భారత రాష్ట్రపతులు ప్రత్యేకతలు

TSStudies
0

భారత రాష్ట్రపతులు - ప్రత్యేక అంశాలు

1. డా.బాబు రాజేంద్రప్రసాద్‌ (1884-1963)

సొంత రాష్టం: బిహార్‌

ప్రత్యర్థి: కె.టి.షా 

పదవీకాలం: 

1) 1950 జనవరి 26  నుండి 1957 

2) 1957 మే 13 నుండి 1962 మే 13 రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు.

ప్రత్యేకతలు:

  • మొట్టమొదటి రాష్ట్రపతి.
  • రెండవ పర్యాయాలు  ఎన్నికయ్యారు.
  • అత్యధిక మెజారిటీతో (99.4% ఓట్లతో రెండవ పర్యాయం) ఎన్నికయ్యారు
  • ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్న రాష్ట్రపతి
  • హిందూకోడ్‌ బిల్లు విషయంలో ఆమోదం తెలపకుండా, ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చారు.
  • 1962లో భారతరత్న బిరుదు గ్రహీత.
  • ఎక్కువకాలం పనిచేసిన రాష్ట్రపతి 

3. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (1888 - 1975)

సొంత రాష్ట్రం: తమిళనాడు 

ప్రత్యర్థి: సి.హెచ్.హరిరామ్

పదవీకాలం: 1962 మే 13 - 1967 మే 13

ప్రత్యేకతలు: 

  • మొట్టమొదటి ఉపరాష్ట్రపతి
  • ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి
  • దౌత్యవేత్తగా పనిచేసిన మొదటి రాష్ట్రపతి
  • గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త, దార్శనికుడు
  • చైనా యుద్ధానంతరం రక్షణమంత్రి కృష్ణ మీనన్‌ను పదవినుంచి తొలగించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
  • జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి.
  • 1954లో భారతరత్న గ్రహీత

4. డా. జుకీర్‌ హుస్సేన్‌ (1897-1969) 

సొంత రాష్ట్రం: ఉత్తరప్రదేశ్ 

ప్రత్యర్థి: కె.కె.సుబ్బారావు 

పదవీకాలం: 1967 మే 13 - 1969 మే 3 

ప్రత్యేకతలు:

  • మొదటి ముస్లిం రాష్ట్రపతి.
  • పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
  • అతి తక్కువకాలం పనిచేసిన రాష్ట్రపతి
  • హైద్రాబాద్‌లో జన్మించాడు. 
  • 1963లో భారతరత్న గ్రహీత

5. వి.వి.గిరి (1884-1980)

సొంత రాష్ట్రం: ఒరిస్సా 

ప్రత్యర్థి: తాత్కాలిక

పదవీకాలం:1969 మే 3 - 1969 జూలై 20

ప్రత్యేకతలు:

  • తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు.
  • తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి ఉపరాష్ట్రపతి (జుకీర్‌ హుస్సేన్‌ మరణంతో)
  • 1975లో భారతరత్న గ్రహీత

6. జస్టిస్‌ మహమ్మద్‌ హిదయతుల్లా (1905-1992)

సొంత రాష్ట్రం: మధ్యప్రదేశ్ 

ప్రత్యర్థి: తాత్కాలిక

పదవీకాలం: 1969 జూలై 20 - 1969 ఆగస్టు 24

ప్రత్యేకతలు:

  • తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన, సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి.

7. వి.వి.గిరి (1884-1980)

సొంత రాష్ట్రం: ఒరిస్సా 

ప్రత్యర్థి: నీలం సంజీవరెడ్డి

పదవీకాలం: 1969 ఆగస్టు 24 - 1974 ఆగస్టు 24

ప్రత్యేకతలు:

  • స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి.
  • అతి తక్కువ మెజారిటీతో ఎన్నికైన రాష్ట్రపతి
  • రెండవ ప్రాధాన్య ఓటు ద్వారా ఎన్నికయ్యారు (50.22%). 
  • తన ఎన్నిక గురించి తలెత్తిన వివాదంలో సుప్రీంకోర్టులో స్వయంగా హాజరై తన వాదనను వినిపించిన రాష్ట్రపతి. 
  • జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండవ రాష్ట్రపతి.

8. ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ (1905-1977)

సొంత రాష్ట్రం: అస్సాం 

ప్రత్యర్థి: టి.చతుర్వేది 

పదవీకాలం: 1974 ఆగస్టు 24 -1977 ఫిబ్రవరి 11

ప్రత్యేకతలు:

  • రెండో ముస్లిం రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి. 
  • జాతీయ అత్యవసర పరిస్థితిని అంతరంగిక కారణాల వల్ల ఈయన కాలంలోనే విధించారు. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన మూడో రాష్ట్రపతి.

9. బి.డి.జెట్టి (1913-1992)

సొంత రాష్ట్రం: మహారాష్ట్ర 

ప్రత్యర్థి: (తాత్కాలిక)

పదవీకాలం: 1977 ఫిబ్రవరి 11 - 1977 జులై 25

ప్రత్యేకతలు: 

  • తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన. మూడవ వ్యక్తి

10. నీలం సంజీవరెడ్డి (1913-1996)

సొంత రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్‌ 

ప్రత్యర్థి: ఏకగ్రీవం

పదవీకాలం:1977 జూలై 25 -1982 జులై 25

ప్రత్యేకతలు: 

  • ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి.
  • మొదటి పర్యాయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి.
  • లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఏకైక రాష్ట్రపతి
  • ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి రాష్ట్రపతి

11. జ్ఞానీ జైల్‌సింగ్‌ (1916 - 1994)

సొంత రాష్ట్రం: పంజాబ్‌

ప్రత్యర్థి: హెచ్.ఆర్.ఖన్నా 

పదవీకాలం: 1982 జూలై 25 -1987 జూలై 25 

ప్రత్యేకతలు: 

  • తొలి సిక్కు రాష్ట్రపతి.
  • వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన మొదటి రాష్ట్రపతి.
  • వివాదాస్పద పోస్టల్‌ బిల్లుపై పాకెట్‌ వీటోను వినియోగించారు.
  • స్వర్ణ దేవాలయంలో ఈయన కాలంలో 'ఆహాషన్‌ బ్లూస్టార్‌' జరిగింది.

12. ఆర్‌. వెంకట్రామన్‌ (1910-2009)

సొంత రాష్ట్రం: తమిళనాడు 

ప్రత్యర్థి: జస్టిస్ కృష్ణ అయ్యర్ 

పదవీకాలం: 1987 జూలై 25 - 1992 జూలై 25

ప్రత్యేకతలు: 

  • అత్యధిక ప్రధానమంత్రులచేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించాడు.

13. డా. శంకర్‌దయాళ్‌ శర్మ (1918-1999)

సొంత రాష్ట్రం: మధ్యప్రదేశ్  

ప్రత్యర్థి: జి.యస్.స్వేల్ 

పదవీకాలం: 1992 జులై 25- 1997 జులై 25

ప్రత్యేకతలు: 

  • వివాదాస్పదమైన దళిత క్రిస్టియన్లకు సంబంధించి రిజర్వేషన్‌ బిల్లుపై వీటో చేశాడు.

14. కె.ఆర్‌.నారాయణన్‌(1920-2007)

సొంత రాష్ట్రం: కేరళ

ప్రత్యర్థి: టి.ఎన్‌. శేషన్‌

పదవీకాలం: 1997 జులై 25 - 2002 జులై 25

ప్రత్యేకతలు: 

  • దళిత వర్గానికి చెందిన మొదటి రాష్ట్రపతి
  • రాయబారిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన రెండవ వ్యక్తి
  • అత్యధిక మెజారిటీతో గెలిచిన రెండవ రాష్ట్రపతి.
  • సాధారణ పౌరుల వలె ఓటుహక్కు వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి

15. డా. ఎ.పి. జె. అబ్దుల్ కలామ్‌ (1931- 2015)

సొంత రాష్ట్రం: తమిళనాడు 

ప్రత్యర్థి: లక్ష్మి సెహగల్ 

పదవీకాలం: 2002 జులై 25 - 2007 జులై 25

ప్రత్యేకతలు: 

  • ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి.
  • ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న 2వ రాష్ట్రపతి.
  • లాభదాయక పదవుల బిల్లు పున:పరిశీలనకు పంపాడు 

16. శ్రీమతి ప్రతిభా పాటిల్‌ (1934-)

సొంత రాష్ట్రం: మహారాష్ట్ర

ప్రత్యర్థి: భైరాన్ సింగ్ షెకావత్ 

పదవీకాలం: 2007 జులై 25 - 2012 జులై 25

ప్రత్యేకతలు: 

  • మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి.
  • రాజస్థాన్‌ గవర్నర్‌గా, మహారాష్ట్రలో మంత్రిగా, రాజ్యసభ డిప్యూటి చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

17. శ్రీ ప్రణబ్‌ ముఖర్జీ (1935-2020)

సొంత రాష్ట్రం: పశ్చిమ బెంగాల్ 

ప్రత్యర్థి: పి. ఎ. సంగ్మా 

పదవీకాలం: 2012 జులై 25 - 2017 జులై 25

ప్రత్యేకతలు: 

  • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసారు.
  • కేంద్రంలో ఆర్థిక రక్షణ, వాణిజ్య, విదేశాంగ మంత్రిగా పనిచేసారు.
  • ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు.
  • పదవీ రీత్యా 13వ రాష్ట్రపతి

18. రామ్ నాథ్ కోవింద్ (1 అక్టోబర్ 1945-)

సొంత రాష్ట్రం: ఉత్తర ప్రదేశ్ 

ప్రత్యర్థి: మీరా కుమార్ 

పదవీకాలం: 2017 జులై 25 - 2022 జులై 25

ప్రత్యేకతలు: 

  • 14వ రాష్ట్రపతి 

19. ముర్ము 

సొంత రాష్ట్రం: ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైదపోసిలో 1958 జూన్‌ 20న జన్మించారు

ప్రత్యర్థి:  యశ్వంత్ సిన్హా

పదవీకాలం: 2022 జులై 25 - 

ప్రత్యేకతలు: 

  • 14వ రాష్ట్రపతి
  • భారత రాష్ట్రపతులందరిలో అతి పిన్న వయస్కురాలు (64 ఏళ్లు)
  • తొలి గిరిజన మహిళ & రాష్ట్రపతి

విశ్లేషణ

  • అతి పెద్ద వయస్సులో రాష్ట్రపతియైనవారు - కె.ఆర్‌. నారాయణన్‌.
  • అతి చిన్న వయస్సులో రాష్ట్రపతియైన వారు - నీలం సంజీవరెడ్డి
  • ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులు అయినవారు - నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్‌సింగ్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ
  • అత్యధిక రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం - తమిళనాడు (సర్వేపల్లి, రాధాక్రిష్ణన్‌, ఆర్‌. వెంకట్రామన్‌, ఎ.పి.జె అబ్దుల్ కలామ్‌)
  • ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ నేపథ్యంతో రాష్ట్రపతి అయినవారు - వి.వి.గిరి
  • ఏ రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతియైనవారు - ఎ.పి.జె. అబ్దుల్ కలామ్‌.
  • రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక సుప్రీంకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి - యం. హిదయత్‌ తుల్లా

ప్రత్యేక సమాచారం - రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు

  • సుమిత్రాదేవి (1962)
  • మహారాణి గురుచరణ్‌ కౌర్‌ (1969)
  • లక్ష్మీ సెహగల్‌ (2002)
  • ప్రతిభా పాటిల్‌ (2007)
  • మీరా కుమార్ (2017)
  • ముర్ము (2022)


Post a Comment

0Comments

Post a Comment (0)