1971-1990 Telangana State Formation Model Paper-2

TSStudies
0
Telangana State Formation 1971-1990 Model Paper

Telangana State Formation 1971-1990 Practice Questions with Answers

26. ప్రధాని పంచసూత్ర పథకం తెలంగాణ రక్షణలకు గొడ్డలిపెట్టు అని ఎవరు వ్యాఖ్యానించారు?

1)  చెన్నారెడ్డి

2) శ్రీధర్‌రెడ్డి

3) సదాలక్ష్మి

4) మల్లిఖార్జున్‌


27. 1950-55లో విశాలాంధ్రకు, 1969లో సమైక్య వాదాన్ని వినిపించిన పాగా పుల్లారెడ్డి తెలంగాణలోని

ఏ ప్రాంతానికి శాసనసభ్యుడు?

1) వనపర్తి 

2) అచ్చంపేట

3) గద్వాల్‌

4) ఆలంపూర్‌


28. తెలంగాణ లిబరేషన్‌ న్పూడెంట్‌ ఆర్గనైజేషన్‌ను కె.మనోహర్‌రెడ్డి అనే విద్యార్థి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు?

1) 1990 

2) 1991

3) 1992 

4) 1993


29. రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను ఎప్పుడు జారీచేశారు?

1) 1975 అక్టోబర్‌ 18 

2) 1975 అక్టోబర్‌ 20

3) 1975 అక్టోబర్‌ 24 

4) 1975 అక్టోబర్‌ 28


30. ఆరుసూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘన పై అధ్యయనానికి ఏర్పాటుచేసిన కమిటీ?

1) జయ భారత్‌రెడ్డి కమిటీ 

2) సుందరేశన్‌ కమిటీ

3) గిర్‌గ్లానీ కమిటీ 

4) సురేష్‌ చంద్ర కమిటీ


31. ఈ క్రిందివానిలో అష్టసూత్రాల పథకంలోని సరికానిది ఏది?

1) తెలంగాణ ప్రాంతీయ సంఘానికి తక్కువ అధికారులు ఇచ్చుట

2) తెలంగాణ కోసం ఒక ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు

3) తెలంగాణ మిగులు నిధుల కోసం ఒక ఉన్నతాధికార సంఘం ఏర్పాటు

4) తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూడించేందుకు కావలసిన నిధులు సమకూర్చుట


32. 1972 డిసెంబర్‌ 27న ఆంధ్రుల హక్కుల రక్షణ సంఘం ఊరేగింపు సందర్భంగా కాల్పులు జరగగా ఎంతమంది ఆందోళనాకారులు మరణించారు?

1) 10 మంది

2) 12 మంది

3) 14 మంది

4) 8 మంది


33. ఏ సంవత్సరంలో రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈచే హత్యకు గురయ్యాడు?

1) 1991

2) 1992

3) 1993

4) 1994


34. జీవో 36ను ప్రభుత్వం ఏ రోజున విడుదల చేసింది?

1) 1969 ఫిబ్రవరి 28 

2) 1969 జనవరి 21

3) 1969 జనవరి 19 

4) 1969 మార్చి 28


35. తెలంగాణ ఫోరమ్‌ను జానారెడ్డి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు?

1) 1990

2) 1991

3) 1992

4) 1993


36. ప్రధాని చేసిన పంచసూత్ర పథకాన్ని శాసనసభ కాంగ్రెస్‌ పార్టీ ఏరోజున ఆమోదం తెలిపారు?

1) 1972 అక్టోబర్‌ 1

2) 1972 నవంబర్‌ 1

3) 1972 జనవరి 2

4) 1972 డిసెంబర్‌ 1


37. ఈ క్రిందివానిలో సరి అయిన వాక్యం ఏది?

1) 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంగా జనసంఘం పార్టీ సమైక్యవాదం వినిపించింది

2) 1972-73లో జనసంఘం పార్టీ అధ్యక్షుడు అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆంధ్ర-తెలంగాణ నినాదం చేశారు

1) 1 మాత్రమే సరైనది

2) రెండు మాత్రమే సరైనది

3) రెండూ సరైనవే

4) రెండూ సరికావు


38. ఈ క్రిందివానిలో సరైన వాక్యమేది?

1) జయభారత్‌ రెడ్డి కమిటీ ప్రకారం నాన్‌ ముల్కీలు  58, 967మంది

2) టిఎన్‌జీవో నివేదిక ప్రకారం నాన్‌ ముల్కీ 89వేల మంది

1) 1 మాత్రమే సరైనది

2) రెండు మాత్రమే సరైనది

3) రెండూ సరైనవే

4) రెండూ సరికావు


39. ఈ క్రిందివానిని జతపరచండి

1) రాష్ట్ర విభజన కోరుతూ మొదటగా ఆంధ్ర, తెలంగాణ బంద్‌

2) రాష్ట్ర విభజన కోరుతూ సినీ నటులు నిర్మల, కృష్ణల నిరాహారదీక్ష

3) జై ఆంధ్రా ఫ్రంట్‌ ఏర్పాటు

4) ఆంధ్ర రాష్ట్ర సమ్మె విరమణ

ఎ) 1973 ఫిబ్రవరి 19

బి) 1973 ఫిబ్రవరి 18

సి) 1973 ఏప్రిల్‌ 7

డి) 1973 ఏప్రిల్‌ 9

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి

3) 1-డి 2-సి, ౩-బి, 4-ఎ

4) 1-డి 2-సి, 3-ఎ, ఉ-బి


40. సింగరేణి కాలరీస్‌ కంపెనీ ఏ సంవత్సరంలో పబ్లిక్‌ రంగ సంస్థగా మారింది?

1) 1945

2) 1946

3) 1947

4) 1948


41. హైదరాబాద్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ యొక్క నియమాలు నిజాం ఫర్మాన్‌ ప్రకారం రూపొందించబడ్డాయి. నిజాం ఫర్మాన్‌ను ఏ సంవత్సరంలో ఇచ్చారు?

1) 1917

2) 1918

3) 1919

4) 1920


42. ఈ క్రిందివానిలో సరైన అంశం ఏది?

1) స్థానిక అర్హత 15 సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు తగ్గింపు

2) రాష్ట్రపతి మద్దతు ప్రకారం జిల్లా జోన్‌ పోస్టుల రిజర్వు శాతం వరుసగా 80%, 70%

1) 1 మాత్రమే సరైంది

2) రెండవది మాత్రమే సరైంది

3) రెండూ సరైనవే

4) రెండూ సరికావు


43. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటుచేసిన కమిటీ ఏది?

1) వాంఛూ కమిటీ 

2) భార్గవ కమిటీ

3) జయభారత్‌రెడ్డి కమిటీ 

4) సుందరేశన్‌ కమిటీ


44. ఈ క్రిందివానిలో సరైనది ఏది?

1) గతంలో ముల్కీ నిబంధనలు కేవలం తహశీల్దారు వరకే అమలు చేశారు.

2) పంచసూత్ర పథకంలో భాగంగా ముల్కీ నిబంధనలు అసిస్టెంట్‌ సర్జన్‌, జూనియర్‌ ఇంజినీర్లకు వర్తిస్తాయి

1) 1 మాత్రమే సరైంది

2) 2 మాత్రమే సరైంది

3) పై రెండూ సరైనవే

4) ఏవీ సరైనవి కావు


45. ముల్కీ నిబంధనలను సివిల్‌ సర్వీసెస్‌ రెగ్యులేషన్‌ ద్వారా పటిష్టపరచిన నిజాం ఎవరు?

1) మీర్‌ మహ్మద్‌ ఆలీఖాన్‌

2) మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌

3) నాసిరుద్దాలా

4) అఫ్జలుద్దాలా


46. వెట్టిచాకిరి నుండి రైతుల విముక్తి కోసం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 1978 సెప్టెంబర్‌ 9న

నిర్వహించిన యాత్ర ఏది?

1) సిరిసిల్ల జైత్రయాత్ర 

2) జగిత్యాల జైత్రయాత్ర

3) పెద్దపల్లి జైత్రయాత్ర 

4) పాలమూరు జైత్రయాత్ర


47. 1969 ఏప్రిల్‌ 22న సిపిఐ(ఎంఎల్)ను స్థాపించిన వారు?

1) చారు మజుందార్‌

2) కాను సన్యాల్‌

3) దేవులపల్లి వెంకటేశ్వరరావు

4) 1 మరియు 2


48. ఆంధ్రప్రదేశ్‌ యొక్క సిపిఐ(ఎంఎల్‌) రాష్ట్ర కమిటీ ఏ సమావేశంలో ఏర్పాటైంది?

1) బొడ్డుపాడు సమావేశం

2) గుత్తికొండబిలం సమావేశం

3) కలకత్తా సమావేశం

4) 1 మరియు 2


49. దేవానంద స్వామి మరియు అతని స్నేహితులు కలసి తెలంగాణ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు?

1) 1981

2) 1982

3) 1983

4) 1984


50. గోండులపై మరియు చెంచులపై ఈ క్రిందివారిలో ఎవరు పరిశోధన చేశారు?

1) హైమన్‌డార్ఫ్ 

2) ఎడ్వర్డ్‌ జోసెఫ్‌

3) 1 మరియు 2

4) ఎవరూ కాదు


Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions


సమాధానాలు:

26) 1    27) 3    28) 3    29) 1    30) 1

31) 1    32) 3    33) 1    34) 2    35) 1

36) 2    37) 3    38) 3    39) 1    40) 1

41) 3    42) 2    43) 1    44) 3    45) 2

46) 2    47) 4    48) 2    49) 4    50) 1

Post a Comment

0Comments

Post a Comment (0)