Indian Federal System Practice Questions in Telugu
జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు .
33. దేశంలో అత్యున్నత విధాన నిర్జాయక మండలి ఏది.
ఎ) పార్లమెంటు
బి) జాతీయ అభివృద్ధి మండలి
సి ప్రణాళికాసంఘం
డి) ఏదీకాదు
34. సమాఖ్య ముఖ్యలక్షణం
ఎ) అధికార పృథక్కణ
బి) అధికార విభజన
సి) అధికార బదలాయింపు
డి) పైవన్నీ
35. ఈ క్రింది వాటిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి సంబంధించిన కమిటీ
ఎ) ఆర్.యస్. సర్కారియా
బి) రాజమన్నార్
సి) ఎం.ఎం. పూంచీ కమీషన్
డి) పైవన్నీ
36. ప్రణాళికా సంఘం విధి కానిది.
ఎ) పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం
బి) దేశంలో మానవ, ఇతర వనరులను అంచనా వేయడం
సి) రాష్ట్ర ప్రణాళికలను ఆమోదించడం
డి) ప్రణాళికా అమలును సమీక్షించడం
37. కేంద్ర రాష్ట్రాల అధకార విభజన వివాదాలు పరిష్కరించేందుకు ఉపయోగించే సూత్రాలు
ఎ) డాక్‌ట్రిన్ ఆఫ్ కలరబుల్ లేజిస్లేషన్
బి) డాక్‌ట్రిన్ ఆఫ్ ఇంపైడ్ పవర్స్
సి) డాక్‌ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్‌స్ట్రక్షన్
డి) పైవన్నియు
38. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి
ఎ) బడ్జెట్
బి) అనుమతి ఉపక్రమణ బిల్లు
సి) ఆర్థిక బిల్లు
డి) పైవన్నియు
39. కేంద్ర సంఘటిత నిధి నుండి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది
ఎ) రాష్ట్రపతి
బి) పార్లమెంటు
సి) కేంద్ర ఆర్థిక మంత్రి
డి) కంప్షోలర్ ఆడిటర్ జనరల్
40. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి
1) రాజ్యాంగ ప్రకరణలు
2) సాంప్రదాయాలు, వాడుకలు
3) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
4) సంప్రదింపులు, చర్చలు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 3, 4
డి) 1,3, 4
41. ఈ క్రింది ఏ కమిషన్ కేంద్ర రాష్ట్రాల సంబంధాలను సమీక్ష చేయలేదు
ఎ) ఎం.ఎన్. పుంచీ
బి) రాజమన్నార్
సి) సర్కారియా
డి) దంత్‌వాలా
42. ఈ క్రింది ఏ అంశాలు రాష్ట్ర జాబితాలోకి రావు
ఎ) శాంతి భద్రతలు
బి) మైనింగ్
సి) జైళ్ళు
డి) క్రిమినల్ ప్రాసీజర్స్
43. కేంద్ర రాష్ట్రాల మద్య వివాదాలకు కారణం కానిది
ఎ) గవర్నర్ల నియామకం
బి) రాష్ట్రపతి పాలన
సి) గ్రాంట్ల మంజూరు
డి) అఖీల భారత సర్వీ
44. సహకార సమాఖ్య అనగా
ఎ) రాష్ట్రాల ప్రాధాన్యతలు గుర్తించడం
బి) కేంద్రం పై ఆధారపడడం
సి) రాష్ట్రాలు అడిగిన సహాయాన్ని కేంద్రం అందిచడం
డి) పరస్పర ఆధార మరియు ప్రాధాన్యతలు
45. సహకార సమాఖ్యను పెంపొందించే ప్రకరణలు
ఎ) ప్రకరణ 252
బి) ప్రకరణ 256
సి) ప్రకరణ 258
డి) పైవన్నియు
46. కేంద్ర బడ్జెట్ లోక్‌సభ చేత తిరస్కరించబడితే
ఎ) బడ్జెట్‌ను మార్పు చేసి తిరిగి ప్రవేశపెడతారు
బి) కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారు
సి) ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి రాజీనామా చేస్తుంది
డి) రాష్ట్రపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది
47. రాజ్యాంగంలో ప్రస్తావించబడకుండా ఆ తర్వాత కాలంలో అమల్లోకి వచ్చిన పన్నులు
ఎ) కార్పొరేట్ ట్యాక్స్
బి) సర్వీసు ట్యాక్స్
సి) గిఫ్ట్ ట్యాక్స్
డి) పైవన్నియు
48. క్రింది వాటిలో ఏది సరిగా జత పరచబడలేదు
ఎ) అడవులు - ఉమ్మడి జాబితా
బి) క్రీడలు - రాష్ట్ర జాబితా
సి) ప్రజారోగ్యం రాష్ట్ర జాబితా
డి) లాటరీలు - ఉమ్మడి జాబితా
సమాధానాలు
33.బి 34.బి 35.డి 36.డి 37.డి 38.డి 39.బి 40.ఎ 41.డి 42.డి 43.డి 44.డి 45.డి 46.సి 47.డి 48.డి