List of the Prime Ministers of India
జవహర్‌లాల్ నెహ్రూ (15-8-1947 నుండి 27-5-1964)
- జన్మస్థలం - ఉత్తర ప్రదేశ్
- భారతదేశానికి అత్యధిక కాలము, అనగా 16 సంవత్సరాల 286 రోజులు ప్రధాన మంత్రిగా పనిచేశారు.
- నాలుగు పర్యాయాలు ప్రధానిగా పదవీ ప్రమాణస్వీకారం చేసారు. (1947, 1952, 1957, 1962)
- ఆధునిక నవభారత నిర్మాత
- ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని మనదేశంలో ప్రవేశపెట్టినారు.
- ప్రణాళికాబద్దమైన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
- భారతదేశ పారిశ్రామిక రాజ్యాంగంగా పేర్కొనే 1956 పారిశ్రామిక తీర్మానమును ప్రవేశపెట్టారు.
- భారత విదేశాంగ విధాన రూపశిల్పిగా పేర్కొంటారు.
- పంచశీల సిద్ధాంతకర్త, పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేశారు.
- అలీన ఉద్యమ నిర్మాణంలో ఒకరిగా పేరొందారు.
- 1955లో భారతరత్న గ్రహీత (ఈ అవార్డు పొందిన తొలి ప్రధాని)
- పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని.
- ఎర్రకోటపై ఎక్కువ పర్యాయాలు జెండాను ఎగురవేశారు. (17 పర్యాయాలు)
గుల్టారిలాల్ నందా (25-5-1964 నుండి 9-6-1964)
- జన్మస్థలం - సియాల్‌కోట్, పంజాబ్ రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది).
- తాత్కాలిక ప్రధాని
- 1997లో భారతరత్న గ్రహీత. (మరణానంతరం)
లాల్‌బహదూర్ శాస్త్రి (9-6-1964 నుండి 11-1-1966)
- జన్మస్థలం - ఉత్తర ప్రదేశ్
- జై జవాన్ -జై కిసాన్ అను నినాదాన్ని ఇచ్చారు.
- 1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్దాన్ని సమర్ధంగా ఎదుర్కొన్నారు.
- 1966లో పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసినారు.
- విదేశీ పర్యటనలో మరణించిన ప్రధాన మంత్రి 'మరియు పదవిలో ఉండగా మరణించిన 2వ ప్రధాని (తాష్కెంట్ ఒప్పందం మరుసటి రోజే మరణించారు)
- రైల్వే మంత్రిగా కర్టాటకలో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ నెహ్రూ ప్రభుత్వం నుండి రాజీనామా చేశారు.
- 1966లో భారతరత్న గ్రహీత. (మరణానంతరం అవార్డు పొందిన మొదటి వ్యక్తి)
గుల్దారిలాల్ నందా (11-1-1966 నుండి 24-1-1966)
- తాత్కాలిక ప్రధాని
శ్రీమతి ఇందిరా గాంధి (24-1-1966 నుండి 24-3-1977)
- జన్మస్థలం - ఉత్తర ప్రదేశ్
- ఇండియా తొలి మహిళా ప్రధాని.
- ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన తొలి మహిళ.
- కేంద్ర సమాచార శాఖా మంత్రిగా పనిచేశారు.
- భారతదేశానికి అత్యధికకాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తి
- మొదటి మధ్యంతర ఎన్నికలను నిర్వహించిన ప్రధాని (1971)
- మొదటిసారిగా 14 బ్యాంకులను 1969లో జాతీయం చేయటం జరిగింది.
- 1970లో రాజభరణాలను రద్దు చేయటం జరిగింది.
- గరీబీ హఠావో అను నినాదాన్ని 1971లో ఇచ్చారు.
- 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.
- మనదేశంలో అత్యధికసార్లు అత్యనసర సరిస్థితులను వీరి కాలంలోనే విధించారు.
- భారత రాజ్యాంగములో అధిక సనరణలు వీరి కాలంలోనే జరిగాయి
- 1974లో మొదటిసారిగా ఫోఖ్రాన్ లో అణుపరీక్షలు నిర్వహించారు.
- 1975లో జాతీయ ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధించటం జరిగింది.
- జాతీయ ఎమర్జెన్సీ కాలములో జరిగిన అవకతవకలపై అరెస్ట్ గావింపబడిన ప్రధాని.
- ప్రధాని పదవిలో ఉండి పార్లమెంటు సభ్యురాలుగా ఓడిపోయిన వ్యక్తి,
- 1972లో చారిత్రాత్మకమైన సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రధాని అయిన జుల్ఫీకర్ అలీ భుట్టో తో కుదుర్చుకున్నారు.
- 1971లో నాటి అగ్రరాజ్యమైన రష్యాతో 20సం. శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకొనటం జరిగింది.
- సభలో నామినేటెడ్ సభ్యురాలిగా ఉండి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి
- పదవిలో ఉండగా మరణించిన మూడవ ప్రధాని. హత్యకు గురైన మొదటి ప్రధాని
- 1971లో భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ
మొరార్టీ దేశాయ్ (24-3-1977 నుండి 28-7-1979)
- జన్మస్థలం - గుజరాత్
- తొలి కాంగ్రెసేతర ప్రధాన మంతి. రాజీనామా చేసిన మొదటి ప్రధాని,
- ఇండియాలో సంకీర్ణ ప్రభుత్వాలకు నేతృత్వం వహించిన మొదటివ్యక్తి
- ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించి ప్రధానియైన మొదటి వ్యక్తి
- భారత పార్లమెంటులో అత్యధికసార్లు (9) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- నిరంతర ప్రణాళికలు వీరి కాలంలోనే ప్రవేశపెట్టారు.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలయందు ఓబిసి లకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతో మండల్ కమీషన్‌లను నియమించారు.
- ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానులను (చరణ్‌సింగ్, జగ్జీవన్ రామ్) కలిగియున్న ప్రధాన మంత్రి.
- పాకిస్థాన్ ఇచ్చే పురస్కారం నిషాన్-ఇ-పాకిస్థాన్ పొందిన తొలి భారతీయుడు.
- 1991లో భారతరత్న గ్రహీత
చరణ్ సింగ్ (28-7-1979 నుండి 14-1-1980)
- జన్మస్థలం - ఉత్తర ప్రదేశ్
- పార్లమెంటును ఎదుర్కొకుండానే రాజీనామా చేసిన ప్రధాన మంత్రి.
- ప్రధాన మంత్రిగా 23 రోజులు పనిచేయగా, ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కలలు పనిచేశారు.
- రైతు బాంధవుడిగా పేరొందినారు.
- ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానియైన రెండవ వ్యక్తి
- మొదటిసారిగా విశ్వాస తీర్మాన ప్రకటనను ఎదుర్కోవాల్సి ఉండాల్సింది కాని రాజీనామా చేశారు.
శ్రీమతి ఇందిరా గాంధి (14-1-1980 నుండి 31-10-1984)
రాజీవ్ గాంధి (31-10-1984'- 1-12-1989)
- జన్మస్థలం - బొంబాయి
- అతి చిన్న వయస్సులో (42) ప్రధాన మంత్రిగా పదవిని చేపట్టిన వ్యక్తి.
- కేంద్ర మంత్రి మండలిని అత్యధికసార్లు యి పునర్ వ్యవస్థీకరించారు.
- భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాదులు వేసినవారు.
- శ్యామ్ పిట్రోడా తో కలిసి ఐ.టి.రంగంలో విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి.
- నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు.
- ఓటు హక్కు యొక్క వయోపరిమితి 21 నుండి 18 సం.లకు తగ్గించారు.
- పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు.
- ఆఫ్రికా ఫండ్ ను ఏర్పాటు చేశారు.
- బికారీ హఠావో అను నినాదాన్ని ఇచ్చారు.
- 1991లో భారతరత్న గ్రహీత. (మరణానంతరం)
వి.పి.సింగ్ (2-12-1989 నుండి 10-11-1990)
- జన్మస్టలం - ఉత్తర ప్రదేశ్
- మనదేశంలో ఫ్రంట్ (సంకీర్ణ) ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టారు.
- అవిశ్వాస తీర్మానము ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధాన మంత్రి
- మండల్ కమీషన్ సిఫార్సులను అమలుకు శ్రీకారం చుట్టారు.
- అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు
- అయోధ్య వివాదంలో బి.జె.పి.తన మద్ధతును ఉపసంహరించుకోవడం వల్ల అధికారాన్ని కోల్పోయారు.
చంద్రశేఖర్ (10-11-1990 నుండి 21-6-1991)
- జన్మస్థలం - ఉత్తర ప్రదేశ్
- బోండ్సీ బాబాగా (Baba of Bhondsi) పేరొందినారు. (బోండ్సీ చంద్రశేఖర్ నివాస స్థలము)
- 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధ కాలంలో అమెరికన్ యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా చేయడం వివాదాస్పదం అయ్యింది.
- భారతదేశంలో రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి, ఇతన్ని యంగ్ టర్క్ అని కూడా అంటారు.
పి.వి.నరసింహరావు (21-6-1991 నుండి 16-5-1996)
- జన్మస్థలం - వంగర గ్రామం, కరీంనగర్ (తెలంగాణ)
- దక్షిణ భారతదేశానికి (ఆంధ్రప్రదేశ/తెలంగాణ) చెందిన తొలి ప్రధాన మంత్రి.
- ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానియైన వ్యక్తుల్లో నాల్గవ వ్యక్తి.
- అత్యధిక మెజారిటీతో గెలిచిన ప్రధాన మంత్రి
- లుక్ ఈస్ట్ అను విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టారు.
- ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
- “ద ఇన్‌సైడర్” అనే ఆత్మకథను రాశారు.
- విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలను “సహస్రఫణ్” అనే పేరుతో హిందీలోకి తర్జుమా చేశారు.
- దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారు.
- మైనార్జీ ప్రభుత్వాన్ని పూర్తి పదవీకాలం కొనసాగించినారు.
- ఇండియాలో నూతన ఆర్థిక విధానాలకు పునాదులు వేసినారు.
- పార్లమెంటు ఉభయ సభలలో దేనిలోనూ సభ్యుడు కాకుండానే ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తి
- తర్వాతి కాలంలో నంద్యాల నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనారు.
- పదవిలో ఉండి, మోసపూరిత కేసులో (జార్ధండ్ ముక్తి మోర్చా ఎం.పి. అవినీతి కేసు) 3సం.ల శిక్ష విధింపబడిన తొలి ప్రధాని. తరువాత హైకోర్టు దీనిని తోసిపుచ్చింది.
ఎ.బి.వాజ్‌పేయ్ (16-5-1996 నుండి 1-6-1996)
- జన్మస్థలం - మధ్య ప్రదేశ్
- ఒక పర్యాయంలోఅతి తక్కువ కాలం (13 రోజులు) పనిచేసిన ప్రధాన మంత్రి
- అత్యధిక పార్టీల ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వము వహించారు.
- అవిశ్వాస తీర్మానము ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధాన మంత్రి
- జై విజ్ఞాన్ అను నినాదాన్ని ఇచ్చారు.
- నూతన ఆర్థిక విధానాలను వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.
- ప్రోఖ్రాన్‌లో 2వసారి అణుపరీక్షలు 1998లో వీరి కాలంలోనే జరిగాయి.
- కార్గిల్ యుద్దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న ప్రధాని.
- లాహోర్‌కు ఇండియా నుండి బస్సు సర్వీసు రాయబారాన్ని వీరి కాలంలో ప్రారంభించారు.
- ఐక్యరాజ్య సభలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని.
- 2014లో భారతరత్న బిరుదును పొందారు.
- ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు (2002)
హెచ్.డి. దేవెగౌడ (1-6-1996 నుండి 20-4-1997)
- జన్మస్థలం - కర్ణాటక
- దక్షిణ భారత (కర్ణాటక) 2వ ప్రధాని.
- ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానియైన ఐదవ వ్యక్తి
- పార్లమెంటులో ఏ సభలో సభ్యుడు కాకుండా ప్రధాన మంత్రి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి
- రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి
- 13 పార్టీలతో కూడుకున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
- అతి తక్కువ మంది లోక్‌సభ సభ్యులను (44) కలిగియుండి కేంద్రములో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినవారు.
ఐ.కె.గుజ్రాల్ (21-4-1997 నుండి 18-3-1998)
- జన్మస్థలం - జీలం (పంజాబ్) ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది
- జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
- రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాన మంత్రి పదవిచేపట్టిన మూడవ వ్యక్తి.
- ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
- గుజ్‌రాల్ డాక్ట్రిన్ (Gujral Doctrine) పేరుతో ప్రత్యేక విదేశాంగ విధానాన్ని రూపొందించారు.
ఎ.బి.వాజ్‌పేయ్ (19-3-1998 నుండి 13-10-1999) (13-10-1999 నుండి 22-05-2004)
డా.మన్మోహన్‌సింగ్ (22-5-2004 నుండి 25-5-2009 - 17-5-2014)
- జన్మస్థలం - గాహ్ (పశ్చిమ పంజాబ్) ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.
- మనదేశంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నారు.
- యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి ద్వారా ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు
- రాజ్యసభ సభ్యుడిగా ఉండి (అస్సాం నుండి) ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన నాల్గవ వ్యక్తి
- పి.వి.నరసింహా రావు ప్రభుత్వ కాలంలో ఆర్థికమంత్రిగా, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టుటకు ప్రధాన కారకుడు.
- అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వ్యక్తి.
నరేంద్ర దామోదర్ దాస్ మోడీ (26-5-2014 - ప్రస్తుతం)
- జన్మస్థలం - వాద్ నగర్, మహాసన్ జిల్లా బొంబాయి రాష్ట్రం, ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది.
- అత్యధిక మెజారిటీతో గెల్చిన రెండవ ప్రధాని
- నాల్గు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసారు.
- విద్యార్థి నాయకుడిగా పనిచేసారు.
- ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని.
- ఎక్కువ కాలం కాంగ్రెసేతర ప్రధానిగా ఉన్న వ్యక్తి
ప్రధాన మంత్రి పదవి చేపట్టినవారు - ప్రత్యక విశ్లేషణ
ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధాన మంత్రులైనవారు
- మొరార్టీ దేశాయ్ - బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి
- చరణ్‌సింగ్ - ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
- విపి. సింగ్ - ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
- పి.వి. నరసింహారావు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- దేవెగౌడ - కర్ణాటక ముఖ్యమంత్రి
- నరేంద్ర మోడీ - గుజరాత్ ముఖ్యమంత్రి
కొన్ని ముఖ్యాంశాలు
- అతి చిన్న మంత్రివర్గం ఏర్పాటుచేసిన ప్రధాని - జవహర్ లాల్ నెహ్రూ
- పెద్ద మంత్రివర్గం ఏర్పాటుచేసిన ప్రధాని - మన్మోహన్‌సింగ్
- ఎక్కువ శాఖలను తన వద్దనే ఉంచుకున్న ప్రధాని - చంద్రశేఖర్
- బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులు - జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధి & రాజీవ్ గాంధీ
- అత్యధికంగా ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రం - ఉత్తరప్రదేశ్ (6 మంది) - జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, చరణ్ సింగ్, వి.పి.సింగ్, చంద్రశేఖర్
- అత్యధికంగా ప్రధాన మంత్రులను అందించిన రెండవ రాష్ట్రం - గుజరాత్ (మొరార్జీ దేశాయ్ మరియు నరేంద్ర మోడీ)
భారతరత్న బిరుదు పొందిన ప్రధానులు
- జవహర్ లాల్ నెహ్రు 1955
- లాల్ బహదూర్ శాస్త్రి 1966
- శ్రీమతి ఇందిరా గాంధీ 1971
- రాజీవ్ గాంధీ 1991
- మొరార్జీ దేశాయ్ 1991
- గుల్దారిలాల్ నంద 1997
- అటల్ బిహారి వాజ్‌పేయ్ 2014