రాంజీ గోండ్‌

TSStudies
0

History of Ramji Gond

రాంజీ గోండ్‌

  • ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలువబడే  1857 తిరుగుబాటు కంటే ముందే బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటం చేనిన వీరుడు రాంజీ గోండ్‌, కానీ చరిత్ర దీన్ని విస్మరించింది. వలస పాలకులు ఈ గోండు నాయకుని పోరాటానికి కనీస ప్రాధాన్యత కూడా కల్పించలేదు
  • ఈ క్రమంలో గోండుల పాలన గూర్చి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం
  • గోండులు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆదిలాబాద్‌లో సుమారు 530 సం॥లు పాలించారు
  • క్రీ.శ.1220లో కోల్‌ఖిల్‌ గోండు రాజ్యాన్ని స్థాపించాడు.
  • ఇతని రాజధాని ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌. ఇతను కాకతీయ గణపతిదేవునికి సమకాలీకుడు,
  • ఇతని తర్వాత వచ్చిన భీమ్‌ భల్లాల్‌ సింగ్‌ సీర్పూర్‌లో బలమైన కోటను నిర్మించాడు.
  • దినకర్‌సింగ్‌ పొలనాకాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇతను. సాహిత్యాన్ని భాగా. పోషించాడు.
  • నూర్జ భల్లాల్‌సింగ్ ఢిల్లీ సుల్తానుల నుండి 'షా' అనే బిరుదు పొందాడు. ఇతని తర్వాత గోండు పాలకులు 'షా' అనే పదాన్ని తమ పేరుకు జోడించుకునేవారు.
  • ఖండియా భల్లాల్‌ షా భల్లాల్‌పూర్‌ అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిని భల్లాల్‌పూర్‌/బల్హర్షా మహరాష్ట్రకు మార్చాడు. తర్వాత ఇతను చంద్రపూర్‌ కోటను నిర్మించి రాజధానిని చంద్రపూర్‌కు మార్చాడు

గోండు రాజు భల్లాల్‌ షా నిర్మించిన చంద్రపూర్‌ కోట

  • నీలకంఠషాను గోండుల చివరి రాజుగా పేర్కొంటారు. ఇతను క్రీ.శ.1750లో మరణించాడు
  • గోండు రాజ్యం చీలికకు గురైంది. కొంత ప్రాంతాన్ని మరాఠాలు ఆక్రమించుకొనగా మరికొంత ప్రాంతాన్ని అసఫ్‌జాహీలు ఆక్రమించుకున్నారు,
  • 1818లోబ్రిటీష్‌వారు మరాఠా రాజ్యాన్ని ఆక్రమించారు. దీంతో గోండు ప్రాంతం బ్రిటీష్‌వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆదిలాబాద్‌ గోండు ప్రాంతం అసఫ్‌జాహీల ఆధీనంలో ఉండిపోయింది.
  • గత గోండు పాలకుల వారసులు తర్వాత కాలంలో భూస్వాములుగా కొనసాగారు. కొంతవరకు తమ ఆధీనంలో ఉన్న గ్రామాల్లో వారు స్వతంత్ర అధికారాన్ని చెలాయించే వారు.
  • ఆ విధంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు, చెన్నూరు, ఆసిఫాబాద్‌ ప్రాంతాల్లో స్వతంత్ర అధికారాలు చెలాయిస్తున్న గోండు నాయకుడే రాంజీగోండ్‌
  • రాంజీగోండ్‌
  • రాంజీగోండ్‌ పూర్తి పేరు మార్సికొల్లా రాంజీ (1836-60)
  • రాంజీగోండ్‌ నిర్మల్‌ను తన ఆధీనంలోకి తీసుకొని నిర్మల్‌ను తన రాజధానిగా ప్రకటించుకున్నాడు.
  • బ్రిటీష్‌వారు గోండువారిచే వెట్టిచాకిరీ చేయించేవారు. గోండులను అనేక విధాలుగా హింసించేవారు. దీన్ని రాంజీగోండ్‌ తీవ్రంగా ఖండించాడు.
  • రాంజీ గోండ్‌ నాయకత్వంలో సాగుతున్న తిరుగుబాటు ప్రధానంగా ఆనిఫాబాద్‌ తాలుకా నిర్మల్‌ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజన ప్రాంతం.
  • రాంజీ గోండ్‌ నాయకత్వంలో తిరుగుబాటు తీవ్రతరం అవుతున్న తరుణంలో బ్రిటీష్‌ ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచి వేయడానికి మరియు రాంజీను అంత మొందించేందుకు ప్రత్యేక అధికారి కల్నల్‌ రాబర్ట్‌ను నియమించింది.
  • ఈ తిరుగుబాటు తుది కీలక ఘటం 1860 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చోటుచేసుకుంది.
  • 1860 ఏప్రిల్‌ 9న రాంజీ గోండ్‌ నిర్మల్‌లో ఉన్న అటవీ ప్రాంతాలలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న కల్నల్‌ రాబర్ట్‌ పెద్ద ఎత్తున బ్రిటీష్‌ సైన్యాన్ని మొహరించి దాడులు జరిపాడు.
  • బ్రిటీష్‌ వారి ఆధునిక ఆయుధాలు (తుపాకి) ధాటికి అనేక అమాయక గోండు ప్రజలు చంపబడ్డారు.
  • ఈ పోరాటంలో వీరోచితంగా ఎదిరించి పోరాడుతూ రాంజీ తీవ్రంగా గాయ పడ్డాడు. రాంజీ గోండ్‌తో సహా మరో వెయ్యి మంది గిరిజనులను బ్రిటీష్‌ వారు బంధించారు.
  • 1860 ఏప్రిల్‌ 9న నిర్మల్‌ ఖజానా చెరువు దగ్గర ఉన్న మర్రి చెట్టుకు రాంజీ గోండ్‌ను ఉరితీశారు. అతనితో పాటు మరో 1000 మంది గోండు వీరులను నిర్ధాక్షిణ్యంగా అదే మర్రి చెట్టుకు ఉరితీశారు.
  • అప్పటినుండే ఆ మర్రి చెట్టుకు వెయ్యి ఉరుల మర్రి చెట్టు అని పేరొచ్చింది.
  • తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచినా ఆ మర్రి చెట్టును తర్వాత కాలంలో 1995లో  నరికి వేశారు 
  • రాంజీ గోండ్‌ నాయకత్వంలో సాగిన ఇంతటి వీరోచిత పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారు
  • జలియన్ వాలాబాగ్ దురాగతానికి కారణమైన డయ్యర్‌ గురించి ప్రపంచానికి తెలుసు కానీ సుమారు 1000 మంది అమాయక గిరిజన సమూహాన్ని నిర్దాక్షిణ్యంగా ఉరివేసి చంపిన కర్కశుడైన కల్నల్‌ రాబర్ట్‌ గురించి చాలామందికి తెలియదు.


Post a Comment

0Comments

Post a Comment (0)