క్యాబినెట్‌ కమిటీలు

TSStudies
0

క్యాబినెట్‌ కమిటీలు (Cabinet Committees)

  • క్యాబినెట్‌ యొక్క పని భారాన్ని తగ్గించడానికి, సంబంధిత విషయాలపైన నిరంతరం పర్యవేక్షణ కొనసాగించడానికి వీలుగా క్యాబినెట్‌ మంత్రులతో కూడిన కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటికి రాజ్యాంగ బద్ధత లేదు. పార్లమెంటు వ్యవహారాల నియమం ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిని ప్రధాన మంత్రి ఏర్పాటు చేస్తారు. ఇది రెండు రకాలుగా ఉంటాయి.

తాత్కాలిక కమిటీలు మరియు స్థాయి కమిటీలు.

  • తాత్కాలిక కమిటీలను ప్రత్యేక సమస్యలున్నప్పుడు ఏర్పాటు చేస్తారు. ఆ సమస్యపై నివేదిక రాగానే ఇవి రద్దు అవుతాయి. ఒక్కొక్క కమిటీలో ముగ్గురు నుండి ఎనిమిది మంది సభ్యులుంటారు. సాధారణంగా క్యాబినెట్‌ మంత్రులుంటారు. కొన్ని సమయాలలో సహాయ మంత్రులను కూడా తీసుకోవచ్చు. ఈ కమిటీలకు క్యాబినెట్‌ మంత్రులే ఛైర్మన్‌లుగా ఉంటారు. అయితే, ముఖ్యమైన కమిటీలకు ప్రధాన మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు.
  • ప్రస్తుతం పది క్యాబినెట్‌ కమిటీలు ఉన్నాయి. అయితే వీటి సంఖ్య ఆయా ప్రభుత్వాల ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది.

    1. రాజకీయ వ్యవహారాల కమిటీ
    2. ఆర్థిక వ్యవహారాల కమిటీ
    3. నియామకాల కమిటీ
    4. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
    5. రక్షణ వ్యవహారాల కమిటీ
    6. ప్రపంచ వాణిజ్య సంస్థ కమిటీ
    7. పెట్టుబడుల కమిటీ
    8. ఆధార్‌ వ్యవహారాల కమిటీ
    9. ధరలపై కమిటీ
    10. వసతులపై కమిటీ

  • రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, నియామకాలు, ధరలు కమిటీలకు ప్రధాన మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. 
  • వసతుల కమిటీకి కేంద్ర హోంమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • అత్యంత ముఖ్యమైన కమిటీ - రాజకీయ వ్యవహారాల కమిటీ. దీనిని “సూపర్‌ క్యాబినెట్‌”గా వ్యవహరిస్తారు.
  • రాజకీయ వ్యవహారాల కమిటీ జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలను పరిశీలిస్తుంది.
  • అత్యున్నత స్థాయిలో నియామకాలకు సంబంధించి నియామకాల కమిటీ ముఖ్యంగా కేంద్ర సచివాలయం, సెక్రటేరియట్‌, వివిధ ఛైర్మన్‌లు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అధిపతుల నియమాకాలను పరిశీలిస్తుంది.

గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ (Group of Ministers)

  • ప్రభుత్వం యొక్క రోజువారీ వ్యవహారాలను ఇతర ప్రజా సమస్యలను పరిశీలించడానికి గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ను నియమిస్తారు. వీరు క్యాబినెట్‌ కమిటీలకు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సమయాల్లో క్యాబినెట్‌ తరపున కొన్ని నిర్ణయాలు చేస్తారు. గత రెండు దశాబ్దాల కాలంగా గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ప్రాముఖ్యత పెరుగుతోంది.
  • ఇందులో సంబంధిత శాఖా మంత్రి మరియు ఇతర మంత్రులు సభ్యులుగా ఉంటారు. వీటి సంఖ్య కూడా ప్రభుత్వాలను బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 21 గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఉన్నాయి.

మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు (Ministers and Department)

  • ప్రకరణ 77 ప్రకారం, రాష్ట్రపతి 1961లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధులను కేటాయించడానికి సంబంధించి నియమాలను రూపొందించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాలు అనేవి ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.
  • ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధిత మంత్రి రాజకీయ అధిపతిగా (Political Head) ఉంటారు. అలాగే పరిపాలన అధిపతులుగా (Administrative Head) సెక్రటరీ లేక కార్యదర్శి ఉంటారు.

ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వంలో 58 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతుంటుంది. కొన్ని మంత్రిత్వ శాఖలలో ప్రత్యేక విభాగాలు కూడా ఉంటాయి.

  • వ్యవసాయ మంత్రిత్వ శాఖ
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఆండ్‌ కో-ఆపరేషన్
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసర్చ్‌ & ఎడ్యుకేషన్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఆనిమల్‌ హజ్‌బెండ్రి, డైరీ & ఫిషరీస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ కెమికల్స్‌ & ఫర్టిలైజర్స్‌ .
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కెమికల్స్‌ & పెట్రో-కెమికల్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫర్టిలైజర్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌
  • మినిస్టి ఆఫ్‌ కోల్‌
  • మినిస్టి ఆఫ్‌ కామర్స్‌ & ఇండస్ట్రీ
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కామర్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ & ప్రమోషన్‌
  • మినిస్ట్రి ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ & ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎలక్రానిక్స్‌ & ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ
  • మినిస్ట్రీ ఆఫ్‌ కన్‌స్యూమర్‌ ఎఫైర్స్‌, ఫుడ్‌ & పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కన్‌స్యూమర్‌ ఎఫైర్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పుడ్‌ & పబ్లిక్‌ డిస్టిబ్యూషన్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ కార్పోరేట్‌ ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసర్చ్‌ & డెవలప్‌మెంట్‌
    • డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ వెల్‌ఫేర్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్ట్రన్‌ రీజియన్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ & సానిటేషన్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ & ఫారెస్ట్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టెర్‌నల్‌ ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండీచర్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ & ఫామిలీ వెల్‌ఫేర్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ & ఫామిలీ వెల్‌ఫేర్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఆయుర్వేద, యోగ & న్యూరోపతి, యునాని, సిద్ధ & హోమియోపతి (AYUSH)
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసర్చ్‌
    • డిపార్టుమెంట్‌ ఆప్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ & పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ హోమ్‌ ఎఫైర్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇంటర్‌నల్‌ సెక్యూరిటీ
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అఫిషియల్‌ లాంగ్వేజ్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోం
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ బార్దర్‌ మేనేజిమెంట్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సస్‌ డెవలప్‌మెంట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ & లిటరసీ
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ & బ్రాడ్‌క్యాస్టింగ్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ & ఎంప్లాయిమెంట్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌లా & జస్టిస్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ లీగల్‌ ఎఫైర్స్‌
    • లెజిస్‌లేటివ్‌ డిపార్టుమెంట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ & మీడియం ఎంటర్‌ప్రైజెస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ మైనారిటి ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ & రిన్యూవబుల్‌ ఎనర్జీ
  • మినిస్ట్రి ఆఫ్‌ ఓవర్‌సీస్‌ ఇండియన్‌ ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ పంచాయత్‌రాజ్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ పార్లమెంటరీ ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ & పెన్నన్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ & టైనింగ్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్‌ & పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పెన్నన్స్‌ & పెన్ననర్స్‌ వెల్‌ఫేర్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ పెట్రోలియం & న్యాచురల్‌ గ్యాస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ప్లానింగ్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ రైల్వేస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ & హైవేస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రిసోర్సస్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్‌ & టెక్నాలజీ
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ & టెక్నాలజి
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ & ఇండస్ట్రియల్‌ రీసర్చ్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ బయో-టెక్నాలజీ నవస
  • మినిస్ట్రీ ఆఫ్‌ షిప్పింగ్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ & ఎంపవర్‌మెంట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ & ఎంపవర్‌మెంట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిసెబిలిటి ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ & ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ స్టీల్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం
  • మినిస్ట్రీ ఆఫ్‌ ట్రిబ్యునల్‌ ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ ఎఫైర్స్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ హొసింగ్‌ & అర్భన్‌ పావర్టీ ఎలివియేషన్‌
  • మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సస్‌
  • మినిస్ట్రి ఆఫ్‌ విమెన్‌ & చైల్డ్‌ డెవలప్‌మెంట్‌
  • మినిస్ట్రి ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌ & స్పోర్ట్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌
    • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌
  • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎటామిక్‌ ఎనర్జీ
  • డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్పేస్‌
  • కాబినెట్‌ సెక్రటేరియట్‌
  • ప్రెసిడెంట్స్‌ సెక్రటేరియట్‌
  • ప్రైమ్ మినిస్టర్స్‌ ఆఫీస్‌
  • ప్లానింగ్‌ కమీషన్‌ (నీతి ఆయోగ్‌)


Ministries

Apex/Independent Offices

Central Government (Independent Departments)

Judiciary

Post a Comment

0Comments

Post a Comment (0)