కొమరం భీం (1901-1940 అక్టోబర్ 27)-History of Komaram Bheem in Telugu
ఇతను 1901 లో ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ తాలూకాలో గల సంకేపల్లి అనే గ్రామంలో చిన్నూ మరియు సోంబారు దంపతులకు జన్మించారు
ఇతను అదిలాబాద్ గోండు తెగకు చెందిన వాడు.
ఇతను 15 సం.ల వయసులో ఉన్నప్పుడు అటవీశాఖ సిబ్బంది జరీపిన దాడిలో ఇతని తండ్రి చనిపోయాడు. దీంతో కొమరం భీమ్ యొక్క కుటుంబం కరిమెర ప్రాంతంలో గల సర్దాపూర్ గ్రామానికి వలస పోయింది. అచ్చట కొంత భూమిని సాగు చేసుకుంటూ వీరు జీవితం కొనసాగించారు.
కరిమెర ప్రాంతంలో జమీందార్ అయిన సిద్ధిఖీ యొక్క కన్ను కొమరం. భీమ్ కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిపై పడింది, సిద్ధిఖీ తన అనుచరులను పంపి ఆ సాగు భూమిని ఆక్రమిందాడు
దీంతో ఆగ్రహించిన కొమరం భీమ్ సిద్ధిఖీపై దాడి చేసి అతన్ని హతమార్చాడు. పోలీసులకు భయపడి తక్షణమే కొమరం భీమ్ కరిమెర ప్రాంతాన్ని విడిచిపెట్టి అస్సాంకు పారిపోయాడు. అస్సాంలోని కాఫీ, తేయాకు తోటల్లో 5 సం॥ల పాటు పనిచేశాడు. ఆ సమయంలో కొమరం భీమ్ బెంగాల్ విప్లవకారుల గూర్చి కథల రూపంలో వినేవాడు. విప్లవకారులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంతో బాగా ప్రభావితుడయ్యాడు. అప్పుడే అనేక రకాల ఆయుధాల ఉపయోగం గూర్చి కూడా తెలుసుకున్నాడు.
5సం॥లు అస్సాంలో గడిపిన కొమరం భీమ్ కరిమెర ప్రాంతానికి తిరిగివచ్చాడు.
ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు అనేక విధాలుగా దోచుకోబడుతున్నారు.
అడవుల యొక్క పట్టాలు జారీ చేయడంలో అటవీ ప్రాంతం ఒక కొనుగోలు, అమ్మకాల వస్తువుగా మారింది. దీంతో భూస్వాములు, ధనికులు, వడ్డీ వ్యాపారులు అడవులను కొసుగోలు చేసి పట్టాలు పొందేవారు. వీరు అడవుల్లోకి ప్రవేశించి గిరిజనులను మభ్యపెట్టి వారి భూములను హరించేవారు. వడ్డీ వ్యాపారులైతే ఋణాలు ఇచ్చి భూములను కారుచౌక ధరలకు కొనుగోలు చేశారు. దీని ఫలితంగా గిరిజనులు కూలీలుగా మారారు. తరతరాలుగా స్వేచ్చగా అనుభవిస్తున్న భూమిలో గిరిజనులు కౌలు దార్లుగా లేదా కూలీలుగా మారి, బానిస జీవితాన్ని గడుపుతున్నారు.
ప్రక్కనే ఉన్న మరాఠ ప్రాంతంలో రైతులు ఆదిలాబాద్‌లోకి ప్రవేశించి గోండుల భూములను ఆక్రమించసాగారు
నిజాం ప్రభుత్వం గిరిజనుల నుండి పుల్లరి, పశువుల కాపరి మొదలగు పేర్లతో. పన్నులు వసూలుచేసేది.
నిజాం ప్రభుత్వం 1938-39లో సిర్పూర్ కాగిత పరిశ్రమను స్థాపించింది. దీని కొరకు సిర్బూర్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వేల ఎకరాల భూమిని తీసుకుంది. ఇచ్చట గిరిజనులను కూలీలు, కార్మికులుగా ఉపయోగించింది
పై కార్యకలాపాల కొరణంగా ఆదిలాబాద్‌లో గోండులు చాలావరకు భూములను. కోల్పోయారు. ఈ బహుముఖ దోపిడీతో విసుగు చెందిన గోండులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిని నడిపే నాయకుడు కావాలి. ఆ నాయకుడే కొమరం భీమ్ రూపంలో గోండులకు దర్శనం ఇచ్చాడు.
అస్సాంలో విప్లవకారుల గాధలు విన్న కొమరం భీమ్ ఇక గోండుల తరపున పోరాటం చేయుటకు కంకణం కట్టుకున్నాడు.
ఆసిఫాబాద్ తాలూకాలోని బాబేఝరి, జోడేఘాట్ గుట్టలు ఇతని పోరాటానికి కేంద్రస్థానాలయ్యాయి.
కొమరం భీమ్ ప్రఖ్యాత 'జల్, జంగిల్, జమీన్' మనది ఛలో ఛలో అనే నినాదాన్ని ఇచ్చాడు. స్థానిక గోండు తెగల వారిని ఏకం చేశాడు.
“జల్, జంగిల్ జమీన్ అనగా నీరు, అడవి, భూమి మనదే, వీటిపై పూర్తి హక్కు మన స్టానికులదే. మైదాన ప్రాంతాల నుండి వచ్చి మన భూములను, గుట్టలను ఆక్రమించుకున్న భూస్వాములు, ధనిక రైతులు, వడ్డీ వ్యాపారులు గోండుల నుండి ఆక్రమించుకున్న భూములను తిరిగి అప్పగించి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాడు.
ప్రభుత్వం కూడా పుల్లరి, పశువుల కాపరి పన్నులను వసూలు చేయడాన్ని ఖండించాడు.
పన్ను వసూలు అధికారులపై దాడులు చేశాడు. భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, ధనిక రైతులపై కూడా దాడులు చేశాడు
దీంతో నిజాం ప్రభుత్వం శాంతిభద్రత సమస్య అనే పేరుతో పోలీసులను మన్యంలోకి పంపింది
కొమరం భీం నాయకత్వంలోని గోండులు నిజాం పోలీసులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. పోలీసులను అటవీ ప్రాంతంనుండి తరిమికొట్టారు
దీంతో నిజాం ప్రభుత్వం 1939-40లో 'బాబేఝరి,. జోడేఘాట్ గుట్టల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొమరం భీమ్‌ను అంతం చేయుటకు సైన్యాన్ని పంపింది
కొమరం భీం అనుచరుల్లో ఒకడైన కుర్ధుపటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ గుట్టల్లో కొమరం భీం యొక్క రహస్య స్థావరాన్ని ముట్టడించింది.
నిజాం సైన్యం మరియు కొమరం భీం యొక్క అనుచరుల మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణ జరిగింది. కొమరం భీం తన యుద్ధ చాతుర్యతను ప్రదర్శించి "సైన్యాన్ని బాగా ప్రతిఘటించాడు. కానీ 'సైనికబలం అధికంగా ఉండుటచే కొమరం భీమ్ 1940 అక్టోబర్ 8న వీరమరణం పొందాడు.
గోండులు పవిత్రంగా భావించే అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ అసువులుబాసాడు.
నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదిలాబాద్ గోండుల పోరాటంతో ప్రభావితుడై వారి స్థితిగతులను హైమన్ డార్భ్/ హెమిండ్రాఫ్ అనే జర్మనీకి చెందిన మానవ శాస్త్రజ్ఞుడు ఆంత్రోపాలజిస్ట్‌చే అధ్యయనం చేయిం చాడు. గోండుల స్థితిగతుల గూర్చి హైమన్ డార్ఫ్ తన “ట్రైబల్ హైదరాబాద్” అనే పుస్తకంలో వివరించాడు.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ గోండుల జీవనశైలితో ప్రభావితుడై సుమారు లక్ష ఎకరాల భూమిపట్టాలను గోండులకు ఇచ్చాడు.
తెలంగాణ ప్రభుత్వం 2014 అక్టోబర్ 8న కొమరం భీం యొక్క 74వ వర్ధంతిని ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ వద్ద ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ వద్ధ అధికారికంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కై చంద్రశేఖర్‌రావు కొమరం భీమ్ పేరుపై 25 కోట్ల రూ.లతో 100 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు.
ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజించి, కొత్త జిల్లాకు కొమరం భీం జిల్లాగా నామకరణం చేసారు.