1857 తిరుగుబాటు-1

TSStudies

1857 తిరుగుబాటు(సిఫాయిల తిరుగుబాటు):

The Causes of Indian Mutiny,The Sepoy Mutiny & The Revolt of 1857,1857 The Great Revolution,The History of Sepoy War in India,History of Indian Mutiny,Indian Mutiny of 1857,1857 mutiny,Mutiny of 1857,causes of 1857 mutiny,books on 1857 mutiny,1857 mutiny notes in telugu,1857 mutiny study material in telugu,Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq1857 తిరుగుబాటుకు తక్షణ కారణము - ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలు. ఈ తూటాలను ఎన్‌ఫీల్డ్‌ తుపాకులలో ఉపయోగిస్తారు.
1857 మార్చి నెలలో పశ్చిమ బెంగాల్‌లోని బరక్‌పూర్‌ రెజిమెంట్‌కి చెందిన మంగళ్‌పాండే ఈ తూటాలను ఉపయోగించుటకు నిరాకరించి తన పై అధికారి అయిన బాగ్‌ను కాల్చి చంపాడు.
మంగళ్‌పాండేను అరెస్ట్  చేయుటకు జందరి ఈశ్వరీపాండే అనే సైనికుడు నిరాకరించాడు. దీంతో మంగళ్‌పాండే, ఈశ్వరీపాండేలు ఉరితీయబడ్డారు.
1857 ఏప్రిల్‌ నెలలో మీరట్‌ రెజిమెంట్‌కు చెందిన 90 మంది సిపాయిలు ఈ తూటాలను ఉపయోగించుటకు నిరాకరించారు. వీరిలో 85 మందికి 10 సం॥ల జైలుశిక్ష విధిస్తూ ఉద్యోగాల నుంచి తొలగించారు.
1857 మే 8వ తేదీన మీరట్‌లోని ఒక సంతలో మీరట్‌
రెజివెంట్‌ సిపాయిలు కొంతమంది మహిళలచే దూషించబడ్డారు. దీంతో ప్రభావితమై మీరట్‌ సిపాయిలు బిటీష్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుటకు నిర్ణయించారు.
1857 మే 10వ తేదీన మీరట్‌ రెజిమెంట్‌ సిపాయిలు తమ 85 మంది సహోద్యోగులను విడిపించి బ్రిటీష్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటించి ఢిల్లీ వైపుగా పయనించారు.
మే 11వ తేదీన ఢిల్లీ చేరుకొని ఎర్రకోటలోని బ్రిటీష్‌ రెసిడెంట్‌ అధికారి అయిన సైమన్‌ రిప్లీ, ఇతర ఆంగ్లేయులను వధించి మొగల్‌ చక్రవర్తి అయిన 2వ బహదూర్‌షాను 'షహన్‌షా-ఇ-హిందుస్తాన్‌' (భారతదేశ చక్రవర్తిగా) ప్రకటించారు.
2వ బహదూర్‌షా సహాయమును అర్ధిస్తూ భారతదేశంలోని సంస్థానాలకు ఉత్తరాలు రాశారు.

ఢిల్లీ:
తిరుగుబాటుదారుడు -బక్తఖాన్‌
అణచివేసినవాడు - హడ్సన్‌
ఢిల్లీలో తిరుగుబాటును అణచివేయుటకై జనరల్‌ నికోల్సన్‌ పంపబడ్డాడు. కానీ ఇతను చంపబడ్డాడు.
జనరల్‌ హడ్సన్ ఢిల్లీలో తిరుగుబాటును అణచివేసిన తర్వాత 2వ బహదూర్‌షా భార్య జీనత్‌ మహల్‌ను, అతని కుమారులను (జీవన్‌భక్త్‌ మినహాయించి) హత్య చేశాడు.
2వ బహదూర్‌షా మరియు జీవన్‌భక్త్‌ రంగూన్‌కు (బర్మా రాజధాని) పంపబడ్డారు.
1862లో 2వ బహదూర్‌షా రంగూన్‌లో మరణించాడు.

కాన్సూర్‌ :
తిరుగుబాటుదారులు - నానాసాహెబ్‌ (అసలు పేరు-ధోండూ పండిత్‌, చివరి పీష్వా 2వ బాజీరావు యొక్క-
దత్తత కుమారుడు), తాంతియాతోపి, అజీముల్లా
అణచివేసినవాడు - క్యాంప్‌బెల్‌
కాన్పూర్‌లో నానాసాహెబ్‌, అతని ఇద్దరు జనరల్స్‌ అయిన తాంతియాతోపి, అజీముల్లా తిరుగుబాటు చేశారు.
అలహాబాద్‌లోని ఒక భవంతిలో ఉన్న 400 మంది ఆంగ్లేయులను నానాసాహెబ్‌ సైనికులు వధించుట కారణంగా ఈ తిరుగుబాటు తీవ్ర రూపమును దాల్చింది.
బ్రిటీష్‌ ప్రభుత్వం జనరల్‌ క్యాంప్‌బెల్‌ను కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా భారతదేశానికి పంపింది.
జనరల్‌ క్యాంప్‌బెల్‌ గోర్ఖా సైనికుల సహాయంతో కాన్సూర్‌లో తిరుగుబాటును అణచివేశారు.
నానాసాహెబ్‌ నేపాల్‌కు పారిపోయాడు
తాంతియాతోపి మధ్య భారతదేశ అడవులకు పారిపోయి గెరిల్లా యుద్ధం ద్వారా బ్రిటీష్‌ వారిని ప్రతిఘటించాడు.
ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతుగా తాంతియా తోపి సైనికులను పంపించాడు.
తన జమీందారీ స్నేహితుడు మాన్‌సింగ్‌ యొక్క నమ్మకద్రోహంచే తాంతియాతోపి బ్రిటీష్‌ వారికి పట్టుబడ్డాడు. తక్షణమే ఉరితీయబడ్డాడు.
తాంతియాతోపె అసలు పేరు -రామచంద్ర పాండురంగ