కాకతీయుల పాలన ఏ సంవత్సరంలో ముగిసింది

TSStudies
0

Kakatiya Dynasty Practice Bits in Telugu

1. మొదటి తెలుగు పద్య కావ్యం?

1) శ్రీమదాంధ్ర మహాభారతం

2) శ్రీమహా భాగవతం

3) మత్స్య పురాణం 

4) రామాయణం

2. కింది వారిలో శ్రీమదాంధ్ర మహాభారత రచనలో పాల్గొనని కవి?

1) నన్నయ 

2) సోమన

3) తిక్కన 

4) ఎఱ్ఱప్రగడ

3. కింది వాటిలో కాకతీయుల చరిత్రకు సంబంధం లేని శాసనం?

1) వేయిస్తంభాలగుడి 

2) బయ్యారం

3) కొండపర్తి 

4) నగునూరు

4. కాకతీయుల చరిత్రకు సంబంధించిన సాహిత్య గ్రంథాలు, వాటి రచయితలను జతపర్చండి.

ఎ. ప్రతాపరుద్ర యశోభూషణం     1. కాసె సర్వప్ప

బి. క్రీడాభిరామం                             2. వినుకొండ వల్లభరాయుడు

సి. ప్రతాపరుద్ర చరిత్ర                   3. విద్యానాథుడు

డి. సిద్ధేశ్వర చరిత్ర                         4. ఏకామ్రనాథుడు

                                                          5. శివదేవయ్య

1) ఎ-3, బి-2, సి-4, డి-1

2) ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-1, బి-1, సి-2, డి-3

4) ఎ-3, బి-2, సి-1, డి-5

5. కాకతీయ రాజులలో ముఖ్యమైన వారి వంశానుక్రమణికను పేర్కొనండి.

ఎ. రుద్రమదేవి 

బి. గణపతి దేవుడు

సి. రుద్రదేవుడు

డి. ప్రోలరాజు 

ఇ. ప్రతాపరుద్రుడు

6. కాకతీయులు ఎవరి సామంతులుగా స్వతంత్ర్య రాజ్యస్థాపన చేశారు?

1) పశ్చిమ చాళుక్యులు

2) తూర్పు చాళుక్యులు

3) రాష్ట్రకూటులు

4) ముదిగొండ చాళుక్యులు

7. కాకతీయుల రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు?

1) గణపతి దేవుడు 

2) ప్రతాపరుద్రుడు

3) రుద్రదేవుడు 

4) రుద్రమదేవి

8. అనుమకొండలోని వేయిస్తంభాల గుడి నిర్మాత ఎవరు?

1) రుద్రమదేవి 

2) గణపతిదేవుడు

3) ప్రోలరాజు 

4) రుద్రదేవుడు

9. రుద్రమదేవి పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్‌ యాత్రికుడు ఎవరు?

1) మార్కోపోలో 

2) ఇబన్‌బటూట

3) నికోటిన్‌ 

4) నికోలో కాంటి

10. రుద్రమదేవి కాయస్థ అంబదేవుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన యుద్ధం ఎక్కడ జరిగింది?

1) మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌పూర్‌

2) కృష్ణా జిల్లా అవనిగడ్డ

3) నల్లగొండ జిల్లా చందుపట్ల

4) నెల్లూరు జిల్లా మైదుకూరు

11. నాయంకర విధానానికి సంబంధించి కింది విషయాలను పరిగణించండి?

ఎ. నాయక బిరుదుతో రాజ భక్తి గల నాయకులను నియమించేవారు

బి. సేవలకు ప్రతిఫలంగా గ్రామాలపై శిస్తు వసూలు హక్కు కల్పించేవారు

సి. శిస్తు వసూలు చేసుకునే హక్కు వంశపారంపర్యంగా శాశ్వతంగా ఉండేది

డి. వసూలైన శిస్తు ఆదాయంలో నిర్దేశిత సైన్యాన్ని రాజు సేవకోసం పోషించేవారు

1) ఎ, బి,డి 

2) బి, సి, డి

3) ఎ, సి 

4) బి, డి

12. గణపతి దేవుడు వేయించిన మోటుపల్లి అభయశాసనం ప్రాధాన్యం?

1) విదేశీ దండయాత్రల నుంచి రక్షణార్ధం

2) విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం, పన్నుల వసూలు

3) నాయంకరులకు ఇచ్చే బహుమానాలు

4) సామంతుల తిరుగుబాట్ల అణచివేత

13. మోటుపల్లి ఓడరేవును సందర్శించిన మార్కోపోలో విదేశీయులు మోజుపడే ఏ వస్తువుల నాణ్యతను ప్రశంసించాడు?

1) బంగారం, దంతపు సామగ్రి

2) సుగంధ ద్రవ్యాలు

3) చందనపు చెక్క బొమ్మలు

4) వజ్రాలు, సన్నని నేత బట్టలు

14. కాకతీయ సామ్రాజ్య పతనానికి కారకుడైన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) ఫిరోజ్‌షా 

2) మహ్మద్‌ ఖిల్జీ

3) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌

4) అహ్మద్‌ షా అబ్బాలి

15. కాకతీయ సామ్రాజ్యపు చివరి పాలకుడు ఎవరు?

1) రుద్రమదేవి 

2) రుద్రదేవుడు

3) మహదేవుడు 

4) ప్రతాపరుద్రుడు

16. దేవాలయాల నిర్మాణానికి కృషి చేసిన కాకతీయ రాణులు?

1) ముష్పమాంబ, మైలమ

2) ముమ్మడమ్మ, రుయ్యమ

3) కామసాని, గణపాంబ

4) అన్నమ, జాయమ

17. కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి తీసుకున్న చర్యల్లో చిరస్మరణీయమైనవి?

1) బావుల నిర్మాణం

2) కాలువల నిర్మాణం

3) గొలుసుకట్టు చెరువుల నిర్మాణం

4) మెట్ల బావుల నిర్మాణం

18. మధ్యయుగపు చరిత్రలో రాణి రుద్రమదేవి కంటే ముందుగా రాజ సింహాసనాన్ని అధిష్టించిన మహిళ?

1) రజియా సుల్తానా

2) జిజియా బాయి

3) రూన్సీ లక్ష్మీబాయి

4) రాణి దుర్గాబాయి

19. కాకతీయులు ఓరుగల్లు కోట నిర్మాణంలో అనుసరించిన విధానం.. బయటి నుంచి లోపలికి?

ఎ. కందకం 

బి. లోపలి ప్రాకారం

సి. బయటి ప్రాకారం

డి. రాతిగోడ (కంచుకోట)

1) డి, సి, బి, ఎ 

2) సి, ఎ, బి, డి

3) ఎ, బి, సి, డి 

4) బి, ఎ, డి, సి

20. స్వయంభూ శివాలయం ఎక్కడ ఉన్నది?

1) హనుమకొండ 

2) ఓరుగల్లు కోట

3) పాలంపేట 

4) కొలనుపాక

21. కాకతీయుల పాలన ఏ సంవత్సరంలో ముగిసింది?

1) 1328 

2) 1321

3) 1326 

4) 1289

22. కాకతీయ రాజుల ఆస్థాన భాష ఏది?

1) తెలుగు 

2) సంస్కృతం

3) కన్నడం 

4) ఒరియా


సమాధానాలు

1-1, 2-2, 3-4, 4-1, 5-2, 6-1, 7-3, 8-4, 9-1, 10-3 11-1, 12-2, 13-4, 14-3, 15-4 16-1, 17-3, 18-1, 19-2, 20-2, 21-1, 22-1

 

Post a Comment

0Comments

Post a Comment (0)