రాష్ట్ర ప్రభుత్వం - గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి
State Government - Governor, Chief Minister & Council of Ministers
- కేంద్రములోను, రాష్ట్రములోను పార్లమెంటరీ పద్ధతిలో పరిపాలన ఉంది. రాష్ట్రములో రాజ్యాంగపరమైన అధిపతియైన గవర్నరు ముఖ్య కార్యనిర్వాహకుడిగా, ముఖ్యమంత్రితో కూడిన మంత్రి మండలి సలహా మేరకు తన విధులను, అధికారాలను నిర్వహిస్తారు.
- భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో, ప్రకరణ 152 నుండి 213 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సమగ్రమైన అంశాలను పేర్కొన్నారు. 6వ భాగం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది.
రాష్ట్ర గవర్నర్
- ప్రకరణ 153 నుండి 167 వరకు గవర్నరు పదవి, నియామకం, అర్హతలు, తొలగింపు, అధికార విధుల గురించి పొందుపరిచారు.
గవర్నరు - నియామకం
- ప్రకరణ 153 ప్రకారం, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉంటారు. అయితే 1956లో ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు లేదా అంతకంటె ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నరును నియమించే ఏర్పాటు చేశారు.
- ప్రకరణ 155 ప్రకారం, గవర్నరును తన అధికార ముద్రచేత రాష్ట్రపతి నియమిస్తారు. (By warrant under his hand and seal).
ప్రత్యేక వివరణ
- ముసాయిదా రాజ్యాంగంలో గవర్నర్లను ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. నియమించబడే గవర్నర్‌ల పద్ధతిని రాజ్యాంగ పరిషత్తులో సూచించినది డా॥ బి.ఆర్. అంబేద్కర్. అయితే గవర్నర్‌లను ఎన్నుకునే పద్ధతిని సూచించినది డా॥ బి.ఎన్. రావు.
నియమించబడే గవర్నర్ల పద్ధతి - కారణాలు
- పార్లమెంటరీ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఒకే విధమైన ప్రభుత్వ వ్యవస్థలురాష్ట్ర గవర్నరు రాజ్యాంగపరమైన అధిపతిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. కనుక గవర్నరును ఎన్నుకోవడం సముచితమైనది.
- ప్రజలచేత ఎన్నుకోబడి: సళశక్ బడిన ఇద్దరు అధిపతులు ఒకే చోట పనిచేయడం కొన్ని సమస్యలకు దారి తీస్తుంది ఎన్నికల్లో వ్యక్తిగత, ఇతర అంశాలు ప్రభావాన్ని చూపుతాయి. కనుక, గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటే 'నియమించబడే పద్ధతే' ఉత్తమమైనది.
- కెనడా పద్దతి వలె భారత్‌లో కూడా నియమించబడే గవర్నర్ల పద్దతిని కొన సాగించారు. అమెరికాలో గవర్నర్లు ఓటర్లచేత నేరుగా ఎన్నుకోబడుతారు.
అర్హతలు
పకరణ 157 ప్రకారం నియమించబడదే వ్యక్తికి ఈ క్రింది అర్హతలుండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- లాభదాయక పదవిలో ఉండరాదు
- నేరారోపణ బుజువై ఉండరాదు
- 35 సం.రాలు నిండి ఉండాలి
షరతులు
ప్రకరణ 158 ప్రకారం, గవర్నరుగా నియమించబడే వ్యక్తి పార్లమెంటులోగాని, రాష్ట్ర శాసన సభలో గాని సభ్యుడై ఉండరాదు. ఒకవేళ సభ్యుడై ఉంటే, గవర్నరుగా నియమించబడిన వెంటనే తన సభ్యత్వం రద్దవుతుంది. అలాగే ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో ఎలాంటి లాభదాయక పదవులు చేపట్టరాదు
గవర్నరు - నియామకం - కొన్ని సాంప్రదాయాలు
ఆర్. ఎస్. సర్కారియా కమీషన్ గవర్నర్ నియామకంలో కొన్ని సూచనలను, సాంప్రదాయాలను సూచించింది. వీటిని పాటించవచ్చు, పాటించకపోవచ్చు.
సాంప్రదాయాలు
- గవర్నర్‌గా నియమించబడే వ్యక్తి ఏదో ఒక రంగంలో నిష్ణాతుడై ఉండాలి.
- తన స్వంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు
- గవర్నర్‌గా నియమించబడటానికి కనీసం రెండు సం॥ ముందు క్రియాశీలక రాజకీయాలలో ఉండరాదు.
- గవర్నర్‌ను నియమించే సమయంలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
పదవీ కాలము
- ప్రకరణ 156(1) ప్రకారము, గవర్నర్ 5 సం॥ కాలానికి నియమించబడినా, రాష్ట్రపతి విశ్వాసము ఉన్నంత వరకే పదవిలో ఉంటారు. అనగా, గవర్నర్ పదవీ కాలము రాష్ట్రపతి యొక్క విశ్వాసము పై ఆధారపడి ఉంటుంది. గవర్నర్‌కు పదవీ కాల భద్రత లేదు.
గవర్నర్ పదవీ కాలం - అభీష్ట సూత్రం (Doctrine of Pleasure)
- గవర్నర్ 5సం॥ కాలానికి నియమించబడినప్పటికీ ఖచ్చితంగా 5 సం. పదవిలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చు. కేంద ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం చేత నియమించబడిన గవర్నర్ లను రాజీనామా చేయమని అడగటం లేదా వారిని తొలగించడం జరుగుతుంది. దీనికి కారణం గవర్నర్‌లకు పదవీ కాల భద్రత లేకపోవడమే, రాష్ట్రపతి యొక్క విశ్వాసమున్నంతవరకే అధికారంలో ఉంటారు అని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని 2010లో బి.పి. సింగాల్. Vs యూనియన్ అఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
- 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అలాంటీ పరిస్థితి ఏర్పడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేత నియమించబడిన గవర్నలు తమ పదవి నుండి తప్పుకోవాలని సందేశం పంపింది. ఇది సమైఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
- మారిన ప్రభుత్య విధానాలు, సిద్ధాంతాలలో గవర్నలు ఇమడ లేనప్పుడు వారిని పదవి నుండి తప్పుకోమని కోరవచ్చు. కానీ అక్రమంగా, విచక్షణారాహిత్యంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధం.
గవర్నర్ లొలగింపు
- ప్రకరణ 156(1) ప్రకారం, గవర్నర్ ను రాష్ట్రపతి తొలగిస్తాడు. తొలగించడానికి ప్రత్యేక కారణాలు రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా గవర్నర్ ను తొలగిస్తారు. ఇందులో అభిశంసన అనే ప్రక్రియ ఉండదు. రాష్ట్రపతి విశ్వాసము పైన ఆధారపడి ఉంటుంది. అలాగే, రాష్ట్రపతి గవర్నర్ ను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు.
ప్రత్యేక వివరణ
- గవర్నర్లపై అవిశ్వాస తీర్మానంగానీ, అభిశంసనా తీర్మానంగానీ ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కేవలం రాష్ట్రపతి ఆదేశం ద్వారా మాత్రమే తొలగించవచ్చు.
పదవీ ప్రమాణ స్వీకారం
- ప్రకరణ 159 ప్రకారం,గవర్నర్‌గా నియమించబడిన వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. హైకోర్టు న్యాయమూర్తి, అతడు లేని పక్షంలో హైకోర్టు న్యాయమూర్తి ముందు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్చిస్తాడు.
జీతభత్యాలు
- ప్రకరణ 158 ప్రకారం, గవర్నరు జీత భత్యాలను పార్లమెంటు ఒక చట్లం ద్వారా నిర్ణయిస్తుంది. వీటిని రెండవ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. 2008 సం.లో వీరి జీతం రూ. 1,10,000 కు పెంచడం జరిగింది.
గవర్నరు - అధికార విధులు
- ప్రకరణ 153 ప్రకారము, రాష్ట్రంలో పరిపాలన, కార్యనిర్వాహణ ఇతర కొన్ని అంశాలు గవర్నరు పేరుతో కొనసాగుతాయి. గవర్నరు అధికార విధులను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
- కార్యనిర్వాహక అధికారాలు
- శాసన నిర్మాణ అధికారాలు
- ఆర్థికాధికారాలు
- న్యాయాధికారాలు
- విచక్షణాధికారాలు
- కార్య నిర్వాహక అధికారాలు:
- ప్రకరణ 154 ప్రకారం, రాష్ట్ర కార్యనిర్వాహణాధికారాలు గవర్నర్ పేరుతో నిర్వహించబడతాయి. అతడు ఈ అధికారాలను స్వయంగా కానీ, తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తారు. ముఖ్యంగా, రాష్ట్రంలో అన్ని నియామకాలు గవర్నర్ పేరు మీదుగానే జరుగుతాయి. అందులో
- ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి నియామకం ప్రకరణ 164(1)
- రాష్ట్ర అడ్వాకేటు జనరల్ నియామకం (ప్రకరణ 165)
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ మరియు సభ్యుల నియామకము (ప్రకరణ 316)
- రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకం (ప్రకరణ 243K)
- రాష్ట్ర ఆర్థిక సంఘ నియామకం (ప్రకరణ 243L)
- రాష్ట్ర అధికార భాషా సంఘం, మైనారిటీ కమీషన్, మహిళా కమీషన్, మానవ హక్కుల కమీషన్, ఎస్.సి., ఎస్.టి., బి.సి. కమీషన్‌ల చైర్మన్‌లను సభ్యులను నియమిస్తారు.
- రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. ఈ హోదాలో వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ పేరునే నియమించబడతారు.
- శాసనాధికారాలు
- ప్రకరణ 168 ప్రకారం, రాష్ట్ర గవర్నరు శాసన సభలో అంతర్భాగమే కాని సభ్యుడుకాదు. శాసన సభలో అన్ని ప్రక్రియలు గవర్నరుతో ముడిపడి ఉంటాయి. అవి
- రాష్ట్ర శాసన సభను సమావేశపర్చడం, దీర్ఘకాలిక వాయిదావేయడం (Prorogue) రద్దు చేయడం (Dissolve) ప్రకరణ 174
- ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం, సభలకు సమాచారాన్ని పంపడం ప్రకరణ (175)
- శాసన సభలో ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయవచ్చు. (ప్రతి సంవత్సరం మొదటి సమావేశం, ప్రతి కొత్త విధాన సభ మొదటి సమావేశం) ప్రకరణ 176(1))
- విధాన పరిషత్‌కు 1/6వ వంతు సభ్యులను నామినేట్ చేయడం ప్రకరణ (171)
- శాసన సభ్యుల అనర్హతలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనమేరకు అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రకరణ (192(1), 192(2))
- రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లుకు తన ఆమోదాన్ని తెలపడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. ప్రకరణ (200)
- బిల్లులను రాష్ట్రపతి పరిశీలను పంపే నిమిత్తం వాటీని నిలిపి ఉంచడం. (Reserved for consideration of President) (ప్రకరణ 201)
- రాష్ట్ర విధానసభకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం ప్రకరణ (383)
- శాసన సభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్‌లను జు జారీచేయడం ప్రకరణ (213).
- రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లులను సంతకం చేయడం, పునఃపరిశీలనకు పంపడం లేదా తిరస్కరించడం
- రాష్ట్ర ఆర్థిక సంఘము, పబ్లిక్ సర్వీస్ కమీషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికలను శాసనసభ ముందు ఉంచడం.
ఆర్డినెన్సు జారీ చేసే అధికారం - ప్రకరణ 218(1)
- రాష్ట్రశాసన సభసమావేశంలో లేనప్పుడు, ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రభుత్వ అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్సును జారీ చేయవచ్చు. అయితే ఆర్షినెన్సును ఉభయసభలు తిరిగి సమావేశమైన ఆరు వారాలలో ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదించకపోతే ఆర్డినెన్సు రద్దవుతుంది. ఈలోగా ప్రభుత్వం ఆర్డినెన్సు స్తానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆర్దినెన్సులో పేర్కొన్న అంశాలపై శాసన సభ ఆమోదాన్ని పొందవచ్చు. ఈ ఆర్టినెన్సుకు చట్టానికున్న హోదా మరియు అధికారం ఉంటుంది. ఆర్టినెన్సును గవర్నర్ ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
ఆర్థికాధికారాలు
- ప్రతి ఆర్థిక సంవత్సరం, వార్షిక బడ్జెట్‌ను సభలో సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. (ప్రకరణ 202)
- ద్రవ్య బిల్లులను గవర్నరు అనుమతితోనే విధాన సభలో ప్రవేశపెట్టాలి. (ప్రకరణ 207)
- గవర్నర్ అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించరాదు, తగ్గించరాదు, మార్పు చేయరాదు.
- రాష్ట్ర ఆగంతక నిధిని గవర్నరు నిర్వహిస్తారు (ప్రకరణ 267)
- రాష్ట్ర పబ్లిక్ నిధిని కూడా నిర్వహిస్తారు. (ప్రకరణ 266)
న్యాయాధికారాలు
- ప్రకరణ 161 ప్రకారం, గవర్నరుకు కొన్ని న్యాయాధికారాలు ఉన్నాయి. న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు, మార్పు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. శిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు మరియు క్షమాభిక్ష కూడా పెట్టవచ్చు. అయితే ఉరిశిక్షను రద్దు చేసే అధికారం లేదు. న్యాయాధికారాలు సంబంధిత రాష్ట్ర భూభాగానికి మాత్రమే పరిమితం అవుతాయి. సైనిక కోర్టులు ఇచ్చిన తీర్పులలో, శిక్షలలో గవర్నరు జోక్యం చేసుకునే అధికారం లేదు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి గవర్నరును సంప్రదిస్తాడు.
- గమనిక: ఆర్డినెన్సు జారీ చేయడం గవర్నర్ యొక్క విచక్షణాధికారం కాదు. మంత్రి మండలి సలహామేరకే జారీ చేస్తారు.
విచక్షణాధికారాలు (Discretionary Powers)
- రాజ్యాంగంలో గవర్నరుకు కొన్ని విచక్షణాధికారాలు కూడా కల్పించారు. మంత్రి మండలి సలహా లేకుండానే కొన్ని అధికారాలను, విధులను నిర్వహిస్తాడు. ఈ క్రింద పేర్కొన్న విధులను గవర్నరు తన విచక్షణ మేరకు వ్యవహరిస్తారు.
- అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్ర గవర్నర్‌లకు ఆ రాష్ట్రాల గిరిజన ప్రాంతాల పరిపాలనపై విచక్షణాధికారాలున్నాయి.
- నాగాలాండ్‌లో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక అధికారాలున్నాయి
- మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతాలైన, విదర్భ మరియు మరాట్వాడా ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసే అధికారము మహారాష్ట్ర గవర్నర్ ఉంది
- గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రమరియు కుచ్ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.
- రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడము
- రాష్ట రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పాలన కొనసాగించలేనప్పుడు రాష్ట్రపతి పాలన విధించమని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడము (ప్రకరణ 356)
- రాష్ట్ర శాసన సభ సభ రూపొందించిన బిల్లులను తన ఆమోదానికి వచ్చినప్పుడు, ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. (ప్రకరణ 201)
గవర్నర్ పదవి - ప్రత్యేక రక్షణలు (ప్రకరణ 361)
- 361(1) ప్రకారం, భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్‌లు తమ అధికార విధుల నిర్వహణలో వ్యవహరించిన తీరును ఏ న్యాయస్థానంలోను ప్రశ్నించరాదు.
- 361(2) ప్రకారం, రాష్ట్రపతి లేదా గవర్నర్ తమ పదవిలో ఉన్నంతకాలం ఏ కోర్టులోను వారికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ కేసులను, ప్రాసీడింగ్‌లను ప్రారంభించరాదు, కొనసాగించరాదు.
గవర్నరు పాత్ర
- గవర్నరు పదవి కేంద్రంలోని రాష్ట్రపతి స్థానాన్ని పోలి ఉంటుంది. భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్రములో రాజ్యాంగపరమైన అధిపతిగారెండు సున్నితమైన, క్లిష్టమైన పాత్రలను నిర్వహిస్తాడు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు పాటించేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని పరిపాలనా అదేశాలు, నియామకాలు గవర్నరు పేరుతోనే జరుగుతాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి సలహామేరకు సందర్భానుసారం గవర్నరు తన విచక్షణాధికారాలను వినియోగించి నిర్ణయాలను తీసుకునే అధికారం రాజ్యాంగంలో పొందుపరిచారు.
- అయిత్తే గవర్నర్ల నియామకం, వారి పాత్ర, వ్యవహారశైలి, ఎన్నో విమర్శలకు గురికావడం లేదా వివాదం కావడం తరచుగా జరుగుతోంది. రాజ్యాంగపరంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దుచేయడం, రాజకీయ అవసరాల కోసం గవర్నరు పదవిని, దాని ఔన్నత్యాన్ని దుర్వినియోగం చేయడం అనేది తరచుగా జరుగుతోంది. గవర్నరు పదవిని రాజకీయాలకు అతీతంగా, సమాఖ్య స్పూర్తికి అనుగుణంగా లౌకిక దృక్పథం, మానవతా విలువలు మరియు జాతీయ సమైక్యతా స్ఫూర్తి వం టి ఉత్తమ లక్షణాల ప్రాతిపదికపైన నిర్వర్తించాలని, ఆ పదవికి గల ఔన్నత్యానికి, రాజ్యాంగ స్ఫూర్తి భంగం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుందని 1994లో ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
- 'గవర్నర్ పదవి బంగారు పంజరం లో చిలుక' గా శ్రీమతి పద్మజ నాయుడు అభివర్ణించారు.