విజయనగర సామ్రాజ్య పతనానికి కారణం

TSStudies
1

విజయనగర రాజులు 

విద్యారణ్యస్వామి ఆశీస్సులతో 1336లో హరిహర రాయలు, బుక్క రాయలు కర్ణాటకలో తుంగభద్రానది ఒడ్డున విజయనగరాన్ని నిర్మించారు.
విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని ఆరాధించేవారు.
విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాకువ, తుళువ, అరవీటి వంశ పాలకులు వరుసగా పాలించారు.
తుంగభద్రా నదికి ఉత్తరంగా గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యం ఆవిర్భవించింది.
1489 నుంచి 1520 మధ్య కాలంలో బహమనీ సామ్రాజ్యం విచ్చిన్నమై బీజాపూర్‌, గోల్కొండ, బీదర్‌, అహ్మద్‌నగర్‌, బీరార్‌ కేంద్రాలుగా ఐదు రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిలో బీజాపూర్‌, గోల్కొండ రాజ్యాలు పెద్దవి.
ఈ రాజ్యాలను ఇరాన్‌, అరేబియా నుంచి వచ్చిన సుల్తాన్‌లు పాలించారు. వీరు నిరంతరం యుద్ధాలు చేస్తూ రాజ్యవిస్తరణకు ప్రయత్నించారు.
విజయనగర రాజుల చరిత్రకు పలు దేశాల యాత్రికుల రచనలు దోహదపడుతున్నాయి. వాటిలో ఇటలీ యాత్రికుడైన నికోలో కాంటి 1420లో, పర్షియా యాత్రికుడైన అబ్దుల్ రజాక్‌ 1443లో, పోర్చుగీస్‌ యాత్రికులైన డొమింగో పేజ్‌ 1520లో, న్యూనిజ్‌ 1537లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి రాసిన రచనలు ముఖ్యమైనవి.

విజయనగరం ఏడు వలయాలతో ఏర్పడి, కోటగోడలు నిర్మించి ఉన్నట్లు అబ్దుల్ రజాక్‌ తెలిపాడు.
పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం నగరం నాలుగు భాగాలుగా, మొదటి భాగం గుట్టలపైన ఆలయాలు, రెండో భాగంలో పంట భూములు, కాల్వలు, మూడో భాగంలో అంతఃపుర భవనాలు, రాజభవనాలు,
ముఖ్యుల నివాసాలు, నాలుగో భాగంలో సామన్య ప్రజలు నివసించేవారని తెలిపారు.

అరేబియా, ఇరాన్‌ల నుంచి మేలిరకం గుర్రాలను దిగుమతి చేసుకునేవారు.
రెండో దేవరాయలు ముస్లింలకు యుద్ధతంత్రాలు నేర్పించి, శిబిరంలో మసీదు నిర్మించి, తుపాకులు, ఫిరంగులు, ఆధునిక అశ్వదళం, శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరిచాడు.
డొమింగో పేజ్‌ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరం సందర్శించాడు.
సైనిక దళాధిపతులను అమర నాయకులుగా నియమించి అమరంపై వచ్చే రెవెన్యూ శిస్తు (గ్రామం, పట్టణం) వసూలు చేసుకుని, సైనిక దళాలను పోషించి, యుద్ధ సమయాల్లో సిద్ధ సైన్యంతోపాటు అమర నాయకుల అధీనంలోని సైన్యం, అమర నాయకులు పాల్గొనేవారు. వీరి అధీన ప్రాంతాల్లో పరిపాలన, న్యాయపాలన అధికారాలు ఉండేవి.

చాలామంది అమర నాయకులు తెలుగు వీరులే. వీరు సైనికులను నియమించుకుని శిక్షణ ఇచ్చేవారు. సాళువ నర్సింహా లేదా నారస నాయకుడు విశాల భూభాగంపై అధికారాన్ని పొంది, విజయనగర రాజులకు సవాలుగా నిలిచాడు. రాజు చనిపోయిన సందర్భంలో శక్తిమంతమైన అమర నాయకులు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని తమను తాము రాజుగా ప్రకటించుకునేవారు.

శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పాలించాడు. బహమనీ సుల్తాన్‌లు, గజపతులపై విజయవంతంగా సైన్యాన్నినడిపొడు. గోవా ఓడరేవుపై, పోర్చుగీసు వారిపై అధిపత్యం సాధించి సైన్యంలో పోర్చుగీసు దళాలను చేర్చుకున్నాడు. 

శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి, శ్రీశైలం, అహోబిలం సందర్శించి విరాళాలు సమర్చించేవారు. దేవాలయాల్లో ఈయన గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తయిన అలయ ముఖద్వారాలను నిర్మించారు.
శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు సాహిత్యంలో కవి అండాళ్‌ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం అధారంగా ఆముక్తమాల్యద గ్రంథం రాశాడు.

రాయల కొలువులో అష్టదిగ్గజాలుగా కీర్తి పొందిన అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, మాదయ గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు వంటివారు సాహిత్య సేవలో తరించారు. 

అచ్యుత దేవరాయ, అళియ రామరాయల పాలనాకాలంలో బహమనీ సుల్తాన్‌ల రాజ్య వ్యవహారంలో నిరంతరం జోక్యం వల్ల, ఐదుగురు సుల్తాన్‌లు ఏకమై క్రీశ.1565లో రాక్షస తంగడి లేదా తళ్లికోట యుద్ధంలో రామరాయలను ఓడించి, విజయనగర పట్టణాన్ని దోచుకున్నారు. చివరి పాలకులు తిరుపతి సమీపంలోని చంద్రగిరి రాజధానిగా కొద్దికాలం పాలించారు.

Post a Comment

1Comments

Post a Comment