రాష్ట్రపతి - ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారము

TSStudies
0
What is an ordinance when can ordinances be issued by the President

రాష్ట్రపతి - ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారము (Ordinance making power)

  • రాష్ట్రపతికి గల ఆర్డినెన్స్‌ జారీచేసే అధికారము శాసన అధికారాలలో అంతర్భాగం. ప్రపంచంలో ఏ అధ్యక్షునికి ఈ అధికారం ఉండదు. ప్రకరణ 123 ప్రకారం, పార్లమెంటు ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, రాష్ట్రపతి ఆర్డినెన్సు రూపంలో చట్టాలు చేస్తారు. ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహామేరకే ఆర్టినెన్సును జారీచేస్తారు. ఆ విధంగా జారీచేసిన ఆర్దినెన్సును పార్లమెంటు తిరిగి సమావేశమయిన తరువాత ఆరు వారాల లోపల ఆమోదించాలి. పార్లమెంటు ఆమోదించిన తరువాత ఆర్షినెన్సు సాధారణ చట్టం అవుతుంది లేదంటే రద్దవుతుంది. రాష్ట్రపతి మరొక ఆదేశం ద్వారా ఆర్టినెన్సును ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
  • రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సు జారీచేసే అధికారము పార్లమెంటు శాసనాధికారంతో సమానంగా ఉంటుంది. అనగా పార్లమెంటు ఏ జాబితాలో చట్టాలు చేస్తుందో ఆ అన్ని జాబితాలలోను రాష్ట్రపతి ఆర్డినెన్సు జారీచేయవచ్చు. అయితే అది పార్లమెంటు శాసనాధికారమునకు ప్రత్యామ్నాయం మరియు సమాంతరము కాదు సహసంబంధ అధికారమే (Coextensive legislative power)

సుప్రీం కోర్టు తీర్పులు

  • 1987లో కూపర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీచేసే అధికారం గురించి సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, దురుద్దేశ కారణాలతో చేసిన ఆర్దినెన్సును న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చునని పేర్కొంది. అనగా ఆర్డినెన్సు న్యాయ సమీక్షకు గురి అవుతుంది. అలాగే డి.సి. వాద్వా Vs బీహార్‌ (1987) కేసులో ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారంపై సమగ్రమైన, విస్తృతమైన తీర్పును వెలువరించింది. ఒక ఆర్టినెన్సును జారీ చేసిన తరువాత అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యధాతథంగా దానిని కొనసాగిస్తూ మరొక ఆర్డినెన్స్‌ను జారీచేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని, అది రాజ్యాంగంపై దాడిగా పేర్కొంది.

ప్రత్యేక వివరణ - విశ్లేషణ

  • ఒక అర్టినెన్సు పార్లమెంటుచేత ఆమోదించబడకుండా గరిష్టంగా ఏడు నెలలు, పదిహేను రోజులు అమలులో ఉంటుంది. పార్లమెంటు ఒక సమావేశానికి, మరొక సమావేశానికి మధ్య కాలము ఆరు నెలలు, అలాగే పార్లమెంటు తిరిగి సమావేశమైన తరువాత ఆరువారాలలోపు ఆమోదించవచ్చు అనే నియమం వల్ల, ఒకవేళ పార్లమెంటు సమావేశం ముగిసిన తరువాత ఆర్టినెన్సు జారీ చేయబడి, తిరిగి సమావేశమైన తరువాత ఆరోవారం చివరి రోజున ఆమోదించినట్లయితే 6 నెలలు + 6 వారాలు, అనగా గరిష్టంగా 7 1/2 నెలలు అవుతుంది. అయితే ఆర్డినెన్స్‌కు కనిష్ట కాలపరిమితి లేదు. దీనిని రాష్ట్రపతి ఎప్పుడయినా రద్దు చేయవచ్చు.

రాష్ట్రపతి వీటో అధికారము (Veto Power)

వీటో అనే పదము లాటిన్‌ భాష నుండి గ్రహించబడింది. ఆంగ్లంలో దానిని ఫర్చిడ్‌ (Forbid) అంటారు. వీటో అనగా తిరస్కరించే అధికారం. ఏదైనా బిల్లు కాని, ప్రతిపాదన కాని, పార్లమెంటు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, ప్రకరణ 111 ప్రకారం రాష్ట్రపతి ఈ క్రింది ప్రత్యామ్నాయాలను కలిగి ఉంటారు.

  • ఎ) బిల్లును ఆమోదించవచ్చు.
  • బి) బిల్లుకు ఆమోదాన్ని నిరాకరించవచ్చు.
  • సి) పునఃపరిశీలనకు పంపవచ్చు (ద్రవ్యబిల్లు తప్ప మిగతా బిల్లులను)
  • డి) బిల్లుపై మౌనం వహించవచ్చు.

ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ క్రింది వీటో అధికారాలు ఉన్నాయి.

  1. అబ్సల్యూట్‌ వీటో 
  2. క్వాలిఫైడ్‌ వీటో 
  3. సస్పెన్సివ్‌ వీటో 
  4. పాకెట్‌ వీటో

అబ్సల్యూట్‌ వీటో (Absolute Veto)

  • ఏదైనా బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే ఎట్టి పరిస్థితులలోను చట్టంగా మారదు. ఆ బిల్లు శాశ్వతంగా రద్దవుతుంది. రాష్ట్రపతి ఈ క్రింది సందర్భాలలో అబ్సల్యూట్‌ వీటోను వినియోగించవచ్చు.
  • ప్రయివేటు మెంబర్స్‌ బిల్లుల విషయంలో (మంత్రులుకాని శాసనసభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులను ప్రైవేటు బిల్లులంటారు)
  • క్యాబినెట్‌ ఆమోదం పొందిన ప్రభుత్వ బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపబడి, రాష్ట్రపతి ఆమోదం తెలపక ముందే మంత్రిమండలి రాజీనామా చేస్తే, కొత్తగా ఏర్పడిన మంత్రిమండలి ఆ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు కొన్ని బిల్లుల విషయంలో భారత రాష్ట్రపతి ఈ అధికారాన్ని వినియోగించవచ్చు.
  • ఉదా. 1954లో రాజేంద్రప్రసాద్‌, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు PEPSU (Patila East Punjab State Union) అనుమతి ఉపక్రమణ బిల్లులో, అలాగే 1991లో ఆర్‌. వెంకట్రామన్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించిన బిల్లులో అబ్సల్యూట్‌ వీటోను వినియోగించారు. (రాష్ట్రపతి పూర్వ అనుమతి లేకుండా ప్రవేశపెట్టారు)
  • రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ప్రకరణ 200 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి నివేదించవచ్చు. ఈ సందర్భంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని నిరాకరిస్తే ఆ బిల్లులు ఎప్పటికీ చట్టంగా మారవు.

క్వాలిఫైడ్‌ వీటో (Qualified Veto)

  • పార్లమెంటు చేత ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదానికి పంపబడిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే, రెండవ పర్యాయం అదే బిల్లును పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించి పంపితే, రాష్ట్రపతి / అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదాన్ని తెలపాలి. ఈ తరహా వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఈ అధికారం అమెరికా అధ్యక్షునికి ఉంది.

సస్పెన్సివ్‌ వీటో (Suspensive Veto)

  • పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినపుడు మొదటి పర్యాయం దానిని తిరస్కరిస్తే, రెండవప పర్యాయం అదే బిల్లును పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించి తిరిగి పంపితే భారత రాష్ట్రపతి ఆ బిల్లులను తప్పనిసరిగా ఆమోదించాలి. ఒక వేళ ఆమోదించకపోయినా, ఆమోదించబడినట్లుగా భావిస్తారు. ఈ అధికారం భారత రాష్ట్రపతికి ఉంది.

పాకెట్‌ వీటో (Pocket Veto)

  • బిల్లులు పార్లమెంటుచేత ఆమోదించబడి, రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపినప్పుడు ఆ బిల్లులను తిరస్కరించకుండా, పునఃపరిశీలనకు పంపకుండా రాష్ట్రపతి నిరవధికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేస్తారు. దీనినే పాకెట్‌ వీటో అంటారు. ఉదాహరణకు 1986 లో రాజీవ్‌గాంధి ప్రధానమంత్రిగా, జైల్‌సింగ్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పోస్టల్‌ బిల్లు విషయంలో ఈ వీటో అధికారాన్ని వినియోగించారు. సుమారు 18 నెలలు బిల్లును అట్టిపెట్టారు.

గమనిక: ఒక బిల్లుగాని, ప్రతిపాదనగాని, రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు నిర్దీత గడువులోగా రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.

ఆర్థిక అధికారాలు - విధులు (Financial Powers)

  • పార్లమెంటులో ప్రవేశపెట్టే ద్రవ్య. బిల్లులకు పూర్వానుమతిని ఇవ్వటం - ప్రకరణ 117(1) 
  • ప్రతి ఐదు సం.రాలకు ఒక ఆర్థిక సంఘాన్ని, ఏర్పాటు చేయడం - ప్రకరణ 280
  • భారత ఆగంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలోనే ఉంటుంది. దానినుంచి పార్లమెంటు ఆమోదం పొందే వరకు వచ్చే అత్యవసర ఖర్చులకు అడ్వాన్స్‌ మంజూరు చేయడం - ప్రకరణ 267
  • ఆర్థిక సంవత్సర ప్రారంభంలో వార్షిక బడ్జెట్‌ను, సప్లిమెంటరీ బడ్జెట్‌ను తన పేరుపై పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వటం - ప్రకరణ 112

న్యాయాధికారాలు - విధులు (ప్రకరణ - 72) (Judicial Powers)

  • రాజ్యాంగాధినేతగా ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను నిలిపివేయవచ్చు లేదా శిక్ష అమలు వాయిదా వేయవచ్చు లేదా ఒక రకమైన శిక్షను మరొక రకంగా మార్చవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం న్యాయస్థానాల పొరపాట్లను సరిదిద్దడం. రాష్ట్రపతి దేశ అధిపతి కనుక, పౌరుల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. ముద్దాయిలు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి.
  • ఈ అధికారాలను రాష్ట్రపతి మంత్రి మండలి సలహామేరకు నిర్వర్తిస్తారు. విచక్షణాధికారాలకు ఆస్కారం లేదు.
  • క్షమాభిక్ష అధికారాలను వీనియోగించే సమయంలో రాష్ట్రపతి ప్రజాభిప్రాయాన్ని, బాధిత కుటుంబాల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
  • క్షమాభిక్ష పెట్టడం (Pardon-Absolving entire punishment): శిక్షను రద్దుచేసి క్షమాభిక్షను ప్రసాదించడం.
  • శిక్షను తగ్గించడం (Remission-reduction of sentence): శిక్ష స్వభావాన్ని మార్చకుండా శిక్ష కాలాన్ని తగ్గించడం.
  • శిక్షలను మార్పు చేయడం (Commutation-Changing nature of sentence): శిక్ష కాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మార్చడం. ఉదాహరణకు రాజీవ్‌గాంధీ హత్య కేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.
  • శిక్ష అమలు కాకుండా వాయిదా వేయడం (Reprieve-Postponement of sentence): శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష పిటిషన్‌ ప్రభుత్వ పరిగణనలో ఉన్నప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
  • శిక్ష నుండి తాత్కాలిక ఉపశమనం (Respite-Providing Relief): ముద్దాయి ప్రత్యేక పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ఈ ఉపశమనాన్ని ఇస్తారు. మానసికస్థితి సరిగా లేనప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, వయోభారం ఉన్నప్పుడు, గర్భిణీ విషయంలో ఈ వెసులుబాటు ఉంటుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)