సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం:
19 శతాబ్ధ ఆరంభంలో భారతదేశంలో అనేక మూఢవిశ్వాసాలు, దురాచారాలు ఉండేవి.
ఉదా: సతీసహగమనం, బాల్యవివాహాలు, విగ్రహారాధన, వితంతు వివాహాలు లేకపోవుట.
ఈ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చుటకు చేసిన ఉద్యమాలను సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు అంటారు.
ఈ ఉద్యమాలను చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి - రాజారామ్మోహన్‌రాయ్
రాజారామ్మోహన్‌రాయ్:
రాజారామ్మోహన్‌రాయ్ బెంగాల్‌లోని రాధా నగరంలో జన్మించాడు. తండ్రి రమాకాంత్ రాయ్
1833 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్‌లోని బ్రిస్తాల్ (స్టేపల్‌టన్)లో మరణించాడు.
బిరుదులు :
1) రాజా (మొగలు చక్రవర్తి 2వ అక్బర్ ఇచ్చాడు)
2) ఆధునిక భారతదేశ పితామహ
3) పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా
వార్తాపత్రికలు :
1. మిరాత్-ఉల్-అక్బర్ (పర్షియా)
2. సంవాద కౌముది (బెంగాలీ)
3. బంగదూత
పుస్తకాలు:
1. గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ (పర్షియా)
2. Precepts of Jesus
3. Guide to Piece and Happiness
సంస్థలు:
1 ఆత్మీయ సభ (1815)
2 బ్రహ్మసమాజ్ (1828) (మొదట్లో దీనిపేరు బ్రహ్మసభ)
రామ్మోహన్‌రాయ్ అత్యధికంగా సతీసహగమనంనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇతని పోరాట ఫలితంగా బ్రిటీష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ 1829లో సతీసహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు.
ఇతను ఏకేశ్వరోపాసనను బోధించాడు.
విగ్రహారాధనను ఖండించాడు.
మహిళా విద్యను, పాలనలో మహిళలు పాల్గొనుటను, ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు.
బాల్య వివాహాలను ఖండించాడు
ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించుట కొరకై బ్రహ్మసమాజంలో తరచూ సమావేశాలు జరిగేవి. అందువలనే బ్రహ్మసమాజ్‌ను ఏకభగవానుని సమాజం అంటారు.
బ్రహ్మ సమాజ్‌కు వ్యతిరేకంగా రాధాకాంత్ 'దేబోధర్మసభ' ను 1829లో స్థాపించాడు.
తన విదేశీ స్నేహితులైన అలెగ్జాండర్ డఫ్ (స్కాటిష్ మిషనరీ సభ్యుడు) డేవిడ్ హ్యరే (డచ్ వాచీ తయారీదారుడు)లను ప్రోత్సహించి బెంగాల్‌లో అనేక అంగ్ల కళాశాలలను స్థాపించాడు.
ఉదా: 1817-హిందూ కళాశాల, 1825-వేదాంత కళాశాల
భారత నమాజంలో పాశ్చాత్య భావాలను పెంపొందించుటకు ప్రయత్నించాడు.
వేదాలు, ఉపనిషత్తులు ఏకేశ్వరోపాసనను గురించి మాత్రమే చెబుతున్నాయని పేర్కొంటూ కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి అనువదించి తన వార్తా పత్రికలో ప్రచురించాడు.
రాజారామ్మోహనరాయ్ సామ్రాజ్యవాద వ్యతిరేకి.
ఉదా: 1821లో నేపూల్స్ తిరుగుబాటు విఫలమవడంతో తన సమావేశాలను రద్దు చేసుకొని ఒక రోజు ఉపవాసంను పాటించాడు.
1828లో దక్షిణ అమెరికాలో స్పానిష్ తిరుగుబాటు విజయవంతం కావడంతో ప్రజావిందును ఇచ్చాడు. రాజారామ్మోహనరాయ్ లండన్‌ను సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు.
ఇతను 12 భాషల కంటే ఎక్కువ భాషలలో ప్రావీణ్యం గలవాడు.