సుప్రీం కోర్టు తీర్పులు
2006లో ఈడ్పు శ్రీధర్ Vs గౌరు వెంకట్ రెడ్డి కేసులో సుప్రీం కోర్టు ఈ క్రింది విధంగా తీర్పు చెప్పింది.
- రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం పాక్షికంగా న్యాయ సమీక్షకు గురి అవుతుందని చెప్పింది. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో, కుల, మత ప్రయోజనాల కోసం ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, వాటిని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.
సలహా అధికారం (ప్రకరణ 143)
- రాజ్యాంగపరమైన చట్టపరమైన, ప్రజాసంబింధ్రమైన వ్యవహారాల్లో సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి తీసుకోవచ్చు (148వ ప్రకరణ). అయితే దీనిని సలహాగా మాత్రమే పరిగణీంచవచ్చు. రాష్ట్రపతి దీనికి బద్దుడు కావలసిన అవసరం లేదు.
సైనిక అధికారాలు (Military powers)' . .
- 53(2) ప్రకరణ ప్రకారం, రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి. అతడు త్రివిధ దళాలకు అధిపతి.
- యుద్ధం ప్రకటించడానికి, సంధి షరతులు చేసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. -
- రక్షణ శాఖను నిర్వహించే రక్షణ. మంత్రిని, రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రించడం మొదలగునవి.
దౌత్యాధికార విధులు (Diplomatic Powers)
- అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రతినిధిగా వ్యవహరించుట
- మిత్ర దేశాలకు రాయబారులను నియమించటం
- భారత దేశానికి, ఇతర దేశాలకు మధ్య సంబంధాలను ఏర్పాటు చేయడానికి కృషి చేయడం
- ఐక్య రాజ్య సమితికి భారత దేశ ప్రతినిధులను నియమించడం
- సూచన: రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ప్రత్యేకంగా మరొక అధ్యాయంలో వివరించడం. జరిగింది
రాష్ట్రపతి ఇతర అధికారాలు - మినహాయింపులు
- రాష్ట్రపతి జాతీయ మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్, సభ్యులు, సెంట్రల్ విజిలెన్స్ కమీషన్స్, సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమీషన్ సభ్యులను, పరిపాలన ట్రిబ్యునల్ ఛైర్మన్ మరియు ఇతర సభ్యులను, ప్రసార భారతి ఛైర్మన్, ప్రెస్ ట్రస్ట్ ఛైర్మన్‌ను, మొదలగువారిని నియమిస్తారు.
- రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులను తొలగిస్తారు.
- ప్రకరణ 361 ప్రకారం, రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు కల్పించారు. అతడు పదవిలో ఉండగా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు. అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఐతే రెండు నెలల ముందస్తు నోటీస్‌తో సివిల్ కేసులు నమోదు చేయవచ్చు.
- రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలకు ఏ న్యాయస్థానానికి బాధ్యత వహించడు.
రాష్ట్రపతి స్థానం - విమర్శనాత్మక పరిశీలన
- రాజ్యాంగపరంగా సర్వాధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినప్పటికీ వాస్తవానికి ఆ అధికారాలను చెలాయించేది ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి. భారతదేశంలో బ్రిటీష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ కొనసాగించడం వల్ల, రాష్ట్రపతి బ్రిటీషు వ్యవస్థలో గల రాజు లేదా రాణి స్థానాన్ని పొందారు. ఆయన జాతికి ప్రాతినిధ్యం వహిస్తాడు. జాతిని పరిపాలించడు. ఆయన జాతికి ప్రతీక. పరిపాలనలో ఆయన స్థానం ఉత్సవ విగ్రహం వంటిది. జాతి నిర్ణయాలను తెలియచేసే ఒక రబ్బరు ముద్ర వంటిదని డా.బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు చర్చల్లో పేర్కొన్నారు.
- రాజ్యాంగ పరిషత్తులో యూనియన్ అధికారాల ముసాయిదా కమిటీ చైర్మన్ మరియు తొలి ప్రధాని ఆయిన నెహ్రూ ప్రకారం “మంత్రి వర్షానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. రాష్ట్రపతికి కాదు. నిజానికి అధికారం మంత్రివర్గంలోను, శాసన నిర్మాణ శాఖలోను లోను ఉంటుంది. రాష్ట్రపతి వద్ద కాదు. ఆయనకు నిజమైన అధికారాలు ఇవ్వలేదు. కాని, ఆయన స్థానాన్ని మాత్రం గొప్ప అధికారం, గౌరవం ఉన్న స్థానంగా చేస్తాం” అని పేర్కొన్నారు.
- సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పదవీ విరమణ రోజున మాట్లాడుతూ “రాష్ట్రపతి జాతి ప్రయోజనానికి, జాతి సమైక్యతకు ప్రతీక ఆయన దేశ ప్రగతిపై, స్థిరత్వంపై చాలా ప్రభావం చూపగలడు” అని అన్నారు. పైన తెలిపిన అభిప్రాయాలు రాష్ట్రపతి స్థానం, అధికారాల ప్రాముఖ్యతను వెల్లడిస్తున్నాయి.
- 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి అధికారాలు మరింత నామమాత్రంగా మారాయి. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తనకు ఇచ్చిన సలహాను పున;పరిశీలించమని మంత్రిమండలిని రాష్ట్రపతి కోరినచో, రెండవ సారి మంత్రి మండలి సలహాకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ పదవీ కాలంలో హిందూ కోడ్ బిల్లు వివాదంలో, మంత్రి మండలి సలహాకి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలనే నియమం రాజ్యాంగంలో లేదని వివాదాన్ని లేవదీశారు.
- లోక్ సభలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు లేదా కొన్ని పార్టీలు సంకీర్ణ మంత్రి మండలిని ఏర్పాటు చేయడం సాధ్యం కానప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తాడు.
- లోక్‌సభను రద్దు చేయాలనే ప్రధానమంత్రి సలహాను పాటించేందుకు లేదా తిరస్కరించేందుకు రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని న్యాయ శాఖతో సహా ఎవరూ ప్రశ్నించేందుకు వీలులేదు. రాష్ట్రపతి వెంక్రటామన్‌కు కూడా 1989, 1990, 1991 సం.రాలలో ప్రధానమంత్రి నియామకంలో సమస్యలెదురైనాయి.
- మంత్రి మండలి సమర్ధవంతంగా పనిచేయలేనప్పుడు, రాజ్యాంగపరమైన యంత్రాంగం అదుపులో లేనప్పుడు, రాష్ట్రపతి ఎంతో శక్తిమంతమైన వ్యక్తిగా రూపొందుతారు.
- ఉదాహరణకు, 1997లో ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించాలని, ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని, యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సూచనను, అలాగే బీహార్‌లో ఆర్.జె.డి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన సూచనను కూడా రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ తిరస్కరించారు.
- సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం, కార్గిల్ యుద్ధంపై రాజ్యసభలో చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికారపక్షం విస్మరించడం.
- 1998లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర క్యాబినెట్ ప్రసంగం బదులుగా ఒక పాత్రికేయునితో సంభాషణ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడటం
- 1999లో ఆగస్టు-అక్టోబర్‌ల మధ్య వాజ్‌పేయి ఆపద్ధర్మ ప్రభుత్వ నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను లాభాల బాటలో నడిపించేందుకు 125 కోట్ల ప్యాకేజీ మొదలైన అంశాలపై రాష్ట్రపతి అభ్యంతరాలు తెలిపారు.
- అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా లాభదాయక పదవుల విషయంలో 2006లో కొన్ని వివాదాలు తలెత్తాయి. లాభదాయక పదవులకు సంబంధించి పార్లమెంటు కొన్ని మినహాయింపులు చేస్తూ సవరణలు చేసింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వచ్చినప్పుడు అబ్దుల్ కలాం మంత్రి మండలి పునఃపరిశీలనకు మరియు సుప్రీంకోర్టు సలహా కొరకు నివేదించారు.
- భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని అత్యవసర దీపంగా రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ తన “మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్” అనే గ్రంథంలో వివరించారు. రాష్ట్రపతి తన పదవీ విరమణ సందర్భంలో ప్రసంగిస్తూ, రాష్ట్రపతి నిష్పాక్షికత, రాజ్యాంగఔచిత్యం, పారదర్శకత అనే మూడు సూత్రాలను అనుసరించాల్సి ఉంటుందని ఉద్ఘాటించారు. విభిన్న సందర్భాలలో నిష్పాక్షికంగా వ్యవహరించేందుకు రాజ్యాంగాన్ని అనుసరించే లక్షణం రాష్ట్రపతికి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రపతి పదవి - ప్రముఖుల అభిప్రాయాలు
- మంత్రిమండలి సలహా లేకుండా లేదా సలహాకు విరుద్ధంగా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. (He can not do anything without the advice of council of ministers and contrary to it) రాష్ట్రపతి పదవి బ్రిటీష్ రాజమకుటంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకులు కాలేరు. రాష్ట్రపతి మంత్రి మండలికి మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికునిగా వ్యవహరిస్తారు - డా॥ బి.ఆర్. అంబేద్కర్.
- భారత్‌లో పార్లమెంటరీ విధానం ఉన్నందువల్ల ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి - డా॥ ఆర్. రాజేంద్రప్రసాద్
- రాష్ట్రపతి పదవి దేశ సమైక్యతకు ప్రతీక - సర్వేపల్లి రాధాకృష్ణన్
- భారత రాజ్యాంగం కేంద్ర మంత్రి మండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ, రాష్ట్రపతి పదవికి ప్రత్యేకగౌరవం, ప్రాముఖ్యతను కూడా ఇచ్చింది - జవహర్‌లాల్ నెహ్రూ