Indian Independence Movement-18

TSStudies
1917 (చంపారన్‌ సత్యాగ్రహం):
బీహార్‌లోని చంపారన్‌ ప్రాంతంలో తిన్‌కథియా విధానం ఉండేది. దీని కారణంగా చంపారన్‌ రైతులు అనేక సమస్యలను ఎదుర్శొనేవారు.
ఇట్టి పరిస్థితులు బెంగాల్‌లో ఇంతకుముందే ఉండగా 1859-61లో రైతులు తిరుగుబాటు చేసి తోట యజమానుల పీడ నుంచి విముక్తులైనారు. ఈ విప్లవాన్ని 'నీలి విప్లవం'గా పిలుస్తారు.
champaran movement,who started champaran movement in india,why champaran movement started in india,role of champaran movement,effect of champaran movement in india,which year started champaran movement in india,champaran movement start date,indian history champaran movement,Kheda Satyagraha of 1918,Summary of Kheda Peasant Struggle,Kheda Satyagraha 1918,End of Kheda,What is Kheda movement,Kheda Struggle,Write short notes on kheda Satyagraha,ahmedabad mill movement,Ahmedabad Mill Workers Satyagraha 1918,why started Ahmedabad Mill Workers Satyagraha,What was Ahmedabad Mill Strike 1918,Ahmedabad Mill Strike 1918 notes in telugu,detailed notes of Ahmedabad Mill Strike 1918,రాజ్‌కుమార్‌ శుక్లా లక్నో నుంచి గాంధీని చంపారన్‌ ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా పిలుపునిచ్చాడు. రాజేంద్రప్రసాద్‌, మహాదేవ్‌ దేశాయ్‌, ఆచార్య కృపాలనీ మొదలగు వారితో బయలుదేరి గాంధీ చంపారన్‌ చేరుకున్నాడు.
కానీ చంపారన్‌ జిల్లా యంత్రాంగం గాంధీపై నిషేధ ఆజ్ఞలను విధించింది. వెంటనే గాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.
చంపారన్‌ ప్రజలు గాంధీ యొక్క సత్యాగ్రహంలో చేరారు. దీనికి భయపడిన చంపారన్‌ జిల్లా యంత్రాంగం గాంధీపై ఉన్న నిషేధ ఆజ్ఞలను ఎత్తివేసి, గాంధీని సభ్యునిగా చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ నివేదిక ఆధారంగా చంపారన్‌లో తీన్‌కథియా విధానం రద్దు చేయబడినది.
జమిందారులు చట్ట వ్యతిరేకంగా వసూలు చేసిన
పన్నులలో 25% పన్నులను రైతులకు తిరిగి ఇచ్చుటకు అంగీకరించారు. ఇది భారతదేశంలో గాంధీ యొక్క మొట్టమొదటి విజయం.

1917-18 ఖేదా ఉద్యమం (గుజరాత్‌):
1917లో గుజరాత్‌లోని ఖేదాలో పంటల దిగుబడి లేకపోవుటచే ఆ సంవత్సరం శిస్తు వసూలు చేయకూడదని మోహన్‌లాల్‌ పాంద్యా ఖేదా ఉద్యమాన్ని చేపట్టాడు.
1918లో గాంధీ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. దీంతో ఖేదాలో పన్ను వసూలును రద్దు చేయుటకు బ్రిటీష్‌ అంగీకరించింది.

1918 అహ్మదాబాద్‌ మిల్లు కార్మికుల సమ్మె:
మిల్లు కార్మికులు వేతనాల పెంపు కొరకు సమ్మె చేపట్టారు. గాంధీ ఈ సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ మొట్టమొదటిసారిగా నిరాహారదీక్ష అనే అహింసా ఆయుధాన్ని ఉపయోగించాడు.
దీంతో మిల్లుల యాజమాన్యం 35% వేతనాలను పెంచింది.