కేంద్ర మంత్రి మండలి

TSStudies
0

కేంద్ర మంత్రి మండలి (Council of Minister)

  • ప్రకరణ 74(1) ప్రకారం, భారత రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సహాయ, సలహాలను అందించడానికి ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది. మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి తన విధులను నిర్వర్తిస్తాడు.
  • ప్రకరణ 74(2) ప్రకారం, మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాల గురించి ఏ న్యాయస్థానాలలో కూడా ప్రశ్నించరాదు.

ప్రత్యేక వివరణ :

  • ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి ఇచ్చిన సలహాలను తప్పనిసరిగా పాటించాలా లేదా తన విచక్షణాధికారాన్ని వినియోగించవచ్చా అనే అంశంపై మౌలిక రాజ్యాంగంలో స్పష్టత లేదు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి. ఇదే విషయాన్ని మొట్టమొదటి రాష్ట్రపతి డా॥ రాజేంద్రప్రసాద్‌ ఇండియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌లో తన ప్రసంగంలో పేర్కొంటూ, రాజ్యాంగంలో మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని అర్ధం వచ్చే నిబంధన ఏదీ లేదని అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు తీర్పులు

  • 1955లో రామ్‌ జయలీ Vs పంజాబ్‌ కేసులో మంత్రి మండలి సలహాకు అనుగుణంగానే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదే అభిప్రాయాన్ని రావ్‌ Vs ఇందిరా (1971) అలాగే షంషేర్‌ సింగ్‌ Vs5 పంజాబ్‌ (1974) కేసుల్లో కూడా పునరుద్ఘాటించింది.
  • పైన ఉదహరించిన సందిగ్ధత 1976లో, 42వ రాజ్యాంగ సవరణ తర్వాత తొలగిపోయింది. ఈ సవరణ ప్రకారం, ప్రకరణ 74కు "Shall" అనే పదాన్ని చేర్చారు. (President shall act in accordance with advice of council minsters) దీనితో, మంత్రి మండలి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలనే నిబంధన రూఢీ అయ్యింది.
  • అయితే, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక సారి ప్రకరణ 74ను సవరించారు. రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బిల్లులను, ప్రతిపాదనలను రాష్ట్రపతి మంత్రిమండలి పునఃపరిశీనకు పంపవచ్చు. అలా పంపితే, మంత్రిమండలి వాటిని పునఃపరిశీలించవచ్చు లేదా యధాతథంగా రాష్ట్రపతి ఆమోదానికి తిరిగి పంపవచ్చు. ఈ పర్యాయం రాష్ట్రపతి తప్పని సరిగా తన ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. పై రెండు రాజ్యాంగసవరణల తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి మధ్య ఈ సంబంధం స్పష్టీకరించబడింది. మంత్రి మండలి నిర్ణయానికనుగుణంగా రాష్ట్రపతి వ్యవహరించాలా లేదా అను ప్రశ్నే తలెత్తదు. రాష్ట్రపతి తప్పనిసరిగా మంత్రిమండలి నిర్ణయాన్ని పాటించాల్సి ఉంటుంది.

మంత్రుల రకాలు - మంత్రి మండలి సంఖ్య

  • ప్రకరణ 75 ప్రకారం, ప్రధాని సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. మంత్రిమండలి సంఖ్య గురించి కాని, మంత్రుల వర్గీకరణ గురించి గానీ, మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. అయితే 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సంఖ్యను నిర్ణయించడం జరిగింది. ఈ సవరణ ప్రకారం, కేంద్రంలోని మంత్రి మండలి సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యులలో 15 శాతానికి మించరాదు అనే గరిష్ట పరిమితిని విధించారు. అనగా లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 545 కనుక, కేంద్ర మంత్రిమండలి సంఖ్య 82కు మించరాదు.

మంత్రులు - రకాలు |

  • 1949లో గోపాలస్వామి అయ్యంగార్‌ సిఫారసులమేరకు, మంత్రులను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన వర్గీకరణ మాత్రమే. దీనికి రాజ్యాంగబద్ధత లేదు.
            1. క్యాబినెట్‌ మంత్రులు 2. స్టేట్‌ మంత్రులు 3. డిప్యూటీ మంత్రులు

క్యాబినెట్‌ మంత్రులు

  • క్యాబినెట్‌ అనే పదాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 352లో చేర్చారు కాని మంత్రి మండలిని గురించి వివరణ ప్రకరణ 75లో లేదు. క్యాబినెట్‌ మంత్రులు తమ మంత్రిత్వ శాఖకు అధిపతులుగా స్వతహాగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రాముఖ్యత గల శాఖలైన రక్షణ, ఆర్ధిక, హోం, రైల్వే, వ్యవసాయం మొదలగు వాటికి క్యాబినెట్‌ మంత్రులుంటారు. అన్ని ముఖ్య నిర్ణయాలు ప్రధాన మంత్రి నేతృత్వంలో క్యాబినెట్‌ తీసుకుంటుంది. క్యాబినెట్‌కు కేంద్ర మంత్రి మండలిలో చాలా విలువ ఉంటుంది. వారానికి ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది.
  • అంతరంగిక క్యాబినెట్‌ (Inner Cabinet): క్యాబినెట్‌ మంత్రుల్లో అతిముఖ్యమైనవారు, ప్రధాన మంత్రితో సన్నిహితంగా మెలిగేవారు చాలా తక్కువ క్యాబినెట్‌ మంత్రులు ఉంటారు. వీరు ప్రధానితో తరచూ కలుస్తూ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మైఖేల్‌ బ్రెష్పర్‌ అనే రచయిత దీనినే సూపర్‌ క్యాబినెట్‌గా వర్ణించారు.
  • కిచెన్‌ క్యాబినెట్‌ (Kitchen Cabinet): ప్రధాన మంత్రి తన అధికార నిర్వహణ ప్రక్రియలో వారి సమీప బంధువులు, కుటుంబ సభ్యులు కొంత ప్రభావాన్ని చూపుతారు. ఆ వ్యక్తుల సమూవాన్నే కిచెన్‌ క్యాబినెట్‌ అంటారు.
  • షాడో క్యాబినెట్‌ (Shadow Cabinet): పార్లమెంటరీ వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ద్వారా అధికారాన్ని చెలాయిస్తుంది. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి సమాంతరంగా తన ప్రభావాన్ని ప్రజలపైన చూపుతుంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేఅవకాశం ఉన్న బలమైన ప్రతిపక్షం ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిని మంత్రి పదవి చేపట్టే వ్యక్తి పేర్లను ప్రకటిస్తుంది. ఈ పద్ధతిని షాడో క్యాబినెట్‌ అంటారు. ఇది ఇంగ్లాండులో ఆచరణలో ఉంది. భారత్‌లో ఇలాంటి పద్ధతి లేదు. ఐతే 16 & 17 వ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిని (శ్రీ నరేంద్ర మోడీని) ముందుగానే (వకటించింది. ఇలాంటి నందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. పై మూడు క్యాబినెట్‌లు సందర్భాలనుబట్టి వాడుకలో ఉన్నవే కాని వీటికి చట్ట బద్ధత, రాజ్యాంగ బద్ధత లేదు.

స్టేట్‌ మంత్రలు (సహాయ మంత్రులు)

  • కేంద్రంలో కొన్ని శాఖలను స్టేట్‌ మంత్రులు స్వతంత్రంగా నిర్వహిస్తూ, విధి నిర్వహణలో ప్రధానికి నేరుగా జవాబుదారిగా ఉంటారు. మంత్రిత్వ శాఖలోని కొన్ని విభాగాలకు వీరికి ఇండిపెండెంట్‌ ఛార్జ్‌ కూడా ఇవ్వవచ్చు. క్యాబినెట్‌ మంత్రులకు వీరిపై అజమాయిషీ ఉండదు.

డిప్యూటీ మంత్రులు

  • క్యాబినెట్‌ మంత్రులకు సహాయపడేందుకు నియమించబడిన మంత్రులను డిప్యూటి మంత్రులంటారు. వీరికి ఎలాంటి స్వతంత్ర్య ప్రతిపత్తి ఉండదు. ప్రస్తుతము డిప్యూటీ మంత్రులను నియమించటం లేదు.

పార్లమెంటరీ కార్యదర్శులు

  • వీరినే Minister Under Training అంటారు. వీరు సహాయకారులుగా పనిచేస్తారు. వీరు మంత్రి మండలిలో అంతర్భాగమే. కాని ప్రస్తుతం ఈ పద్ధతిని పాటించడం లేదు.

క్యాబినెట్‌ ప్రాముఖ్యత

  • కేంద్ర మండలిలో క్యాబినెట్‌కు అత్యంత ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆధునిక కాలంలో క్యాబినెట్‌ ప్రాముఖ్యతను, అధికారాన్ని వర్ణించడానికి “క్యాబినెట్‌ నియంతృత్వం” (Cabinet Dictatorship) అనే పదాన్ని కూడా వాడుతున్నారు.

క్యాబినెట్‌ - ముఖ్య విధులు

  • దేశంలో అత్యున్నతమైన నిర్ణాయక మండలి.
  • కేంద్ర ప్రభుత్వంలో అన్ని నియామకాలు, పథకాలు, క్యాబినెట్‌ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి.
  • రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సలహాలిస్తుంది. వీటిని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి.
  • పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి వాటిని ఆమోదించే విధంగా చర్యలు తీసుకుంటుంది.
  • విదేశాంగ విధానం, అంతర్జాతీయ ఒప్పందాలలో క్యాబినెట్‌దే తుది నిర్ణయం.

మంత్రి మండలి సంయుక్త బాధ్యత మరియు వ్యక్తిగత బాధ్యత (Collective & Individual Resoibsibility) 

  • పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క అత్యంత ముఖ్య లక్షణం సంయుక్త బాధ్యత. ప్రకరణ-75 ప్రకారం, మంత్రులందరూ సంయుక్తంగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. అనగా లోక్‌సభ విశ్వాసం ఉన్నంతవరకే వారు పదవిలో కొనసాగుతారు. వారు చేసిన తప్పొప్పులకు లోక్‌సభ ద్వారా ప్రజలకు బాధ్యత వహిస్తారు. మంత్రి మండలిలో ఒక మంత్రిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి మంత్రులందరు కట్టుబడాలి. మంత్రి మండలి తమ నిర్ణయాలను, రహస్యాలను బహిరంగపర్చరాదు. మంత్రి మండలి నిర్ణయాన్ని విభేదించే మంత్రి సాధారణంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. 1953లో డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ హిందూ కోడ్‌ బిల్లుల విషయంలో ప్రభుత్వంతో విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

వ్యక్తిగత బాధ్యత

  • ప్రకటన 75 ప్రకారము, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే కేంద్రమంత్రి అధికారంలో ఉంటాడు. విశ్వాసం కోల్పోయిన మంత్రిని రాష్ట్రపతి తొలగించవచ్చు. సాధారణంగా ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి మంత్రులను తొలగిస్తాడు. ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలితో విభేదించే ఏ మంత్రినైనా రాజీనామా చేయమని ప్రధాని కోరవచ్చు. ఆ విధంగా ప్రధాన మంత్రి మంత్రుల వ్యక్తిగత బాధ్యత, సంయుక్త బాధ్యతను నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకుంటారు.

చట్టపర బాధ్యత (Legal Responsibility)

  • భారతదేశ రాజ్యాంగంలో చట్టపర బాధ్యత ప్రస్తావించలేదు. చట్టపర బాధ్యత అనగా, ఇంగ్లాండులో రాజు లేదా రాణి జారీ చేసిన ఆదేశంపైన సంబంధిత మంత్రి కౌంటర్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆదేశం ఉల్లంఘించబడితే సంబంధిత మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజు లేదా రాణి దానికి బాధ్యత కాదు. అందుకే ఇంగ్లాండులో ఒక నానుడి అమలు ఉంది. “రాజు లేదా రాణి ఏ తప్పు చేయరు” (The king can do no wrong)
  • భారత్‌లో ఇలాంటి ఏర్పాటు లేదు. రాష్ట్రపతి జారీచేసిన ఆదేశం పైన మంత్రులు కౌంటర్‌ సంతకం చేయాల్సిన అవసరం లేదు. అలాగే రాష్ట్రపతికి మంత్రిమండలి ఏ సలహా ఇచ్చారనే అనే అంశాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు.

క్యాబినెట్‌ పాత్రపై ప్రముఖుల అభిప్రాయాలు

  • క్యాబినెట్‌ అనేది కార్య నిర్వాహక శాఖ, శాసన శాఖ వివాదాలను కలిపే ఒక వారధి, అలాగే పట్టి ఉంచే రింగులాంటిది- బేగ్‌ హార్ట్‌
  • ప్రభుత్వం అనే నావకు క్యాబినెట్‌ అనేది స్టీరింగ్‌ వీల్‌ లాంటిది.- రామసే మ్యూర్‌
  • క్యాబినెట్‌ అనేది ప్రభుత్వానికి మూల స్థంభం- లోవెల్‌
  • క్యాబినెట్‌ అనేది ప్రభుత్వ విధానాలకు అయస్కాంతం లాంటిది- గ్లాడ్‌స్టోన్‌


Post a Comment

0Comments

Post a Comment (0)