లక్నో / అవధ్ :
అణచివేసినది - క్యాంప్‌బెల్
బేగం హజత్ మహల్ తన కుమారుడు బిల్జిస్ ఖాదిర్‌ను అవధ్ పాలకుడిగా పేర్కొని బ్రిటీష్‌పై తిరుగుబాటును ప్రకటించింది.
ఈ తిరుగుబాటులో హజ్రత్ మహల్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభ్యమైనది.
జనరల్ హెన్రీ లారెన్స్ అవధ్‌లో చంపబడ్డాడు.
తర్వాత లక్నోలోని తిరుగుబాటును అణచివేయుటకు జనరల్ ఇంగ్లీస్, హేవలాక్, జేట్రమ్, నీల్ మొదలగువారు అవధ్‌కు చేరుకున్నారు, కానీ విఫలమయ్యారు.
చివరిగా జనరల్ క్యాంవ్‌బెట్ లక్నో/అవధథ్‌లోని తిరుగుబాటును అణచి వేశాడు.
ఝాన్సీ:
తిరుగుబాటుదారు - లక్ష్మీబాయ్
అణచివేసినది - జనరల్ హూగ్రోస్
లక్ష్మీబాయ్ శ్రీ గంగాధరరావు యొక్క వితంతువు (లేదా) భార్య
దత్తత కుమారుడు - దామోదర్‌రావు
ఈమె తాంతియాతోపి సైనికులు మరియు ఆఫ్ఘాన్ పఠాన్‌ల సహకారంతో గ్వాలియర్‌ను ఆక్రమించింది.
అర్రా లేదా జగదీష్ పూర్ (బీహార్):
అణచివేసినది - టేలర్, ఐర్
కున్వర్‌సింగ్ 90సం॥లు పైబడిన వృద్ధుడు. ఇతను అర్రా ప్రాంతానికి జమిందార్.
అర్రా జమిందారీ పదవి నుంచి తనను తొలగించారన్న కారణంగా బ్రిటీష్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.
అంగ్లేయులు ఇతనిని అణచివేసి ఇతని సోదరుడు అమర్‌సింగ్‌ను అర్రాకు జమీందారుగా ప్రకటించారు.
ఫైజాబాద్ (ఉత్తరప్రదేశ్):
తిరుగుబాటుదారుడు - మౌల్వీ అహ్మదుల్లా
అణచివేసినది - జగన్నాథ్‌సింగ్ (పుల్వాన్ రాజు)
మౌల్వీ అహ్మదుల్లా మద్రాసు నుంచి వచ్చిబ్రిటీష్‌కు వ్యతిరేకంగా ఫైజాబాద్‌లో తిరుగుబాటు చేశాడు.
పుల్వాన్‌రాజు జగన్నాధ్‌సింగ్ మౌల్వీ అహ్మదుల్లాను అణచివేసి బ్రిటీష్ వారి నుండి రూ.50 వేల రివార్డును పొందాడు.
ఇతర తిరుగుబాటుదార్లు:
మేవత్‌లో ఒక రైతు నసీరుద్దీన్ బ్రిటిష్‌పై తిరుగుబాటు చేశాడు.
మహారాస్ట్రలో రంగ బాపూజీ గుప్త బ్రిటిష్‌పై తిరుగుబాటు చేశాడు.
రంగారావు పాగీ & దిలీప్‌సింగ్‌లు నాందేడ్‌లో తిరుగుబాటు చేశారు.
హైదరాబాద్‌లో తురాబ్‌జ్‌ఖాన్ చిదాఖాన్‌ను విడిపించుటకై రెసిడెన్సీ ఆఫీస్‌పై దాడి చేశాడు.
ఆంధ్రాలోని పర్లాకిమిడిలో రాధాకృష్ణ దండసేనుడు, గోదావరి ఏజెన్సీలో కోరుకొండ సుబ్బారెడ్డి, కడపలో షేక్ పీర్‌సాహెబ్‌లు తిరుగుబాటు చేశారు.