శాసన ఉల్లంఘన ఉద్యమం
శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభించాలనే నిర్ణయం 1929 లాహోర్ ఐ.యన్.సి సమావేశంలో తీసుకున్నారు.
1930 జనవరి 26న భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య
దినోత్సవం జరుపబడింది. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ లాహోర్‌లో రావీ నది తీరాన మొట్ట మొదటిగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసాడు.
1930 జనవరి 31న గాంధీ 11 డిమాండ్స్ అల్టిమేటంను గవర్నర్ జనరల్ 'ఇర్విన్'కు పంపాడు. (11 డిమాండ్లను గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో ప్రచురించాడు).
ఇర్విన్ ఈ 11 డిమాండ్లను తిరస్కరించాడు. దీనితో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీ చర్యలు చేపట్టాడు.
ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం ద్వారా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీ నిర్ణయించాడు.
1930 మార్చి 12న గాంధీ 78 మంది అనుచరులతో అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి కాలినడకన దండికి బయలుదేరాడు.
ఈ 78మందిలో ఏకైక తెలుగువాడు - యెర్నేని సుబ్రమణ్యం
మార్గంమధ్యలో సరోజనినాయుడు, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్‌లు ఉద్యమ యాత్రలో పాల్గొన్నారు.
దండికి చేరుకున్న గాంధీ ఏప్రిల్ 6, 1980న ఉప్పు చట్టాలను ఉల్లంఘించాడు. దీనితో భారతదేశంలో శాసనఉల్లంఘన ఉద్యమం ప్రారంభం అయింది.
గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో అబ్బాస్ త్యాభ్జీని మొదటి సత్యాగ్రాహిగా, సరోజిని నాయుడును రెండవ సత్యాగ్రాహిగా ప్రకటించాడు.
1930 మే నెలలో గుజరాత్ తీరంలో 'దర్శన్'లో జరిగిన సంఘటనను ప్రపంచానికి తెలియజేసిన అమెరికన్ జర్నలిస్ట్ - వెబ్ మిల్లర్
గాంధీ పిలుపుమేరకు ఇండియాలో అనేక ప్రాంతాలలో ఉప్పు చట్టాలు లేదా బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు చట్టాలు, అటవీ చట్టాలు ఉల్లంఘించబడ్డాయి.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్(సరిహద్దు గాంధీ) వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఖుదాయి ఖిద్మత్‌గార్ (దేవుని సేవకులు) అనే ఉద్యమాన్ని చేపట్టాడు.
ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఎర్ర చొక్కాలు ధరించుటచే దీనిని రెడ్ షర్ట్స్ ఉద్యమం అనికూడా అంటారు.
ఈశాన్య రాష్ట్రాలలో రైణీ గైడీలు బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించింది.
యునైటెడ్ ప్రావిన్స్ / ఉత్తర ప్రదేశ్‌లో 'No Tax, No Rent' ఉద్యమం చేపట్టబడింది. No Tax అనే పిలుపు జమిందారులకు (జమిందారులు బ్రిటిష్ వారికి పన్ను చెల్లించకూడదు) Rent అనే పిలుపు రైతులకు(రైతులు జమిందారులకు అద్దె చెల్లించకూడదు) ఇవ్వబడింది.
ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి మొదటి డిక్టేటర్ లేదా నియంత - కొండా వెంకటప్పయ్య.
ఆంధ్రాలో మొదటిగా మచిలీపట్నం వద్ద ఉప్పు చట్టాలు ఉల్లంఘించబడ్డాయి.
శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో ఆరునెలల పసిబిడ్డతో జైలుకెళ్లిన వీర వనిత - కంభంపాటి మాణిక్యాంబ
శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో ఆంధ్రాలో ఈ క్రింది గీతాలు ప్రసిద్ధి చెందాయి.
1. వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి - త్రిపురనేని రామస్వామి చౌదరి
2. కల్లు మానండోయ్ - గొల్లపూడి సీతారామశాస్త్రి
3. బార్దోలి సత్యాగ్రహ విజయం, భారత స్వరాజ్య యుద్ధం - మాడుగంటి జగ్గన్న(జగన్నాథశాస్త్రి)