క్యాబినెట్‌ సచివాలయం

TSStudies
0

క్యాబినెట్‌ సచివాలయం (Cabinet Secretariat)

  • పార్లమెంటరీ వ్యవస్థలో క్యాబినెట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని ముఖ్య నిర్ణయాలు ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్న క్యాబినెట్‌ తీసుకుంటుంది. దీనికి అవసరమైన పరిపాలనా సహాయాన్ని క్యాబినెట్‌ సచివాలయం అందిస్తుంది. క్యాబినెట్‌ సచివాలయం అనేది స్టాఫ్‌ ఏజెన్సీ. ఇది ప్రధాన మంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. విధాన నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాబినెట్‌ సచివాలయానికి డిపార్టుమెంటు హోదా ఉంది. క్యాబినెట్‌ సచివాలయాన్ని 1947లో ఏర్పాటు చేశారు. 

cabinet secretariat

నిర్మాణం:

క్యాబినెట్‌ సచివాలయంలో 3 వింగ్స్‌ ఉంటాయి. అవి.

1. సివిల్‌ వింగ్‌ 2. మిలిటరీ వింగ్‌ 3. ఇంటలిజెన్స్‌ వింగ్‌

వీటికి తోడుగా ఈ క్రింది వ్యవస్థలు కూడా ఉంటాయి.

  • రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (RAW)
  • డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సెక్యూరిటీ
  • స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌
  • జాయింట్‌ ఇంటలిజెన్స్‌ కమిటి
  • నేషనల్‌ అథారిటి ఆన్‌ కెమికల్‌ వెపన్స్‌ కన్‌వెన్‌షన్స్‌
  • డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌స్‌
విధులు :
  • క్యాబినెట్‌ సమావేశాల ఎజెండాను తయారు చేయడం.
  • క్యాబినెట్‌ సమావేశాలకు సెక్రటేరియట్‌ సహాయాన్ని అందిస్తుంది
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర కేంద్ర మంత్రులకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలియజేస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది.
  • మంత్రులకు శాఖల కేటాయింపు, వారి రాజీనామాలు, మొదలగు పనులను పరిరక్షిస్తుంది.
  • వివిధ మంత్రిత్వ శాఖలకు సమాచారాన్ని చేరవేస్తుంది.
  • క్యాబినెట్‌ సచివాలయానికి, క్యాబినెట్‌ సెక్రటరీ పరిపాలనా అధికారిగా ఉంటాడు.

క్యాబినెట్‌ కార్యదర్శి

  • ఇతడు క్యాబినెట్‌ సచివాలయానికి పరిపాలనా అధిపతి.
  • ఈ పదవిని 1950లో ఏర్పాటు చేశారు.
  • సివిల్‌ సర్వీస్‌ అధికారుల అవగాహనలో ఇది అత్యున్నత పదవి
  • కేంద్ర పరిపాలనకు ప్రధాన సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు
  • కేంద్ర సచివాలయంలో ముఖ్య అధికారుల ఎంపిక బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల వార్షిక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
  • ప్రధాన మంత్రికి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తారు.
  • దేశంలోని సివిల్‌ సర్వెంట్లకు మార్గదర్శిగా ఉంటారు.
  • ప్రధానిమంత్రికి కళ్ళు, చెవులుగా పనిచేస్తారు.

 ప్రధాన మంత్రి కార్యాలయం (Prime Ministers Office [PMO])

  • ప్రభుత్వాధిపతిగా ప్రధాన మంత్రి కార్య నిర్వాహక అధికారాలలో కీలక పాత్ర వహిస్తారు. తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రధాన మంత్రికి సహాయపడడానికి ప్రధాన మంత్రి కార్యాలయం లేదా సచివాలయం ఉంటుంది. ఇది స్టాఫ్‌ ఏజెన్సీ మరియు రాజ్యాంగేతర సంస్థ. దీనికి డిపార్టుమెంట్‌ హోదా ఉంది. దీనిని 1947 లో ఏర్నాటు చేశారు. అప్పటి గవర్నర్‌ జనరల్‌కు వ్యక్తిగత కార్యదర్శి హోదాలో ఇది పనిచేసేది. 1977 నుంచి దీనిని ప్రధాన మంత్రి సచివాలయంగా పిలుస్తున్నారు. .
  • ప్రధాన మంత్రి దీనికి అధిపతిగా ఉంటారు. పరిపాలనాపరంగా ప్రిన్సిపల్‌ కార్యదర్శి (Principal Secretary) ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు అదనపు కార్యదదర్శులు అలాగే మూడు లేదా ఐదుమంది సంయుక్త కార్యదర్శులు అలాగే డైరెక్టర్‌లు, సహాయ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఉంటారు.

విధులు

  • ప్రధాన మంత్రికి అవసరమైన సెక్రటేరియల్‌ సర్వీసులు అందిస్తుంది.
  • ఇతర మంత్రిత్వ శాఖలు విభాగాల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తుంది.
  • ఈ ప్రధాన మంత్రికి “థింక్‌ ట్యాంక్‌” (Think Tank) లేదా వ్యూహకర్తగా వ్యవహరిస్తుంది.
  • ఇతర శాఖలకు కేటాయించని అంశాలను పర్యవేక్షిస్తుంది.
  • అందుకే దీనిని “అవశిష్టదత్త” సంస్థగా (Residual Legatee) పేర్కొంటారు.
  • ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన మంత్రి కార్యాలయం అనూహ్య ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార కేంద్రంగా పరిణమించింది. అందుకే దీనిని “సూపర్‌ క్యాబినెట్‌ లేదా “మైక్రో క్యాబినెట్‌, “సూపర్‌ మినిస్ట్రీ, “సూపర్‌ సెక్రటేరియట్‌" అలాగే “ప్రభుత్వం పైన ప్రభుత్వం” (The Government of the Government of India)గా అభివర్ణిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)