ట్రపతిని ఎంత కాలం లోపల ఎన్నుకుంటారు.
ఎ) 6 నెలల లోపు
బి) తక్షణం
సి) ఒక నెల లోపల
డి) రెండు నెలల లోపల
40. జతపరుచుము.
1. Pardon ఎ) శిక్షా స్వభావాన్ని మార్చి కఠినమైన శిక్ష స్థానంలో తక్కువ శిక్షను విధించుట
2. Commute బి) శిక్ష స్వభావాన్ని మార్చకుండా శిక్షను తగ్గించుట
3. Remissionసి) నేరస్తునికి అన్ని శిక్షల నుంచి విముక్తి కలిగించుట
4. Reprieve డి) తాత్కాలికంగా శిక్షను వాయిదా వేయుట
ఎ) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
బి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-ఎ, ౩-డి, 4-బి
డి) 1-బి, 2-ఎ, ౩-సి, 4-డి
41. రాష్ట్రపతి శాసనాధికారం
ఎ) ఆర్టినెన్సుల జారీ
బి) పార్లమెంటు సమావేశాల ఏర్పాటు, ముగింపు
సి పార్లమెంటునుద్దేశించి ప్రసంగించుట
డి) పైవన్నీ
42. ద్రవ్యేతర బిల్లు కాని దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపితే
ఎ) ఆమోదాన్ని తెలువచ్చు
బి) పునపరిశీలనకు పంపవచ్చు
సి, ఆమోదం తెలియచేయకుండా మౌనం వహించవచ్చు
డి) పైవన్నీ
43. రాష్ట్రపతి బిల్లుల ఆమోదానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది నిజం -
ఎ) రాష్ట్ర బిల్లు లేదా, ప్రైవేటు సభ్యుల బిల్లు అయితే పూర్తి వీటోను వినియోగించవచ్చు.
బి) రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టమవుతుంది.
సి) కేంద్ర ప్రభుత్వ బిల్లు విషయంలో అతను సస్పెన్సివ్‌వీటో అధికారాన్ని వినియోగించవచ్చు.
డి) పైవన్ని
44 రాష్ట్రపతి కార్య నిర్వహణాధికారానికి సంబంధించి నిజమైనది
ఎ) 42వ రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్రపతి క్యాబీనెట్ సలహాను తప్పకుండా ఆమోదించాలని చెబుతుంది.
బి) క్యాబినెట్ సలహాను రాష్ట్రపతి పునపరిశీలనకు పంపేందుకు 44వ సవరణ చట్టం వీలు కల్పించింది.
సి) పునఃపరిశీలన తర్వాత ఆ సలహాను రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాలి.
డి) పైవన్ని
45. ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనుటకు ఏర్పరిచే ఎన్నికల గణంలోని సభ్యులెవరు.
ఎ) పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు మరియు రాష్ట్ర విధాన సభల సభ్యులు
బి) ఎన్నుకోబడిన పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు
సి) నామినేట్ చేయబడే సభ్యులతో సహా పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు
డి) మొత్తం పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభల సభ్యులు
సమాధానాలు
31.ఎ 32.సి 33.డి 34.ఎ 35.డి 36.డి 37.డి 38.ఎ 39.ఎ 40.ఎ 41.డి 42.డి 43.డి 44.డి 45.సి