మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం (1815-46):
గవర్నర్ జనరల్ - 1వ హార్టింజ్
1844 లో బలహీనమైన పంజాబ్‌ను ఆక్రమించుటకు బ్రిటీష్ నిర్ణయించిరి. సట్లెజ్ నది దాటి పంజాబ్‌పై దాడి చేశారు. దీంతో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ప్రారంభమైంది.
మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో మొత్తం 5 యుద్దాలు జరిగాయి. (ఈ యుద్దాలలో పాల్గొన్న బ్రిటీష్ జనరల్- గాఫ్)
1) ముడ్కి యుద్ధం
2) ఫిరోజా యుద్ధం
3) బుద్దేవాల్ యుద్ధం
4) ఆలీవాల్ యుద్ధం
5) సోబ్రాన్ యుద్ధం (తుపాకుల యుద్ధం)
సోబ్రాన్ యుద్ధంలో కొన్ని వందల మంది సిక్కులు వధించబడ్డారు. ఈ యుద్ధం తర్వాత సిక్కులు తమ పరాజయాన్ని అంగీకరించారు.
1846లో లాహోర్ ఒప్పందంతో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అంతమైంది. ఈ ఒప్పందంలోని అంశాలు :
1) కోహినూర్ వజ్రం బ్రిటీష్ వారికి ఇవ్వబడింది.
2) 1.5 కోట్లు బ్రిటీషు వారికి ఇచ్చుటకు పంజాబ్ అంగీకరించింది.
3) కాశ్మీర్ బ్రిటీష్‌కు ఇవ్వబడింది. (బ్రిటీష్ వారు తర్వాత కాలంలో కాళ్మీర్‌ను 50 లక్షల రూపాయలకు గులాబ్‌సింగ్‌కు అమ్మివేశారు)
4) సట్లేజ్ నది రావి నది మధ్య ఉన్న భూభాగం బ్రిటీష్‌కు ఇవ్వబడింది.
లాహోర్ ఒప్పందానికి కొన్ని మార్పులు చేస్తూ భైరోవల్ అనే ఒప్పందం చేయబడినది.
ఈ ఒప్పందం ప్రకారం పంజాబ్ ను పాలించుటకు 8 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ అఫ్ రీజెన్సీ ఏర్పాటుచేయబడింది. దీనికి మొదటి అధ్యక్షుడు హెన్రీ లారెన్స్.
2వ ఆంగ్లో సిక్కు యుద్ధం (1848-49):
గవర్నర్ జనరల్ - డల్హౌసీ
1848లో లాహోర్‌లో చిత్తూర్‌సింగ్, ముల్తాన్‌లో మూల్‌రాజ్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీంతో అవ్పటి గవర్నర్ జనరల్ డల్హౌసీ ఈ తిరుగుబాటులను అణిచివేయుటకు పంజాబ్‌పై యుద్ధం ప్రకటించి శ్యాన్ ఆండ్రూస్ అనే జనరల్‌ను పంజాబ్‌పైకి పంపాడు.
శాన్ ఆండ్రూస్ లాహోర్, ముల్తాన్‌లలో తిరుగుబాట్లను అణిచివేసి సిక్కు మధద్దతుదారులను రామ్‌నగర్, చిలియన్‌వాలా, గుజరాత్ యుద్ధాలలో ఓడించాడు ఈ యుద్ధాల తర్వాత పంజాబ్ పూర్తిగా బ్రిటీష్ ఆధీనంలోకి వచ్చింది.
అవధ్ ఆక్రమణ (1856) :
గవర్నర్ జనరల్ - డల్హౌసీ
అవధ్ రాజ్యాన్ని స్తాపించినవాడు - సాదత్ అలీ
1856లో వాజిద్ అలీషా తప్పుడు పాలన (Maladministration) చేస్తున్నాడనే నెపంతో బ్రిటీష్ గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ డల్హౌసీ అవధ్‌ను ఆక్రమించాడు.