1857 తిరుగుబాటు-3

TSStudies
1857 తిరుగుబాటు విఫలమవడానికి కారణాలు:
1) కేంద్రీకృత నాయకత్వం లేకపోవుట
2) బ్రేక్‌ వాటర్స్‌ (1857 తిరుగుబాటు కాలంలో భారతీయులను ఆంగ్లేయులకు మద్దతు పలికిన అప్పటి గవర్నర్‌ జనరల్‌ కానింగ్‌ బ్రేక్‌ వాటర్స్‌ అని పేర్కొన్నాడు)
3) సమాచార వ్యవస్థ లోపం
4) తిరుగుబాటు కలసికట్టుగా జరగకపోవుట, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండుట
5) అన్ని వర్ణాల వారు పాల్గొనకపోవుట. ప్రధానంగా మేధావి వర్గం దీనిలో పాల్గొనలేదు.
6) భారతీయ సిపాయిలు సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించుట, ఆంగ్లేయులు ఆధునిక ఆయుధాలు ఉపయోగించుట.
7) క్రమశిక్షణ కలిగిన బ్రిటీష్‌ సైన్యం
8) తిరుగుబాటు నాయకుల్లో జాతీయభావాలు లోపించుట

ఫలితం :
1858 చట్టం ప్రకారం బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా పాలన అంతం చేయబడినది.
భారతదేశం బ్రిటీష్‌ సామ్రాజ్యంలో ఒక భాగం అని ప్రకటించబడినది. ఈ విషయాన్ని అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్‌ అలహాబాద్‌ దర్చార్‌ నుండి ప్రకటించాడు.
భారతదేశాన్ని పరిపాలించుటకు 15 మంది సభ్యులతో లండన్‌లో ఒక ఇండియా కౌన్సిల్‌ ఏర్పాటు చేయబడినది. దీనికి అధ్యక్షుడు బ్రిటీష్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్స్‌.
భారతదేశ సాంఘిక సాంప్రదాయాలలో జోక్యం చేసుకోకూడదని బ్రిటీష్‌ వారు నిర్ణయించారు. భారతదేశంలో బ్రిటీష్‌ ‌ సైన్యం పూర్తిగా వునర్‌ వ్యవస్థీకరించబడింది.
కలసికట్టుగా పోరాటం చేయుటకు వ వర్గం నిర్ణయించినది. ఇది తరువాత కాలంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటుకు తోడ్పడినది.
1857 తిరుగుబాటుకు ప్రధాన కారణము ముస్లింలు అని భావించి బ్రిటీష్‌వారు ముస్లిం వ్యతిరేక విధానాలను చేపట్టారు.
భారతదేశంలో బ్రిటీష్‌ సైన్యం పునర్‌వ్యవస్థీకరించబడింది.

స్టేట్‌మెంట్స్‌:
భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం - వి.డి.సావర్కర్‌ (వినాయక్‌ దామోదర్‌), కారల్‌ మార్క్స్‌
దీనికి విరుద్ధంగా ఆర్‌.సి. మజుందార్‌ దీన్ని ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం కాదు అని పేర్కొన్నాడు.
సిపాయిల తిరుగుబాటు - సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌, చార్లెస్‌ రేక్‌
ముస్లింల తిరుగుబాటు -కుప్లాండ్‌, రాబర్ట్స్‌
జహిందూ ముస్తింల తిరుగుబాటు - కాయే, మాలీసన్‌, టేలర్‌
నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం -కాయే
అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం -హోమ్స్‌
సాంప్రదాయ శక్తులు క్రీస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం - రీస్‌
జాతీయ తిరుగుబాటు -డిజ్రాయిలీ

1857 తిరుగుబాటుపై పుస్తకాలు:
1. The Causes of Indian Mutiny - సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌
2. ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం-వి.డి. సావర్కర్‌
3. The Sepoy Mutiny & The Revolt of 1857  -ఆర్‌.సి. మజుందార్‌
4. 1857 The Great Revolution -అశోక్‌ మెహతా
5. జాఫర్‌ -బహదూర్‌ షా జాఫర్‌
6. The History of Sepoy War in India -కాయే
7. History of Indian Mutiny -టి. ఆర్‌. హోమ్స్‌
8. Indian Mutiny of 1857 -మాలీసన్‌