కేంద్ర ప్రభుత్వం - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి

TSStudies
1

కేంద్ర ప్రభుత్వం - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి

Union Government - President, Vice President,  Prime Minister & Council of Ministers

పరిచయం

రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ వ్యవస్థను ఎంపిక చేసుకున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ భారత పరిస్థితులకు అనువైనది. చారిత్రకంగా భారతదేశం బ్రిటీష్‌వారి పరిపాలనలో చాలాకాలం ఉండటం వలన పార్లమెంటరీ వ్యవస్థకు ప్రజలు అలవాటుపడ్డారు. అలాగే పార్లమెంటరీ వ్యవస్థ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది. వివిధ వైవిధ్యాలున్న భారత్‌లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పించదానికి పార్లమెంట్‌ వ్యవస్థ అనువైనదిగా ఉంటుంది.

అద్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకోలేదు?

రాజ్యాంగ కమిటీ నభ్యులైన ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌, అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్‌ పార్లమెంటరీ వ్యవస్థను సమర్ధించగా రాజ్యాంగ పరిషత్‌ చర్చల్లో అధ్యక్ష తరహా పద్ధతిని సమర్ధించినవారిలో ముఖ్యులు ప్రొ. కె.టి.షా మరియు కె.యం.మున్షి. ఆ తర్వాత కాలంలో కె.ఎన్‌ హెగ్దె, మధు లిమయే, వసంత సాథే మొదలగువారు దీనిని సమర్ధించారు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహకవర్గం శాసన సభకు బాధ్యత వహించదు. దేశాధ్యక్షుడ్ని నేరుగా ఎన్నుకోవడానికిప్రజలలో ఆశించినమేరకు రాజకీయ చైతన్యం ఉండాలి. భారత్‌లో ఆనాటికి ఈ పరిస్థితులు లేవు. అందుచేత అధ్యక్ష ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోలేదు.

పార్లమెంటరీ ప్రభుత్వ ముఖ్య లక్షణాలు

ప్రభుత్వ అంగాలైన శాసన శాఖ, కార్యనిర్వాహణ శాఖ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ప్రభుత్వాలను పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా వర్గీకరిస్తారు. శాసన శాఖకు, కార్యనిర్వాహణ శాఖకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. శాసనశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి శాసన శాఖ విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది. అనగా శాసనశాఖ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య అధికార మిళితం (Function of Powers) ఉంటుంది. అలాంటి ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్రభుత్వాలంటారు.

ఉదాహరణ : బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇండియా

  • శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ మధ్య ఎలాంటి సంబంఖం ఉండదు. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖ నుండి ఏర్పడదు. అలాగే శాసనశాఖకు బాధ్యత వహించదు. ఈ రెండు అంగాల మధ్య అధికార ప్పథక్కరణ (Separation of Powers) ఉంటుంది. అలాంటి ప్రభుత్వాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వాలంటారు. 
  • ఉదాహరణ : అమెరికా, ఫ్రాన్స్‌, అర్జంటైనా మొదలగునవి. ల
  • పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాలైన అధిపతులు ఉంటారు. ఒకటి, నామమాత్రపు అధిపతి (Nominal Heal). రెండు, వాస్తవ అధిపతి (Real Head). రాష్ట్రపతి లేదా రాజు నామమాత్రపు అధిపతిగా ఉంటాడు. అన్ని అధికారాలు వీరి పేరుతో చెలాయించబడతాయి. చట్టపరంగా వీరికి అధికారాలుంటాయి కనుగ వీరిని చట్టపర అధిపతి అని కూడా అంటారు. (De Jure)
  • ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలిని వాస్తవ లేదా రాజకీయ అధిపతి అంటారు. వీరే అన్ని అధికారాలను చెలాయిస్తారు. చట్టపరంగా అధికారం లేనప్పటకీ వాస్తవానికి అధికారాలు చెలాయిస్తారు కనుక వీరిని "De Facto" అధిపతి అంటారు.
  • పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలికి సంయుక్త మరియు వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి. వీరు సంయుక్తంగా లోక్‌సభకు, వ్యక్తిగతంగా రాష్ట్రపతి బాధ్యత వహిస్తారు.
  • పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి, క్యాబినెట్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని “క్యాబినెట్‌ లేదా ప్రధానమంత్రి ప్రభుత్వం” అని కూడా అంటారు.

భారత రాజ్యాంగం - రాష్ట్రపతి

  • భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు గల ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను తెలుపుతాయి.
  • కేంద్ర కార్య నిర్వాహకశాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అటార్నీ జనరల్‌ లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.
  • ప్రకరణ 52 ప్రకారం, భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు.
  • ప్రకరణ 53 ప్రకారం, కేంద్ర కార్య నిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ, తన క్రింది అధికారుల సహాయంతోగాని నిర్వర్తిస్తారు. క్రింది అధికారులు అనగా, మంత్రి మండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
  • భారతదేశంలో బ్రిటీష్‌ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినప్పటికీ, వాటిని చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి మాత్రమే.

రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి

ప్రకరణ 54 ప్రకారం, రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది (Electoral College).

ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు మరియు కేంద్రపాలిత ప్రాంతలైన ఢిల్లీ మరియు పాండిచ్చేరి శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు. 

గమనిక : కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు పాండిచ్చేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనే అవకాశమును 1992లో 70వరాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఇది 1995 జూన్‌ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.

ప్రకరణ 54లో రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ప్రక్రియను పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి వైవిధ్యంగా ఉంటుంది. నైప్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఒక ఓటు బదలాయింపు పద్ధతి (Proportional representation by means of single transferable vote) ద్వారా ఎన్నికవుతారు.

ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లయిన ఎం.ఎల్‌.ఏ, ఎం.పి.ల ఓటు విలువలను ఒక ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కిస్తారు.

ఎం.ఎల్‌.ఏ ఓటు విలువ = (రాష్ట్రం మొత్తం జనాభా/ఎన్నికైన విధానసభ సభ్యుల సంఖ్య) x (1/100) 

వివరణ: 1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు. జనాభా నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు విలువలో నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి తెచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 2026 వరకు పొడిగించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఓటు విలువ 148 కి సమానం (2012లో 14వ రాష్ట్రపతి ఎన్నికల ప్రకారం) ఉండేది. ఐతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ విలువ మారింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎమ్‌..ఎ ఓటు విలువ 159 తెలంగాణ ఎమ్‌.ఎల్‌.ఎ ఓటు విలువ 132.

అత్యధికంగా ఓటు విలువ ఉన్న కొన్ని రాష్ట్రాలు 

  • ఉత్తర ప్రదేశ్‌ 208   
  • తమిళనాడు 176 
  • జార్ధండ్‌ 176 
  • మహారాష్ట్ర 175 
  • బీహార్‌ 173

అతి తక్కువ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు

  • సిక్కిం 7
  • మిజోరాం 8
  • అరుణాచల్‌ప్రదేశ్‌ 8
  • నాగాలాండ్‌ 9

ఎం.పి.ల ఓటు విలువను గణించే పద్ధతి

ఎం,పి.ల ఓటు విలువ = (మొత్తం రాష్ట్రాల శాసన సభ్యుల ఓటువిలువ/ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య)

ఎం.పి.ల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది

2017లో 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎం.పి..ఓటు విలువ 708

రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అభ్యర్థికి కోటా ఓట్లు రావాలి. కోటా అనగా మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటె ఎక్కువ. సూత్రపరంగా చెప్పాలంటే

కోటా = (మొత్తం పోలై చెల్లిన ఓట్లు/ఎన్నిక కావలసిన సభ్యులసంఖ్య) + 1

ఉదా:

రాష్ట్రపతి ఎన్నికకు రెండు ప్రధాన సూత్రాలున్నాయి.

1. ఏకరూపతా సూత్రం (Principle of Uniformity) 2. సామ్యతా సూత్రం (Principle of Parity)

మొదటి సూత్రం ప్రకారము రాష్ట్ర విధానసభ్యుని ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఓటు విలువ మారుతుంది.

రెండవ సూత్రము ప్రకారము దేశంలోని ఎం.పి.ల ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల వారిగా తేదాలుండవు.ఉదాహరణకు

  • దేశంలోని మొత్తం ఎం.ఎల్‌.ఏ.ల సంఖ్య 4120
  • దేశంలోని మొత్తం ఎం.ఎల్‌ ఏల ఓటు విలువ 5,49,474 
  • దేశంలోని మొత్తం ఎన్నికైన ఎం.పి.ల సంఖ్య - 776
  • దేశంలోని మొత్తం ఎం.పి.ల ఓటు విలువ - 5,49,408 

అంటే మొత్తం ఎం.ఎల్‌ ఏల ఓటు విలువ, మొత్తం ఎం.పి. ఓటు విలువతో దాదాపు సమానము. దీనినే ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ పారిటీ అంటారు. రాష్ట్రాలకు, కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలో సమాన ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సూత్రాలనుపాటించడానికి గల కారణం అందుకే భారత రాష్ట్రపతి యావత్‌ జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు.

Post a Comment

1Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
Post a Comment