రాజకీయ పార్టీలు: Electoral System - Election Commission Electoral Reforms, Political Parties
TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు
21. కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ., సి.పి.ఎం.గా ఏ సం, సమావేశంలో విడిపోయింది.
ఎ) విజయవాడ - 1964
బి) విజయవాడ - 1962
సి) త్రివేండ్రం - 1964
డి) పైవేవీ కాదు
22. గత పదిహేడు లోక్‌సభ ఎన్నికల్లో ఒకే చిహ్నంపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ
ఎ) సి.పి.ఐ
బి) కాంగ్రెస్ (ఐ)
సి) అకాళిదళ
డి) పైవేవి కాదు
23. లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ఘనతను సాధించిన ప్రాంతీయ పార్టీ ఈ క్రింది వానిలో ఏది.
ఎ) డి.ఎం.కె
బి) ఏ.ఐ.డి.ఎం.కె
సి) తెలుగుదేశం పార్టీ
డి) శివసేన
24. విశాలాంధ్ర పిలుపు ఇచ్చినది.
ఎ) కమ్యూనిస్ట్ పార్టీ
బి) కాంగ్రెస్
సి) పై రెండూ
డి) ఏవీ కావు
25. పార్టీ రవాత (వజాస్వావ్యూన్ని గురించి ప్రస్తావించినవారు.
ఎ) ఎం..ఎన్.రాయ్
బి) జయప్రకాశ్ నారాయణ్
సి) గాంధీ
డి) ఎవరూ కాదు
26. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని గురించి ఏవరు పేర్కొన్నారు.
ఎ) జయప్రకాశ్ నారాయణ్
బి) ఎం.ఎన్.రాయ్
సి) గాంధీ
డి) ఎవరూ కాదు
27. ప్రభుత్వ ప్రజాస్వామ్య భావాన్ని పేర్కొన్నదెవరు.
ఎ) ఎం.ఎన్ రాయ్
బి) జయప్రకాశ్ నారాయణ్
సి) వసంత్ సాథే
డి) ఎవరూ కాదు
28. రాజకీయ పార్టీల విధి కానిది?
ఎ) ప్రజల ప్రయోజనాన్ని సమీకరించడం.
బి) ప్రజాభిప్రాయ వ్యక్తికరణ వేదికలు
సి) నియోజకులను చైతన్యం చేయడం
డి) పైవి ఏవీకాదు.
29, ఈ క్రిందివాటిలో సరైన అంశం?
ఎ) 1920కి ముందు భారత్‌లో రాజకీయ పార్టీలు లేవు.
బి) 1935 తరువాతనే క్రమబద్ధమైన పార్టీ వ్యవస్థ ఆరంభమైంది.
సి) 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా ఏర్పడలేదు.
డి) పై అన్నియు సరైనవే.
30. రాజకీయ పార్టీలు?
ఎ) రాజ్యాంగబద్ధమైనవి
బి) చట్టబద్దమైనది.
సి) రాజ్యాంగేతర, చట్టేతరమైనవి
డి) పాక్షిక రాజ్యాంగబద్ధం.
31. భారత రాజకీయ పార్టీల ఎత్తుగడలు?
ఎ) జనాకర్షక ఎన్నికల మ్యానిఫెస్టో.
బి) సమ్మోహన నాయకత్వ ప్రచారాలు
సి) భావోద్వేగాలను ప్రేరేపించడం
డి) పై అన్నియు.
32. భారత రాజకీయ పార్టీల లక్షణం కానిది?
ఎ) క్రమబద్ధమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం
బి) అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడం
సి) నిరంతర చీలికలు-కలయికలు
డి) సైద్ధాంతిక నిబద్ధత
33. సంకీర్ణ రాజకీయాలకు కారణం?
ఎ) సామాజిక పరమైన దృవాలు(Social polarisation)
బి) జాతీయ పార్టీలు బలహీనపడటం లేదా వైఫల్యం
సి) గెలువు, ఓటమి మధ్య ఓట్ల శాతం తక్కువగా ఉండటం
డి) పై అన్నియు సరైనవే
34. ఈ క్రింది ఏ విభాగాన్ని కాంగ్రెస్ పార్టీ 'హైకమాండ్‌గా పిలుస్తారు?
ఎ) ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ
బి) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
సి) కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డ్
డి) పైవి ఏవీకాదు
35. “స్వామ్యవాద తరహా సమాజ స్థాపన” అనే ధ్యేయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశంలో తీర్మానించింది?
ఎ) 1955 అవడి
బి) 1956 బాంబే
సి) 1958 పూన
డి) 1960 మద్రాస్
36. భారత్‌లో ఏకప్రాధాన్యత పార్టీ వ్యవస్థ ఉందని పేర్కొన్నది?
ఎ) రజనీ కొఠారి
బి) వాని పాల్కివాలా
సి) సుభాష్ కష్యప్
డి) యు.వి. పైలీ
37. సమ్మోహన నాయకత్వం అధారంగా ఆవిర్భవించిన పార్టీలు?
ఎ) తెలుగు దేశం
బి) ఎ.ఐ.డి.ఎమ్.
సి) తృణమూల్
డి) పై అన్నియు
38. ప్రతి రాజకీయ పార్టీకి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం
ఎ) పార్టీ సిద్ధాంతం
బీ) క్రమ నిర్మాణం
సి) ఎన్నికల వ్యూహం
డి) ఆర్థిక బలం
39, జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి పడిపోయిన పార్టీ
ఎ) జనతాపార్టీ
బి) కమ్యూనిస్టు పార్టీ
సి) పై రెండూ
డి) పైవి ఏవీ కాదు
సమాధానాలు
21.ఎ 22.ఎ 23.సి 24.ఎ 25.ఎ 26.బి 27.బి 28.డి 29.డి 30.సి
31.డి 32.డి 33.డి 34.బి 35.ఎ 36.ఎ 37.డి, 38.ఎ 39.సి